Skip to main content

Posts

Showing posts from April, 2024

మార్కాపురం పట్టణంలోని 21వ వార్డు కౌన్సిలర్ షేక్ సలీం ఆధ్వర్యములో ఇంటి ఇంటికి తిరుగుతూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఫ్యాను గుర్తుపై ఓటు వేసి వేయించి గెలిపించాలని కోరిన…. వైసిపీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు……………

మార్కాపురం పట్టణంలోని 21వ వార్డు కౌన్సిలర్  షేక్ సలీం ఆధ్వర్యములో ఇంటి ఇంటికి తిరుగుతూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఫ్యాను గుర్తుపై ఓటు వేసి, వేయించి గెలిపించాలని కోరిన….  వైసిపీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు……………  మార్కాపురం పట్టణంలోని 21 వార్డులో ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థిని శ్రీ అన్నా రాంబాబు గారి కి మరియు ఎంపీ అభ్యర్థి అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఫ్యాన్ గుర్తుపై అందరూ ఓటు వేసి గెలిపించాలని కోరిన కౌన్సిలర్ షేక్ సలీం గారు  ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, వైయస్సార్సీపి అభిమానులు, వైఎస్ఆర్సిపి యూత్  పాల్గొన్నారు………….

నిండు మనస్సుతో మీ బిడ్డగా ఆశీర్వదీంచండి…….. మార్కాపురం పట్టణంలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్న ………… ఎమ్మెల్యే అభ్యర్థి సయ్యద్ జావిద్ అన్వర్, ఎంపీ అభ్యర్థి ఈద సుధాకర్ రెడ్డి…………….

నిండు మనస్సుతో మీ బిడ్డగా ఆశీర్వదీంచండి…….. ఎమ్మెల్యే అభ్యర్థి సయ్యద్ జావిద్ అన్వర్, ఎంపీ అభ్యర్థి ఈద సుధాకర్ రెడ్డి………       మార్కాపురం పట్టణంలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్న సయ్యద్ జావిద్………… ప్రకాశం జిల్లా,మార్కాపురం. మార్కాపురం పట్టణంలోని పూలసుబ్బయ్య కాలనీలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సయ్యద్ జావిద్ అన్వర్, ఎంపీ అభ్యర్థి ఈద సుధాకర్ రెడ్డి ముమ్మర ప్రచారం చేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే అభ్యర్థి జావిద్ అన్వర్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని రెండు ప్రధాన పార్టీలు (వైసిపి, టిడిపి ) బ్రష్టు పట్టించారని అభివృద్ధి అంటే కాంగ్రెస్ పార్టీయే తప్ప ఏ ఇతర పార్టీలకు సాధ్యం కాదని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్ల కాలంలో అభివృద్ధి చేయకుండా కల్లబొల్లి మాటలతో ఐదు సంవత్సరాలు కాలయాపన చేశారని తెలిపారు. ప్రజల సొమ్మును జలగల్లా తింటూ ప్రజలతో ఆడుకుంటున్నారని తెలిపారు. నవరత్నాల పథకాలతో అభివృద్ధి లేకుండా ప్రజలను నిలువునా మోసం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పశ్చిమ ప్రకాశానికి వర ప్రధాహిని అయిన వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయకుండానే పూర్తి చేశామని ప్రజలను మభ్య పెట్టారని, కరువుతో వి...

ఒక్క అవకాశం ఇవ్వండి మార్కాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానంటూ, తనదైన శైలిలో ప్రచారాలతో ముందుకు దూసుకు పోతున్న.... కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సయ్యద్ జావిద్ అన్వర్. ప్రకాశం జిల్లా,మార్కాపురం..........

ఒక్క అవకాశం ఇవ్వండి మార్కాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానంటూ తనదైన శైలిలో ప్రచారాలతో ముందుకు దూసుకు పోతున్న....  కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి  సయ్యద్ జావిద్ అన్వర్.  ప్రకాశం జిల్లా,మార్కాపురం..........  ఒక్క అవకాశం ఇవ్వండి మార్కాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానంటూ మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సయ్యద్ జావిద్ అన్వర్ ముమ్మర ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు ప్రతి గడపకు తిరుగుతూ అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ హస్తం గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. వెనుకబడిన పశ్చిమ ప్రాంత అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు. మార్కాపురం నియోజకవర్గంలోని ఐదు మండలాలను కరువు మండలాలుగా ప్రకటింప చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే దేశ అభివృద్ధి, ప్రాంతాల అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ఎమ్మెల్యేగా తనకు ఒక ఓటు, ఎంపి అభ్యర్థి సుధాకర్ రెడ్డికి మరొక ఓటు వేసి ఆశీస్సులు అందజేయాలని కోరారు. ఈ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.......... SHARE Comments Popular posts from th...

ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి…. సయ్యద్ జావిద్ అన్వర్.

ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి… సయ్యద్ జావిద్ అన్వర్……….. కాంగ్రెస్ పార్టీ మార్కాపూరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సయ్యద్ జావిద్ అన్వర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆదివారం నాడు తన కార్యాలయం నుండి ముమ్మర ప్రచారం చేస్తున్న అన్వర్ తనదైన శైలిలో  ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ, ప్రతి ఒక్కరితో మమేకమవుతూ హస్తం గుర్తు పైన ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు ఒక ఓటు, ఎంపీ అభ్యర్థి ఈద సుధాకర్ రెడ్డికి మరొక ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేది ఒక కాంగ్రెస్ తోనే సాధ్యమని తెలిపారు.  ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు…………..

వేసవి కాలంలో.. కళ్ల మంటలా? అయితే ఇలా చేయండి!

వేసవి కాలంలో.. కళ్ల మంటలా? అయితే ఇలా చేయండి! ఎండలు మండుతున్నాయి. ఈ సమయంలో చాలామందికి కళ్లు పొడిబారిపోవడం, కళ్లు ఎర్రబడి మంటలు రావడం సర్వ సాధారణం. అలాంటప్పుడు కొన్ని చిట్కాలు పాటిస్తే ఉపశమనం కలుగుతుంది. ఆ చిట్కాలేమిటో చూద్దాం. ఇలా చేయండి.. పాలలో కాని కలబంద రసంలో కానీ దూదిని ముంచి పదిహేను నిమిషాల పాటు కళ్ళపై పెట్టుకుంటే కళ్ళ అలసట తగ్గుతుంది గంధం చెక్కని అరగదీసి కళ్ళ మీద రాసుకుంటే కళ్ళలోని ఎరుపు తగ్గుతుంది నిద్ర పోయే ముందు నాలుగైదు తేనె చుక్కలు, నువ్వుల నూనె నాలుగైదు చుక్కలు కలిపి కళ్ళలో వేసుకుంటే ఉదయానికి కళ్ళు నిర్మలంగా,స్వచ్ఛంగా ఉంటాయి కళ్ళు మంటగా వుంటే చల్లటి నీటితో కళ్ళు శుభ్రంగా కడుక్కోవాలి. ఆ నీరు కళ్ళ లోని దుమ్ముకణాలు, మలినాలను తీసివేయడంలో సహాయపడుతుంది దూదిని రోజ్‌ వాటర్‌లో ముంచి కనురెప్పులపై 10–15 నిమిషాల పాటు ఉంచాలి. ఇలా చేస్తే కంటిగాయాలకి, కళ్ళ మంటలకి ఉపశమనం లభిస్తుంది దూదిని పాలలో ముంచి కంటిచుట్టు తుడవాలి. తర్వాత చల్లనినీటితో శుభ్రంగా కడుక్కోవాలి దోసకాయ ముక్కల్ని కట్‌ చేసి కను రెప్పుల పై 15 నిమిషాల పాటు ఉంచినట్లయితే కళ్ళ మంట నుంచి ఉపశమనం పొందవచ్చు శుభ్రమైన తెల్లటి వస్త్రాన్ని ...

'పుదీనా'తో.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో?

పుదీనా'తో..  ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో? ప్రకృతి ప్రసాదించిన, తాజాదనాన్ని ఇచ్చే ఎన్నో ఆరోగ్య సుగుణాలు ఉన్న ఆకు పుదీనా. దీనిని నిత్యం ఆహారంలో తీసుకోవడం వల్ల అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వేసవిలో పుదీనా వాడకం మరింత ప్రయోజనకరం. పుదీనా ఆకులలో విటమిన్‌ ఏ, విటమిన్‌ సి, విటమిన్‌ బి–6 లతోపాటు, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం వంటి మినరల్స్, ్రపోటీన్లు, ఫైబర్, కార్బోహైడ్రేట్స్‌ వంటి పోషకాలు పుష్కలంగా ఉండడంతో ఇది మన జీవక్రియను మెరుగుపరుస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజూ పుదీనా వాటర్‌ తీసుకుంటే చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి. బరువు తగ్గడానికి, ముసలితనం త్వరగా రాకుండా ఉండడానికి పుదీనా ఎంతో ఉపయోగపడుతుంది. పుదీనా నీటిని తాగితే శరీరానికి శక్తి లభించడమే కాకుండా చర్మ సమస్య లు తగ్గుతాయి. కళ్ళ కింద నలుపు తగ్గటానికి పుదీనాతో తయారు చేసిన లేపనం ఎంతో ఉపయోగపడుతుంది. శరీరంలోని మలినాలను తొలగించి జీర్ణక్రియను సాఫీగా చేయడానికి, జీర్ణ వ్యవస్థను సక్రమంగా పనిచేసేలా చేయడానికి ఉపయోగపడుతుంది. çపుదీనాను మజ్జిగతో కలిపి తీసుకుంటే మన శరీరంలో వేడి తగ్గుతుంది. అందానికి కూడా! పుదీనా ఆకులను మ...

మార్కాపురం పురపాలక మున్సిపల్ కమిషనర్ గారి చేతుల మీదుగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన…. మున్సిపల్ పురపాలక సిబ్బంది……….

మార్కాపురం పురపాలక  మున్సిపల్ కమిషనర్ గారి చేతుల మీదుగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన…. మున్సిపల్ పురపాలక సిబ్బంది………. మార్కాపురం పురపాలక కార్యాలయం నందు పట్టణ పరిసర ప్రాంత ప్రజల దాహార్తిని దృష్టిలో పెట్టుకొని  మున్సిపల్ డిప్యూటీ ఇంజనీర్ శ్రీ షేక్ సుభాని గారి ఆధ్వర్యములో, మున్సిపల్ కమిషనర్ గారి చేతుల మీదుగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడమైనది.                ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిప్యూటీ ఇంజనీర్ శ్రీ షేక్ సుభాని గారు, మున్సిపల్ మేనేజర్ శ్రీ శ్రీనివాసన్ గారు మరియు మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీ పి ఆదినారాయణ గారు మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు…………..

వైఎస్ఆర్ సీపీ ముస్లిం మైనారిటీ నాయకుల ఆధ్వర్యంలో మైనారిటీ నాయకులు ఇంటింటికి పర్యటించి మతతత్వ పార్టీలను మరియు ఆ పార్టీలతో కలిసి పోటీ చేస్తున్న పార్టీలకు, ముస్లిం సోదరులు గుణపాఠం చెప్పాలని, ముఖ్యంగా బిజెపి , టిడిపి మరియు జనసేన ఈ పార్టీలు గెలిస్తే ముస్లిం సోదరులకు జరిగే నష్టాల గురించి అవగాహన కల్పిస్తున్న…. వైఎస్ఆర్ సీపీ ముస్లిం మైనారిటీ నాయకులు………….

 వైఎస్ఆర్ సీపీ ముస్లిం మైనారిటీ నాయకుల ఆధ్వర్యంలో మైనారిటీ నాయకులు ఇంటింటికి పర్యటించి మతతత్వ పార్టీలను మరియు ఆ పార్టీలతో కలిసి పోటీ చేస్తున్న పార్టీలకు, ముస్లిం సోదరులు గుణపాఠం చెప్పాలని, ముఖ్యంగా బిజెపి , టిడిపి మరియు జనసేన ఈ పార్టీలు గెలిస్తే ముస్లిం సోదరులకు జరిగే నష్టాల గురించి అవగాహన కల్పిస్తున్న….  వైఎస్ఆర్ సీపీ ముస్లిం మైనారిటీ నాయకులు…………. మన  వైఎస్ఆర్ సీపీ ముస్లిం మైనారిటీ నాయకుల ఆధ్వర్యంలో  మన మార్కాపురం పట్టణ  మున్సిపల్  పరిధి లోని 12,13, వార్డ్ లలో మన  వైఎస్ఆర్సీపీ ముస్లిం మైనారిటీ నాయకులు ఇంటింటికి పర్యటించి మతతత్వ పార్టీలను మరియు ఆ పార్టీలతో కలిసి పోటీ చేస్తున్న పార్టీలకు ముస్లిం సోదరులు గుణపాఠం చెప్పాలని.. బిజెపి , టిడిపి మరియు జనసేన ఈ పార్టీలు గెలిస్తే ముస్లిం సోదరులకు 4% రిజర్వేషన్ తీసివేయడం గాక ముస్లింలు ఎక్కువగా నష్టపోవాల్సి వస్తుంది. దయచేసి ఆలోచించి ఓటు వేయండి అని ముస్లిం సోదరుల ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయడం జరిగినది. మన మార్కాపురం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శ్రీ అన్నా రాంబాబు గారిని అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని వార్డ్ ముస్లిం ప్...

మార్కాపురం 111 నియోజకవర్గం, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీల ఆధ్వర్యములో ఉమ్మడి కూటమి అభ్యర్ధి అట్టహాసంగా ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేసిన…. ప్రముఖ న్యాయవాది సయ్యద్ జావిద్ అన్వర్…………

మార్కాపురం 111 నియోజకవర్గం,   కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీల ఆధ్వర్యములో ఉమ్మడి కూటమి అభ్యర్ధి అట్టహాసంగా ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేసిన….   ప్రముఖ న్యాయవాది సయ్యద్ జావిద్ అన్వర్………… ఈరోజు అనగా 25.04.2024 మార్కాపురం 111 నియోజకవర్గం కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీల ఆధ్వర్యములో కాంగ్రెస్స్ పార్టీ అభ్యర్థిగా ప్రముఖ న్యాయవాది సయ్యద్ జావీద్ అన్వర్ అట్టహాసంగా ర్యాలీ గా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమములో పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీల నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు…………