మార్కాపురం నియోజక వర్గం ఎన్డీఏ కూటమి ఎమ్మేల్యే అభ్యర్ధి శ్రీ కందుల నారాయణ రెడ్డిగారి ఆధ్వర్యములో నిర్వహించిన చంద్రబాబు రోడ్ షోను వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేసిన…. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు………..
మార్కాపురం నియోజక వర్గం ఎన్డీఏ కూటమి ఎమ్మేల్యే అభ్యర్ధి శ్రీ కందుల నారాయణ రెడ్డిగారి ఆధ్వర్యములో నిర్వహించిన చంద్రబాబు రోడ్ షోను వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేసిన…. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు……….. మార్కాపురంలో వచ్చిన స్పందన నా జీవితంలో ఎప్పుడు చూడలేదు, వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయటం* *మార్కాపురం ను ప్రత్యేక జిల్లా కావటం ఖాయమని బహిరంగ సభలో ప్రకటించిన మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు…………. పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజాగలం రోడ్ షో మార్కాపురం పట్టణంలో విజయవంతం అయింది ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు స్థానిక గడియారం స్తంభం సెంటర్లో ప్రత్యేక వాహనం నుంచి ప్రజలను ఉద్దేశించి ఘాటుగా ప్రసంగించారు. మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేస్తానని వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి నికర జలాలను అందిస్తానని మెగా డీఎస్సీ ని నిర్వహిస్తామని బహిరంగ సభలో ప్రకటించారు. అంతేకాకుండా మార్కాపురంలో ప్రజలలో వచ్చిన స్పందన నా జీవితంలో ఎన్నడూ చూడలేదని ఆనందాన్ని వ్యక్తపరిచాడు. వైసిపి రాబోయే ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని ప్...