Skip to main content

Posts

Showing posts from February, 2024

వాసవి విజన్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ గంగిశెట్టి కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యములో, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వారి ఆదేశానుసారం పేదలకు బియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించిన… వాసవి విజన్ క్లబ్, మార్కాపురం…………

గంగిశెట్టి కిరణ్ కుమార్ (ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్), గారి ఆధ్వర్యములో,  ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వారి ఆదేశానుసారం పేదలకు బియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించిన… వాసవి విజన్ క్లబ్, మార్కాపురం………… వాసవి విజన్ క్లబ్, మార్కాపురం, వారు లీప్ సంవత్సరం సందర్భంగా, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వారి ఆదేశానుసారం   పోలేపల్లి వెంకట లక్ష్మీనారాయణ (రీజినల్ చైర్ పర్సన్) గారి గృహంలో  పేదలకు బియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో  గంగిశెట్టి కిరణ్ కుమార్ (ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్), పోలేపల్లి వెంకట లక్ష్మీనారాయణ (రీజినల్ చైర్ పర్సన్), నారాయణం వెంకటేశ్వర్లు (జోన్ చైర్పర్సన్), వెలుగూరి వెంకటేశ్వర్లు ( క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు) పంపిణీ చేయడం జరిగినది………….

బిజెపి జాతీయ కౌన్సిల్ సభ్యులు సరోజిని గారి ఆధ్వర్యములో, జిల్లా వైద్యశాల నందు డయాలసిస్ సెంటర్ ను సందర్శించిన… బిజెపి నాయకులు………

బిజెపి జాతీయ కౌన్సిల్ సభ్యులు సరోజిని గారి ఆధ్వర్యములో, జిల్లా వైద్యశాల నందు డయాలసిస్ సెంటర్ ను సందర్శించిన…  బిజెపి నాయకులు………   ఈరోజు 29.2.2024న మార్కాపురం జిల్లా వైద్యశాల నందు డయాలసిస్ సెంటర్ ను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వైద్యశాల సూపర్డెంట్ డాక్టర్ సుబ్బారెడ్డి గారితో మాట్లాడటం జరిగింది. డాక్టర్ గారు వైద్యశాల గురించి పలు విషయాలు మార్కాపురంలో మెడికల్ కాలేజ్ నిర్మిస్తున్న కారణంగా జిల్లా వైద్యశాలను కూడా అభివృద్ధి చేస్తున్నామని 650 పడకలు ఏర్పాటు చేస్తున్నామని డాక్టర్ గారు తెలియజేశారు. తదనంతరం డయాలసిస్ సెంటర్ ను సందర్శించి మేనేజర్ వెంకటేశ్వర్లు గారితో వివరాలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ కౌన్సిల్ సభ్యులు సరోజిని గారు, జిల్లా ఉపాధ్యక్షులు కంభం వెంకటరమణ రావు గారు, జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు మద్దెల లక్ష్మి గారు, ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి జలుకూరి రమేష్ గారు, పట్టణ యువమోర్చా అధ్యక్షులు చిలుకూరి వేణుగోపాల్ రెడ్డి గారు హాస్పటల్ సిబ్బంది పాల్గొన్నారు…………. సదా భరతమాత సేవలో చిలుకూరు వేణుగోపాల్ రెడ్డి యువమోర్చ్ పట్టణ అధ్యక్షులు మార్కా...

ఏపీలో వాలంటీర్లకు గుడ్‌న్యూస్.. అకౌంట్‌లలో డబ్బులు జమ చేశారు, డబ్బులు పడ్డాయో లేదో చెక్ చేస్కోండి………..

ఏపీలో వాలంటీర్లకు శుభవార్త……  అకౌంట్‌లలో డబ్బులు జమ చేశారు, డబ్బులు పడ్డాయో లేదో చెక్ చేస్కోండి……….. జగన్ సర్కార్ ఏపీలో వాలంటీర్లకు అవార్డులు అందజేసిన సంగతి తెలిసిందే. కొద్దిరోజులుగా ఈ కార్యక్రమం జరిగింది. అయితే వాలంటీర్ల అకౌంట్‌లలో డబ్బులు జమ చేయలేదనే విమర్శలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం వెంటనే స్పందించింది.. క్లారిటీ ఇచ్చింది. అకౌంట్‌లలో డబ్బుల్ని జమ చేసినట్లు తెలిపారు.. ఆ డబ్బులు అకౌంట్‌లలో డబ్బులు జమ చేశారో లేదో చెక్ చేసుకోవచ్చని తెలిపారు.  ఏపీ ప్రభుత్వం గ్రామ, వార్డు వాలంటీర్లకు శుభవార్త చెప్పింది. వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో భాగంగా అవార్డుల పంపిణీ పూర్తి చేసింది. 10 రోజుల పాటు ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.. అయితే ఈ అవార్డులకు ఎంపిక చేసిన వారికి డబ్బులు అకౌంట్‌లలో జమ చేయలేదని విమర్శలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.. ఎంపిక చేసిన వాలంటీర్ల ఖాతాల్లో సేవా వజ్ర కింద రూ.45 వేలు, సేవా మిత్ర కింద రూ.30 వేలు, సేవా రత్న కింద రూ.15 వేల నగదు బహుమతులను జ‌మ చేసిన‌ట్లు ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. అకౌంట్‌లలో డబ్బులు పడ్డాయో లేదో ఈ లింక్ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. జగన్ సర్కార్...

“ నేషనల్ సైన్స్ డే “ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన…. డి.ఎస్.ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యం మరియు సిబ్బంది………

“ నేషనల్ సైన్స్ డే “  కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన….  డి.ఎస్.ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యం మరియు సిబ్బంది……… “ నేషనల్ సైన్స్ డే “  సందర్భంగా మార్కాపురం పట్టణములోని భగత్ సింగ్ కాలనీలో ప్రిన్సిపాల్ శ్రీ షేక్. కరీముల్లాగారి ఆథ్వర్యములో నిర్వహించబడుతూ, క్రమశిక్షణా పరంగా, విద్యా పరంగా నైతిక విలువలతో కూడిన విద్యను అందిస్తూ ప్రతి యేటా తమదైన శైలిలో విద్యార్ధులలో చదువు పట్ల ఉత్సాహాన్ని పెంచుతూ, వారిలోని  ప్రతిభను రెట్టింపు చేస్తూ,  అందరి మన్నలను పొందుతూ గుర్తింపు పొందిన డి.ఎస్.ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యం మరియు సిబ్బంది ఆధ్వర్యములో రోబోటిక్స్ సైన్స్ ఎగ్జిబిషన్ మరియు డ్రాయింగ్ పోటీలను నిర్వహించారు.   ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ కరీముల్లా గారు మాట్లాడుతూ విద్యార్ధులలో ఆధునిక సాంకేతికతలో వస్తున్న మార్పులకు అనుగుణంగా నేటితరంలో రోబోట్స్ మనిషికి ఏ విధంగా సహాయపడతాయో వివరించారు. విద్యార్ధులు పలురకాల రోబోట్ లను తయారుచేసి సైన్స్ ఎగ్జిమిషన్ నందు ప్రదర్శించి, చూసేవారిని అహ్లాదకరమైన వాతావరణములోకి తీసుకెళ్లారు.  విద్యార్ధులలో సైన్స్ పట్ల ఆసక్తిని మరింత  పె...

ఏబీయం స్థలాలను పరిశీలించిన…. సబ్ కలెక్టర్ రాహుల్ మీనా………… ఏబీయం ఆస్తులలో ఉన్న ప్రతి ఒక్కరికి నోటీసులు జారీ చేయండి… సబ్ కలెక్టర్ రాహుల్ మీనా ఆదేశం……….

ఏబీయం స్థలాలను పరిశీలించిన…. సబ్ కలెక్టర్ రాహుల్ మీనా………… ఏబీయం ఆస్తులలో ఉన్న ప్రతి ఒక్కరికి నోటీసులు జారీ చేయండి……. సబ్ కలెక్టర్ రాహుల్ మీనా ఆదేశం………. పట్టణంలోని ఏబీయం స్థలాన్ని  మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా బుధవారం సందర్శించారు. కొన్ని సంవత్సరములుగా వివాదాస్పదముగా ఉన్నటువంటి ఏబీయం  స్థలాలను బుధవారం రాహుల్ మీనా సందర్శించి  మార్కాపురం మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు  మార్కాపురం బాప్టిస్ట్ ఫీల్డ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జె. దేవానందం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయగా గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు  వారి ఉత్తర్వులను అమలు చేయాలని గత ఏడాదిగా  సబ్ కలెక్టర్ ను  మార్కాపురం మున్సిపల్ కమిషనర్ ను కలసి వినతి పత్రాలు సమర్పిస్తున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో సబ్ కలెక్టర్ రాహుల్ మీనా బుధవారము ఏ.బీ.యం. బాప్టిస్ట్ ఫీల్డ్ అసోసియేషన్ సభ్యులతో కలిసి ఏబీఎయం స్థలాలను సందర్శించి అక్రమ కట్టడాలకు సంబంధించి ఏబియం  హైస్కూల్ ముందు ఉన్నటువంటి వ్యాపార  దుకాణాదారులకు నోటీసులు ఇచ్చారా లేదా అని టౌన్ ప్లానింగ్ అధికారిని అడగగా ...

ప్రజా పోరు యాత్రలో భాగంగా మార్కాపురం మున్సిపాలిటీ 14వ బ్లాక్ ఇందిరమ్మ కాలనీ ఫేస్ వన్ ప్రాంతవాసుల సమస్యలపై స్పందించి, పర్యటించిన… బిజెపి నాయకులు మరియు కార్యకర్తలు………..

ప్రజా పోరు యాత్రలో భాగంగా మార్కాపురం మున్సిపాలిటీ 14వ బ్లాక్ ఇందిరమ్మ కాలనీ ఫేస్ వన్ ప్రాంతవాసుల సమస్యలపై స్పందించి,  పర్యటించిన… బిజెపి నాయకులు మరియు కార్యకర్తలు……….. ప్రజా పోరు యాత్రలో భాగంగా మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గం మార్కాపురం మున్సిపాలిటీ 14వ బ్లాక్ ఇందిరమ్మ కాలనీ ఫేస్ వన్ ప్రాంతంలో పర్యటించిన బిజెపి నాయకులు.  ఈ సందర్భంగా కాలనీవాసులు వారి సమస్యలను మా దృష్టికి తీసుకువచ్చి మమ్మల్ని పట్టించుకునే నాధుడే లేడా,  మా మొర వినే నాయకులే లేరా,  మా కాలనీకి మౌలిక వసతులు కల్పిస్తామని 15 సంవత్సరాలు పూర్తి అవుతున్న ఒక్క సరైన ప్రజా ప్రతినిధి మాకు న్యాయం చేయలేదని వాపోతున్నారని అన్నారు. ఇందిరమ్మ కాలనీలో కొన్ని వీధులు అడవిని తలపిస్తున్నాయని ఈ సందర్భంగా అసెంబ్లీ ఇన్చార్జ్ పివి కృష్ణారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎస్టీ, ఎస్సీ బీసీలకు మార్కాపురం పట్టణ ప్రాంతానికి 15వ ఆర్థిక సంఘం నిధులు కేటాయించినప్పటికీ మున్సిపాలిటీ వారు సరైన పద్ధతిలో నిధులను వినియోగించుకోలేక గెలిచిన ప్రజాప్రతినిధులు పదవులను ఎంజాయ్ చేస్తున్నారే తప్ప ప్రజా సమస్యలపై దృష్టి పెట్టే పరిస్థితిలో లేరని విచారం వ్యక్తం...

ఇంటర్ మీడియట్ విద్యార్థులు, తల్లిదండ్రులకు చిన్న మనవి……. పూర్తి వివరాలు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, సెక్రటరీ వారు విడుదల చేసిన ఆర్డర్ కాపీని చూడగలరు……

ఇంటర్ మీడియట్ విద్యార్థులు, తల్లిదండ్రులకు చిన్న మనవి……. పూర్తి వివరాలు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, సెక్రటరీ వారు విడుదల చేసిన ఆర్డర్ కాపీని చూడగలరు…………. *ఇంటర్ మీడియట్ విద్యార్థులు, తల్లిదండ్రులకు చిన్న మనవి* హాల్ టికెట్స్ పేరుతో కొన్ని కళాశాలలు విద్యార్థుల నుండి ఫీజు బకాయిలు కానీ, హాజరు చాలలేదు అని డబ్బులు కట్టమని ఇబ్బందులు పెడుతున్నారా? అలా బలవంతంగా బకాయిల పేరుతో డబ్బులు వసూలు చేసే అధికారం ఎవరికీ లేదు.  కళాశాల వాళ్ళు హాల్ టికెట్ ఇవ్వడానికి నిరాకరిస్తే ఆన్ లైన్ లో కూడా హాల్ టికెట్స్ మీకు అందుబాటులో ఉంచారు. మరియు వీటిపై ప్రిన్సిపాల్ సంతకం కూడా ఉండాల్సిన అవసరం లేదు.  *డౌన్‌లోడ్ చేసుకోవచ్చు*. కనుక డబ్బులు లేవని ఆందోళన చెందవద్దు. ఇంటర్ బోర్డ్ వారు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకోగలరు.  పూర్తి వివరాలు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, సెక్రటరీ వారు విడుదల చేసిన ఆర్డర్ కాపీని చూడగలరు………..,,.

బీసీల అభివృద్దే టిడిపి ధ్యేయం. వచ్చే ఎన్నికల్లో టిడిపి విజయం తథ్యం జయహో “ బిసి “ జిల్లా సదస్సులో... పార్టీ జిల్లా అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం………..

బీసీల అభివృద్దే టిడిపి ధ్యేయం.  వచ్చే ఎన్నికల్లో టిడిపి విజయం తథ్యం జయహో బిసి జిల్లా సదస్సులో... పార్టీ జిల్లా అధికార  ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం………… ఒంగోలు. రాష్ట్రంలో అణుగారిన వర్గాలుగా ఉన్న బలహీన వర్గాలకు ఆర్థికంగా,సామాజికంగా, రాజకీయంగా అత్యధిక ప్రాధాన్యతనిచ్చి సమాజంలో వారికి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిన పార్టీ టిడిపి అని  ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం అన్నారు.  టిడిపి జిల్లా అధ్యక్షులు డాక్టర్ నూకసాని బాలాజీ ఆధ్వర్యంలో జయహో బీసీ సదస్సు సోమవారం జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా  హాజరైన  శాసనాల మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో    దేశంలోనే మొట్టమొదటిసారిగా 33% బీసీలకు రిజర్వేషన్లను అందించి పంచాయతీ సర్పంచులుగా, ఎంపీపీలుగా, జిల్లా పరిషత్తు సభ్యులుగా, జిల్లా పరిషత్ చైర్మన్ గా రాజకీయంగా ఉన్నత స్థాయి కల్పించిన మహానేత స్వర్గీయ ఎన్టీ రామారావు అని అన్నారు. మొట్టమొదటి నుండి టిడిపి అట్టడుగు వర్గాలు ముఖ్యంగా బీసీల పక్షపాతిగా ఉంటూ వచ్చిందని, ఎన్టీఆర్ ఆశయాలే చంద్రబాబు లక్ష్యాలుగా పని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారని ...

నరసరావుపేట బిజెపి నియోజకవర్గ కన్వీనర్ రంగి శెట్టి రామకృష్ణ పై దాడి చేయటం హేయమైన చర్య… కంభం వెంకట రమణ రావు ప్రకాశం జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు…..

నరసరావుపేట  బిజెపి నియోజకవర్గ కన్వీనర్ రంగి శెట్టి రామకృష్ణ పై దాడి చేయటం హేయమైన చర్య……… కంభం వెంకట రమణ రావు,  ప్రకాశం జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు………… పల్నాడు జిల్లా నరసరావుపేట బిజెపి నియోజకవర్గ కన్వీనర్ రంగి శెట్టి రామకృష్ణ పై దాడి చేయటం చాలా దురదృష్టకరంగా భావిస్తున్నాం, భౌతిక దాడుల చేయడం వల్ల సమాజం లో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంది, ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడిని ప్రోత్సహించటం చాలా తప్పుడు సంకేతాలకు దారితీస్తుంది ఇటువంటి దాడిని ఖండిస్తూ దాడి చేసిన వ్యక్తులపై ఎస్పీ గారు  స్పందించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను………. సదా భరత మాత సేవలో కంభం వెంకట రమణ రావు ప్రకాశం జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు

విజయవాడలో జరిగిన యంపిజే ఫౌండర్ మెంబర్స్ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫౌండర్ మెంబర్ల సమక్షములో “ మూవ్మెంట్ ఫర్ పీస్ & జస్టీస్ “రాష్ట్ర అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన… షేక్. అబ్దుల్ రజాక్………

విజయవాడలో జరిగిన  యంపిజే ఫౌండర్ మెంబర్స్ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫౌండర్ మెంబర్ల సమక్షములో “ మూవ్మెంట్ ఫర్ పీస్ & జస్టీస్ “ రాష్ట్ర అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన… షేక్. అబ్దుల్ రజాక్……… నేడు విజయవాడలో యంపిజే ఫౌండర్ మెంబర్స్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫౌండర్ మెంబర్లు పాల్గొని మూవ్మెంట్ ఫర్ పీస్ & జస్టీస్ రాష్ట్ర అధ్యక్షులుగా షేక్ అబ్దుల్ రజాక్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ తనకు అప్పజెప్పిన ఈ  భాద్యతను పూర్తి స్థాయిలో న్యాయం చేసి సమాజంలో శాంతి, సాహృద్భావ వాతావరణాన్ని కల్పించెందుకు ప్రయత్నిస్తానని, అందరికీ న్యాయం అందించెందుకు ప్రయత్నం చేస్తానని తెలిపారు.  ఇతను యంపిజే సంస్థలో పట్టణ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో వివిధ బాధ్యతలను నిర్వహిస్తూ అంచెలంచెలుగా నేడు రాష్ట్ర అద్యక్ష బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా యంపిజే నాయకులు, స్నేహితులు, సన్నిహితులు అభినందనలు తెలిపారు……….

*ఆర్టీసీలో విద్యార్థులకు ఉచిత ప్రయాణం*………

*ఆర్టీసీలో విద్యార్థులకు ఉచిత ప్రయాణం*………… ఏపి:పదో తరగతి విద్యార్థులకు APSRTC శుభవార్త చెప్పింది. మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు జరిగే పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. పరీక్ష హాల్ టికెట్ చూపించి పరీక్షా కేంద్రాలకు వెళ్లొచ్చని తెలిపింది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొంది……….

డి.ఎస్.పి సుందర్రావును మర్యాద పూర్వకంగా కలిసిన…టిడిపీ జిల్లా అధికార ప్రతినిధి శాసనాల……….

డి.ఎస్.పి సుందర్రావును మర్యాద పూర్వకంగా కలిసిన… టిడిపీ జిల్లా అధికార ప్రతినిధి శాసనాల……….. మార్కాపురం. మార్కాపురం డి.ఎస్.పి  ఎం. బాలసుందర్రావును  శనివారం ఉదయం డిఎస్పీ కార్యాలయంలో జిల్లా టిడిపి అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డివిజన్ కేంద్రమైన మార్కాపురం పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని, అలాగే ఇటివల కాలంలో సబ్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో  చోరీలు జరుగుతున్నాయని, కావున వీటిని అరికట్టాలని డీఎస్పీ ని అయన కోరారు. అలాగే త్వరలో జరగనున్న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలను ప్రశాంతమైన వాతావరణంలో జరిపేందుకు కృషి చేయాలని జిల్లా టిడిపి అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం డిఎస్పీ యమ్ .బాల సుందరరావును కోరారు…………

మార్కాపురం నియోజక వర్గం తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారి ఆదేశాల మేరకు నిర్వహించిన, ఈ కార్యక్రమములో నియోజవర్గ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇంచార్జ్ కందుల రామిరెడ్డి గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన… వైసీపీకి చెందిన 40 కుటుంబాలు…

తేది:23.2.2024. మార్కాపురం పట్టణం.   మార్కాపురం నియోజక వర్గం తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారి ఆదేశాల మేరకు నిర్వహించిన,  ఈ కార్యక్రమములో నియోజవర్గ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇంచార్జ్  కందుల రామిరెడ్డి గారి సమక్షంలో  తెలుగుదేశం పార్టీలో చేరిన…  వైసీపీకి చెందిన 40 కుటుంబాలు………….. 40 వైసీపీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరిక. ఈరోజు మార్కాపురం పట్టణంలోని 32 వార్డ్ లో వైసీపీకి చెందిన 40 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారి ఆదేశాల మేరకు  నియోజవర్గ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇంచార్జ్  కందుల రామిరెడ్డి గారి సమక్షంలో  తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ వైసిపీ ప్రభుత్వం తమని అన్ని రకాలుగా దగా చేసిందని తమ బతుకులు బాగుపడాలంటే మార్కాపురం ప్రత్యేక జిల్లాతోనే సాధ్యమని  మార్కాపురం ప్రత్యేక జిల్లా మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారు మరియు తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వంతోనే సాధ్యమని ఉద్ఘటించారు. పార్టీలో చేరిన వారిలో  బలపాల హుస్సేన్, పెద్దదీన  (ఉ...

మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి గారి ఆధ్వర్యములో నియోజకవర్గ ముస్లిం మైనారిటీల ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించిన… తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు… ఈ సమావేశానికి పార్టీలకు, కులమతాలకు అతీతంగా హాజరైన నియోజకవర్గ ప్రజలు…… “ అక్కడ నారా గారు- ఇక్కడ నారాయణ రెడ్డి గారు “… ఇదే మార్కాపురం నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీల నినాదం.. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షులు… షేక్ మౌలానా ముస్తాక్ గారు………….

మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి గారి ఆధ్వర్యములో నియోజకవర్గ  ముస్లిం మైనారిటీల  ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించిన… తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు…  ఈ సమావేశానికి పార్టీలకు, కులమతాలకు  అతీతంగా హాజరైన నియోజకవర్గ ప్రజలు……   “ అక్కడ నారా గారు- ఇక్కడ నారాయణ రెడ్డి గారు “… ఇదే మార్కాపురం నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీల నినాదం.. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షులు… షేక్ మౌలానా ముస్తాక్ గారు………… అక్కడ నారా గారు- ఇక్కడ నారాయణ రెడ్డి గారు,  ఇదే మార్కాపురం నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీల నినాదం-  తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ మౌలానా ముస్తాక్ గారు…………. ఈరోజు మార్కాపురం పట్టణంలోని జవహర్ నగర్ లో మార్కాపురం నియోజకవర్గ  ముస్లిం మైనారిటీల  ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా  మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి గారు మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ మౌలానా ముస్తాక్ గారు విచ్చేశారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు కందుల నార...