Skip to main content

Posts

Showing posts from October, 2023

మార్కాపురం పట్టణంలో దోమల బెడద నుండి డెంగ్యూ ,మలేరియా లాంటి విష జ్వరాలు ప్రభలకముందే తక్షణమే *ఫాగ్* చేసి నియంత్రించాలని పట్టణ మున్సిపల్ చైర్మన్ మరియు కమిషనర్ వారికి విన్నవించిన.. సయ్యద్ సాదిక్ జనసేన పార్టీ, ప్రధాన కార్యదర్శి, ప్రకాశం జిల్లా………….

*మార్కాపురం పట్టణ మున్సిపల్ చైర్మన్ మరియు కమిషనర్ వారికి విన్నపము*… మార్కాపురం పట్టణంలో దోమల బెడద నుండి డెంగ్యూ ,మలేరియా లాంటి విష జ్వరాలు ప్రభలకముందే తక్షణమే *ఫాగ్* చేసి నియంత్రించాలని పట్టణ మున్సిపల్ చైర్మన్ మరియు కమిషనర్ వారికి విన్నవించిన..  సయ్యద్ సాదిక్ జనసేన పార్టీ, ప్రధాన కార్యదర్శి, ప్రకాశం జిల్లా…… పట్టణంలో దోమల బెడద విపరీతంగా ఉంది. డెంగ్యూ ,మలేరియా లాంటి విష జ్వరాలు ప్రభలకముందే తక్షణమే *ఫాగ్* చేసి నియంత్రించగలరని కోరుతున్నాము. అదేవిధంగా వీధి కుక్కల స్వైర విహారం కూడా ఎక్కువగా ఉన్నది. రాత్రి వేళల్లో వ్యాపార రీత్యా వేరే ప్రాంతాలకు వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో వీధి కుక్కల దాడి జరిగే పరిస్థితి ఎక్కువగా ఉన్నందున దయచేసి ఈ రెండు సమస్యల మీద ప్రత్యేక దృష్టి సారించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. ప్రజల రక్షణ కొరకు ఎటువంటి ప్రమాదం జరగకముందే చర్యలు తీసుకోవడం సమంజసం అని భావిస్తున్నాము…… సయ్యద్ సాదిక్ జనసేన పార్టీ, ప్రధాన కార్యదర్శి,  ప్రకాశం జిల్లా.

ఒరిజినల్‌ డాక్యుమెంట్లు తనిఖీ చేశాకే మ్యుటేషన్లు. డాక్యుమెంట్స్‌ ఒరిజినలా, కాదా అనేది తహసీల్దార్లు సర్టిఫై చేయాలి ఒరిజినల్స్‌ పరిశీలించినట్లు ఆన్‌లైన్‌లో ధ్రువీకరించాలి జిరాక్స్, ఇతర అనధికార పత్రాలతో మ్యుటేషన్లు చేయకూడదు నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు కలెక్టర్లు, రెవెన్యూ అధికారులకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ సర్క్యులర్‌…………..

ఒరిజినల్‌ డాక్యుమెంట్లు తనిఖీ చేశాకే మ్యుటేషన్లు…       డాక్యుమెంట్స్‌ ఒరిజినలా, కాదా అనేది తహసీల్దార్లు సర్టిఫై చేయాలి  ఒరిజినల్స్‌ పరిశీలించినట్లు ఆన్‌లైన్‌లో ధ్రువీకరించాలి  జిరాక్స్, ఇతర అనధికార పత్రాలతో మ్యుటేషన్లు చేయకూడదు  నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు  కలెక్టర్లు, రెవెన్యూ అధికారులకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ సర్క్యులర్‌…………..   మ్యుటేషన్లకు సంబంధించి ప్రభుత్వం కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. భూములకు సంబంధించిన ఒరిజినల్‌ డాక్యుమెంట్లను తనిఖీ చేశాకే మ్యుటేషన్లు చేయాలని రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించింది. జిరా­క్స్, ట్రూ కాపీలు, ఇతర అనధికారిక పత్రాల ఆధారంగా మ్యుటేషన్లు చేయవద్దని స్పష్టం చేసింది. వీటివల్ల వివాదాలు ఏర్పడుతున్న నేపథ్యంలో ఈ ఆదేశాలిచ్చింది. ఒరిజినల్‌ డాక్యుమెంట్లను తహసీల్దార్లు ధృవీకరించాలని చెప్పింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ యంత్రాంగానికి భూ పరిపాలన ప్రధాన కమిషనర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్‌ సర్క్యులర్‌ జారీ చేశారు. తహశీల్దార్లు ప్రతి మ్యుటేషన్‌కు తప్పనిసరిగా సేల్‌ డీడ్‌ వంటి ఒరిజినల్‌...

గ్యాస్‌ సిలిండర్‌ డెలివరీకి చార్జీలు చెల్లించొద్దు: ఏపీ పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌……….

గ్యాస్‌ సిలిండర్‌ డెలివరీకి చార్జీలు చెల్లించొద్దు: ఏపీ పౌరసరఫరాల శాఖ  కమిషనర్‌ అరుణ్‌కుమార్‌………..  గ్యాస్‌ సిలిండర్‌ డెలివరీ సమయంలో రశీదులో ఉండే మొత్తానికి మించి ఎటువంటి అదనపు చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌ కుమార్‌ మంగళవారం తెలిపారు. పట్టణ ప్రాంతం, గ్రామీణ/పట్టణ ప్రాంతంలోని ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్‌ సెంటర్‌ నుంచి 15 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలు, గిరిజన, కొండ ప్రాంతాలకు ఎటువంటి డెలివరీ చార్జీలు తీసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ నుంచి 15 కిలో మీటర్లు పైబడిన ప్రాంతాలకు మాత్రమే నిర్దిష్ట రుసుము వసూలు చేసేందుకు ప్రభుత్వం అనుమతించిందన్నారు. కానీ గ్యాస్‌ డెలివరీ సమయంలో ఎక్కువ రుసుము వసూలు చేస్తే పౌరసరఫరాల శాఖ, ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ టోల్‌ఫ్రీ నంబర్‌ 1967, 1800 2333555కు ఫిర్యాదు చేయాలని కోరారు…………

భార్య పేరుపై ఉన్న స్థలం అమ్మేసేందుకు బతికుండగానే భార్య పేరిట డెత్ సర్టిఫికేట్.. కానిస్టేబుల్ నిర్వాకం, ఎలా దొరికిపోయాడంటే!

గిద్దలూరు: భార్య పేరుపై ఉన్న స్థలం అమ్మేసేందుకు బతికుండగానే భార్య పేరిట డెత్ సర్టిఫికేట్.. కానిస్టేబుల్ నిర్వాకం,  ఎలా దొరికిపోయాడంటే!………… బతికుండగానే  భార్య పేరిట డెత్ సర్టిఫికేట్.. కానిస్టేబుల్ నిర్వాకం, ఎలా దొరికిపోయాడంటే! ఓ కానిస్టేబుల్ అతి తెలివి ప్రదర్శించాడు.. భార్య పేరు మీద ఉన్న స్థలాన్ని అమ్మేసేందుకు కన్నింగ్ ప్లాన్ చేశాడు. ఏకంగా తన భార్య చనిపోయిందంటూ నకిలీ డెత్త్ సర్టిఫికేట్, నకిలీ ఫ్యామీ మెంబర్ సర్టిఫికేట్‌ తీసుకుని భార్య పేరుపై ఉన్న స్థలాన్ని తన సోదరికి అమ్మేశాడు.. ఈ విషయం తెలియడంతో కానిస్టేబుల్ భార్య పోలీసుకుల ఫిర్యాదు చేశారు.. దీంతో కానిస్టేబుల్‌పై కేసు నమోదైంది. నంద్యాల జిల్లాలో ఈ వ్యవహారం జరిగింది భార్య పేరుపై ఉన్న స్థలం అమ్మేసేందుకు బతికున్న భార్య డెత్ సర్టిఫికేట్ తీసుకున్నాడు ఓ కానిస్టేబుల్ నిర్వాకం బయటపడింది.. భార్య బతికి ఉండగానే చనిపోయినట్లు ధ్రువీకరణ పత్రం పొంది, ఆమె పేరిట ఉన్న నాలుగు సెంట్ల స్థలాన్ని తన సోదరి పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించాడు. ఈ వ్యవహారంలో కానిస్టేబుల్‌పై కేసు నమోదైంది. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం హజత్ గూడేనికి చెందిన తిప్పబోయి...

ఎస్సీవికే (శ్రీ కొప్పరపు వెంకటకృష్ణ) (రీడింగ్ రూమ్) నిలయం నూతన కమిటీ ఎన్నిక………….

మార్కాపురం. ఎస్సీవికే ( (శ్రీ కొప్పరపు వెంకటకృష్ణ) (రీడింగ్ రూమ్)  నిలయం నూతన కమిటీ ఎన్నిక……….. 125 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన శ్రీ కొప్పరపు వెంకటకృష్ణ నిలయం (రీడింగ్ రూమ్) సొసైటీకి నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.  నిలయం సర్వ సభ్య సమావేశం ఆదివారం రీడింగ్ రూమ్ ఆవరణలో జరిగింది. అధ్యక్షులుగా డాక్టర్ ఇమ్మడిశెట్టి బాల సుబ్బారావు (ఐబిఎస్ఆర్), కార్యదర్శిగా గుంటకు సుబ్బారెడ్డి, ఉపాధ్యక్షులుగా శాసనాల వీరబ్రహ్మం, సహాయ కార్యదర్శిగా ఎం రామ్మోహన్, కోశాధికారిగా పి మల్లికార్జున రావు లు ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల ప్రక్రియ కార్యక్రమానికి ఎన్నికల అధికారులుగా ఎస్ వి కె పి డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ బి. డేవిడ్ స్టోన్, చిదా శ్రీనివాస మల్లికార్జున రావు లు వ్యవహరించారు.        ఈ సందర్భంగా నూతన కమిటీని పలువురు ప్రముఖులు అభినందించారు…………..

వాసవి విజన్ క్లబ్ మార్కాపురం రీజినల్ సెక్రటరి సూరే కేశవరావు, ధర్మపత్ని శ్రీదేవి (వనిత క్లబ్, ప్రెసిడెంట్) గార్ల వివాహ వార్షికోత్సవము సందర్భముగా వారిని సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన.. వాసవి విజన్ క్లబ్ టీమ్ మార్కాపురం……….

వాసవి విజన్ క్లబ్ మార్కాపురం,  రీజినల్ సెక్రటరి సూరే కేశవరావు, ధర్మపత్ని శ్రీదేవి (వనిత క్లబ్, ప్రెసిడెంట్) గార్ల వివాహ వార్షికోత్సవము సందర్భముగా వారిని సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన.. వాసవి విజన్ క్లబ్ టీమ్ మార్కాపురం………. 28-10-2023 వ తేదీన వాసవి విజన్ క్లబ్ మార్కాపురం వారు రీజినల్ సెక్రటరి సూరే కేశవరావు ధర్మపత్ని శ్రీదేవి (వనిత క్లబ్, ప్రెసిడెంట్) గార్ల వివాహ వార్షికోత్సవము సందర్భముగా వారిని సత్కరించడము జరిగినది,   ఈ కార్యక్రమములో  ప్రెసిడెంట్: గుర్రం రామారావు, సెక్రటరి: పెసల సుబ్రహ్మణ్యం, ట్రెజరర్: లింగం పూర్ణచంద్రరావు, జోన్ చైర్ పర్సన్: పోలేపల్లి వెంకట లక్ష్మీనారాయణ, ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్: గంగిశెట్టి కిరణ్ కుమార్, క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు వెలుగూరి వెంకటేశ్వర్లు, వాసవియన్ నారాయణం వెంకటేశ్వర్లు గార్లు పాల్గొన్నారు…….

నీతి ఆయోగ్ (కేంద్ర ప్రభుత్వ) గుర్తింపు కలిగిన ప్రజా సంకల్ప వేదిక, ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఆర్టీఐ ఉచిత ఐడి కార్డుల జారీ మరియు ఆర్టీఐ కార్యకర్తల నియామకాలు………..

నీతి ఆయోగ్ (కేంద్ర ప్రభుత్వ) గుర్తింపు కలిగిన ప్రజా సంకల్ప వేదిక, ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో   ఆర్టీఐ ఉచిత ఐడి కార్డుల జారీ మరియు ఆర్టీఐ కార్యకర్తల నియామకాలు……….. *ఆర్టీఐ ఉచిత ఐడి కార్డుల జారీ* & *ఆర్టీఐ కార్యకర్తల నియామకం* నీతి ఆయోగ్ (కేంద్ర ప్రభుత్వ) గుర్తింపు కలిగిన ప్రజా సంకల్ప వేదిక - ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఆర్టీఐ యాక్టివిస్టుల నియామకం జరుగుతుంది. *ఉచిత ప్రయోజనాలు: * ఆర్టీఐ ఐడి కార్డుల జారీ. ఆర్టీఐ ధరకాస్తుల నమూనాల జారీ ఆర్టీఐ చట్టం పుస్తకం జారీ ఆర్టీఐ చట్టం పై అవగాహన కల్పించడం. ఆర్టీఐ యాక్టివిస్టులకు అండగా ఉండటం. *స్థలం:* ప్రజా సంకల్ప వేదిక జిల్లా కార్యాలయం - ఒంగోలు 7 వ లైన్, రామ్ నగర్, డి మార్ట్ ఎదురు లైన్, ఒంగోలు. *తేదీలు:* 29-10-2023 & 05-11-2023(ఆదివారం) మధ్యాహ్నం 02:00 గంటల నుండి 05:00 గంటల వరకు……

ఏసీబీ కోర్టు జడ్జికి చంద్రబాబు లేఖ. భద్రతాపరమైన అంశాలపై పలు కీలక విషయాలు ప్రస్తావన, జైల్లో నా ప్రాణాలకు ముప్పు.. డ్రోన్ రెండుసార్లు ఎగిరింది, పెన్ కెమెరాతో రికార్డ్ చేశారు: చంద్రబాబు………..

ఏసీబీ కోర్టు జడ్జికి చంద్రబాబు లేఖ. భద్రతాపరమైన అంశాలపై  పలు కీలక విషయాలు ప్రస్తావన,  జైల్లో నా ప్రాణాలకు ముప్పు.. డ్రోన్ రెండుసార్లు ఎగిరింది,  పెన్ కెమెరాతో రికార్డ్ చేశారు: చంద్రబాబు………. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టై రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి లేఖ రాశారు. ఈ నెల 25న జడ్జికి లేఖ రాయగా.. జైలు అధికారుల ద్వారా ఏసీబీ జడ్జికి చంద్రబాబు లేఖ పంపారు. తన భద్రతాపరమైన అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ.. సెక్యూరిటీపై ఆందోళన వ్యక్తం చేస్తూ మూడు పేజీల్లో ఈ లేఖను రాశారు చంద్రబాబు. టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జికి లేఖ రాశారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు అధికారుల ద్వారా ఈ లేఖను న్యాయమూర్తికి పంపారు. ఈ నెల 25న జడ్జికి టీడీపీ అధినేత లేఖ రాశారు. తన భద్రతపై అనుమానాలు, ఆందోళన వ్యక్తం చేస్తూ చంద్రబాబు మూడు పేజీల లేఖ రాశారు.. ఇందులో పలు కీలక అంశాలను ప్రస్తావించారు 'జైల్‌ చుట్టూ జరుగుతున్న పరిణామాలను మీ దృష్టికి తీసుకొద్దామనుకుంటున్నాను. నాకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కూడా ఉంది. నన్ను అంతమొందించేందుకు వా...

కార్యకర్తలే నా బలం - ప్రజలే నా బలగం అంటున్న వై. సి.పి. సీనియర్ నాయకులు ఉడుముల కోటిరెడ్డి……..

కార్యకర్తలే నా బలం - ప్రజలే నా బలగం అంటున్న.. వై. సి.పి. సీనియర్ నాయకులు  ఉడుముల కోటిరెడ్డి…………

కె.సి. గుప్తా వర్ధంతి సందర్భముగా స్థానిక పగడాల లక్ష్మి రెడ్డి గారి సహకారముతో హాస్పిటల్ నందు ప్రజలకు బ్లడ్ గ్రూపింగ్ నిర్వహించిన.. వాసవి విజన్ క్లబ్ & టీమ్ మార్కాపురం………..

కె.సి. గుప్తా వర్ధంతి సందర్భముగా స్థానిక పగడాల లక్ష్మి రెడ్డి గారి సహకారముతో  హాస్పిటల్ నందు ప్రజలకు బ్లడ్ గ్రూపింగ్ నిర్వహించిన.. వాసవి విజన్ క్లబ్ & టీమ్ మార్కాపురం……….. 25-10-2023 వ తేదీన వాసవి విజన్ క్లబ్, మార్కాపురం వారు కె.సి. గుప్తా వర్ధంతి సందర్భముగా స్థానిక పగడాల లక్ష్మి రెడ్డి గారి సహకారముతో  హాస్పిటల్ నందు ప్రజలకు బ్లడ్ గ్రూపింగ్ నిర్వహించడము జరిగినది, తదుపరి పేషెంట్లకు అల్పాహారము ఏర్పాటు చేయడము జరిగినది.  ఈ కార్యక్రమములో  ప్రెసిడెంట్: గుర్రం రామారావు, ట్రెజరర్: లింగం పూర్ణచంద్రరావు, జోన్ చైర్ పర్సన్: పోలేపల్లి వెంకట లక్ష్మీనారాయణ, క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు: వెలుగూరి వెంకటేశ్వర్లు ల్యాబ్ టెక్నీషియన్: వెంకటేశ్వర్లు గారు పాల్గొనడము జరిగినది………….

కె.సి. గుప్తా వర్ధంతి సందర్భముగా స్థానిక వి.వి.యస్. ల్యాబరేటరీ నందు, ఆర్.ఎంపి. డాక్టర్. వెలుగు శ్రీనివాసులు గారి పర్యవేక్షణలో ప్రజలకు బ్లడ్ గ్రూపింగ్ నిర్వహించిన.. వాసవి వనిత క్లబ్, తర్లుపాడు………..

కె.సి. గుప్తా వర్ధంతి సందర్భముగా స్థానిక వి.వి.యస్. ల్యాబరేటరీ నందు, ఆర్.ఎంపి. డాక్టర్. వెలుగు శ్రీనివాసులు గారి పర్యవేక్షణలో ప్రజలకు బ్లడ్ గ్రూపింగ్ నిర్వహించిన.. వాసవి వనిత క్లబ్, తర్లుపాడు……….. 25-10-2023 వ తేదీన వాసవి వనిత క్లబ్, తర్లుపాడు వారు  కె.సి. గుప్తా వర్ధంతి సందర్భముగా స్థానిక వి.వి.యస్. ల్యాబరేటరీ నందు, ఆర్.ఎంపి. డాక్టర్: వెలుగు శ్రీనివాసులు గారి పర్యవేక్షణలోప్రజలకు బ్లడ్ గ్రూపింగ్ నిర్వహించడము జరిగినది.   ఈ కార్యక్రమములో ప్రెసిడెంట్ పెరుమాళ్ల కృష్ణకుమారి, జిల్లానాయకురాలు  కొప్పరపు రంగరత్నమ్మగారు మరియు వనితక్లబ్ సభ్యులు పాల్గొన్నారు……….

కాల్‌చేస్తే ‘సరి’.. దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న ‘సమీకృత రైతు సమాచార కేంద్రం’ ఒక్క ఫోన్‌తో రైతుల సాగు ఇబ్బందులు పరిష్కారం, విశేష అనుభవం కల్గిన ఆరుగురు శాస్త్రవేత్తలతో ప్రత్యేక బృందం, కాల్‌ సెంటర్‌లో 54 మంది సిబ్బంది.. రోజుకు రెండు షిఫ్ట్‌ల్లో సేవలు సగటున రోజుకు 649 కాల్స్‌……..

కాల్‌చేస్తే ‘సరి’..       దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న ‘సమీకృత రైతు సమాచార కేంద్రం’  ఒక్క ఫోన్‌తో రైతుల సాగు ఇబ్బందులు పరిష్కారం  విశేష అనుభవం కల్గిన ఆరుగురు శాస్త్రవేత్తలతో ప్రత్యేక బృందం  కాల్‌ సెంటర్‌లో 54 మంది సిబ్బంది.. రోజుకు రెండు షిఫ్ట్‌ల్లో సేవలు  సగటున రోజుకు 649 కాల్స్‌..  సమస్యకు సంబంధించిన ఫొటోలు వాట్సప్‌ నెంబర్లకు పంపితే చాలు  తీవ్రతను బట్టి 24 గంటల్లో క్షేత్రస్థాయి పరిశీలన  40 నెలల్లో 7.79 లక్షల కాల్స్‌.. 11,725 వాట్సాప్‌ మెసేజ్‌లు  90 శాతానికి పైగా రైతు సమస్యలు పరిష్కారం  ఏపీ స్ఫూర్తితో తెలంగాణాలోనూ కాల్‌ సెంటర్‌ ఏర్పాటు  రాజస్థాన్‌తో పాటు ఇథియోపియాలోనూ ఆ దిశగా అడుగులు…………. క్షేత్రస్థాయిలో అన్నదాతలు ఎదుర్కొనే ప్రతీ సమస్యకు చిటికెలో పరిష్కారం చూపిస్తోంది ‘సమీకృత రైతు సమాచార కేంద్రం’. రైతు సమస్యల పరిష్కారం కోసం మూడున్నరేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఈ కేంద్రం ఇప్పు­డు దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఒక్క ఫోన్‌కాల్‌ లేదా వాట్సప్‌ మెసేజ్‌ చేస్తే చాలు.. ఎలాంటి సమస్యకైనా వెంటనే సమాధానం దొరుకుతోంది. జా...

జిల్లా పర్యటనలో భాగంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గం లో కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు జిల్లా నాయకులతో సమావేశమై రైతుల సమస్యలపై చర్చించిన………… జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు బొంతల కృష్ణ గారు.

జిల్లా పర్యటనలో భాగంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గం లో కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు జిల్లా నాయకులతో సమావేశమై రైతుల సమస్యలపై చర్చించిన………… జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు బొంతల కృష్ణ గారు. ఈరోజు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు బొంతల కృష్ణ గారు జిల్లా పర్యటనలో భాగంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గం లో కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు జిల్లా నాయకులతో సమావేశమై రైతుల సమస్యలు పంటలు వాటర్ సమస్య పసల బీమా సమస్యలు రైతులకు రావాల్సిన ఇన్సూరెన్స్ వివిధ రైతుల సమస్యలపై చర్చించి పార్టీ బలోపేతం అవ్వడానికి కిసాన్ మోర్చా మండల కమిటీలను త్వరితగతిన పూర్తి చేయాలని దిశా నిర్దేశం చేయడం జరిగింది……….

పదోన్నతుల పరంపర…… గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కొనసాగుతున్న పదోన్నతులు…………

పదోన్నతుల పరంపర……  గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కొనసాగుతున్న పదోన్నతులు………… గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు పదోన్నతుల పరంపర కొనసాగుతోంది. ప్రభుత్వం నిర్దేశించిన మేరకు ఆయా శాఖల్లో ఖాళీలు ఏర్పడిన వెంటనే సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించి పోస్టింగ్‌లు ఇస్తున్నారు. ఇప్పటికే ఉద్యానవన అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించగా... తాజాగా వెటర్నరీ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల్లో పనిచేస్తున్న 35 మంది గ్రామ పశుసంవర్థక అసిస్టెంట్లకు పదోన్నతి కల్పించారు. వారిని అదే జిల్లా పరిధిలోని వివిధ పశువైద్యశాలల్లో ఖాళీగా ఉన్న వెటర్నరీ అసిస్టెంట్‌ పోస్టుల్లో నియమిస్తూ ఈ నెల 19వ తేదీన ఉమ్మడి గుంటూరు జిల్లా ఏడీహెచ్‌వో ఉత్తర్వులు జారీ చేశారు.   ప్రభుత్వం నిర్దేశించిన మేరకు..   గ్రామ, వార్డు సచివాలయాల్లో వివిధ శాఖల ఆధ్వర్యాన 19 కేటగిరీల ఉద్యోగులు పని చేస్తున్నారు. వారిలో 17 కేటగిరీల ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియకు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ 17 కేటగిరీలకు సంబంధించిన శా...

వాసవి వనిత క్లబ్ అధ్యక్షురాలు సూరే. శ్రీదేవిగారి ఆధ్వర్యములో…పాదర్తి వెంకట నారాయణ సుజాత గారి మనవళ్లు ఇషాన్ , విహాన్ (USA)ల పుట్టినరోజు సందర్భంగా బ్రహ్మంగారి గుడి దగ్గర గల అంగన్వాడి స్కూల్ నకు బెంచీలు బహుకరించిన… మద్దాల ఆదిత్య కుమార్, మద్దాలసుదీప్తి……

జై వాసవి జై జై వాసవి  వాసవి వనిత క్లబ్ అధ్యక్షురాలు  సూరే. శ్రీదేవిగారి ఆధ్వర్యములో…పాదర్తి వెంకట నారాయణ సుజాత గారి మనవళ్లు ఇషాన్ , విహాన్ (USA)ల పుట్టినరోజు సందర్భంగా  బ్రహ్మంగారి గుడి దగ్గర గల అంగన్వాడి స్కూల్ నకు  బెంచీలు  బహుకరించిన… మద్దాల ఆదిత్య కుమార్, మద్దాలసుదీప్తి…… వాసవి వనిత క్లబ్ అధ్యక్షురాలు సూరే. శ్రీదేవిగారి ఆధ్వర్యములో… మద్దాల ఆదిత్య కుమార్, మద్దాల సుదీప్తి కుమారులు ఇషాన్ , విహాన్ (USA). పాదర్తి వెంకట నారాయణ సుజాత గారి మనవళ్ళ పుట్టినరోజు సందర్భంగా  బ్రహ్మంగారి గుడి దగ్గర గల అంగన్వాడి స్కూల్ నకు  బెంచీలు  బహుకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటువంటి మంచి కార్యక్రమానికి మా వంతు సహాయసహకారాలు ఎప్పుడూ ఉంటాయని, ఈ అవకాశాన్ని ఇచ్చిన వాసవి వనిత క్లబ్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. చివరిగా అక్కడి పిల్లలకు స్వీట్లు హాట్ పంచడం జరిగినది.           ఈ కార్యక్రమములో ప్రెసిడెంట్ సూరే శ్రీదేవి, ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ గోళ్ళ వరలక్ష్మి గారు, ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేట్ గోళ్ళ వాసుదేవరావు గారు, సీని...

సొంత వైద్యం మానుకో!……..

సొంత వైద్యం మానుకో!………... వైద్యుల ప్రిస్క్రిప్షన్‌ లేకుండా నేరుగా మెడికల్‌షాపులకు వెళ్లి మాత్రలు తీసుకుని వేసుకునేవారి సంఖ్య ఇటీవల బాగా పెరిగింది. కొందరికి ఏమీ గాకపోయినా మరికొందరికి సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తున్నాయి. ఇంకొందరికి దీర్ఘకాలంలో సమస్యలు వచ్చి ప్రాణాపాయంలోకి నెట్టేస్తున్నాయి. సొంత వైద్యం కొంత మానుకుని వైద్యుల వద్దకు వెళ్లి ఆరోగ్య సమస్యలకు చికిత్స చేసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. కోవిడ్‌ తర్వాత మందుల దుకాణాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రజలకు ఆరోగ్యం పట్ల అవగాహన పెరగడం, కోవిడ్‌ అనంతరం పలు వ్యాధులు వస్తుండటంతో ప్రజలకు అటు వైద్యులు, ఇటు మందుల అవసరం అధికమైంది. ఈ క్రమంలో వైద్యుల సంఖ్యతో పాటు మెడికల్‌ షాపుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఫలితంగా నగరాలు, పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రధాన రహదారుల్లో ఇప్పుడు మెడికల్‌ షాపులు దర్శనమిస్తున్నాయి. అయితే, అధిక శాతం దుకాణాల్లో వైద్యుల మందుల చీటి లేకుండానే అన్ని రకాల మందులు విక్రయిస్తున్నారు. కోవిడ్‌ సమయం నుంచి ఈ విపరీత ధోరణి మరింత అధికమైంది. వైద్యుల వద్ద ఖర్చు పెరగడమే కారణం ఏదైనా ఒంట్లో నలతగా ఉంటే గతంలో సమీపంలోని వైద్యులను సంప్రదించి ...

ఏపీ ‘కాంట్రాక్టు’ ఉద్యోగులకు శుభవార్త ప్రభుత్వ శాఖల్లో 10,117 మంది సర్వీసు క్రమబద్ధీకరణ గవర్నర్‌ ఆమోదంతో గెజిట్‌లో ముద్రించిన ప్రభుత్వం మరో ఎన్నికల హామీని నెరవేర్చిన సీఎం జగన్‌ సర్కారు………….

ఏపీ ‘కాంట్రాక్టు’ ఉద్యోగులకు శుభవార్త…. ప్రభుత్వ శాఖల్లో 10,117 మంది సర్వీసు క్రమబద్ధీకరణ  గవర్నర్‌ ఆమోదంతో గెజిట్‌లో ముద్రించిన ప్రభుత్వం  మరో ఎన్నికల హామీని నెరవేర్చిన సీఎం జగన్‌ సర్కారు………….   గత ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని నెరవేరుస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కార్యరూపంలోకి తెచ్చింది. వివిధ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఈమేరకు ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ బిల్లుకు గవర్నర్‌ ఆమోదం లభించడంతో చట్ట రూపం సంతరించుకుంది. ఈ చట్టానికి సంబంధించి శుక్రవారం ప్రభుత్వ గజిట్‌లో ముద్రించింది. దీనిద్వారా 02–06–2014కు ముందు కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న దాదాపు 10,117 మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సర్వీసు క్రమబద్థీకరణ జరగనుంది. దీనివల్ల ప్రభుత్వంపై ఏటా దాదాపు రూ.311 కోట్ల ఆర్థిక భారం పడనుంది.      ఉద్యోగ సంఘాల హర్షం  మాట ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఆంధ్రప్...

AP CMO: ఒంగోలు భూ కుంభకోణం.. ప్రకాశం జిల్లా ఎస్పీకి సీఎంవో నుంచి పిలుపు..

AP CMO: ఒంగోలు భూ కుంభకోణం.. ప్రకాశం ఎస్పీకి సీఎంవో నుంచి పిలుపు.. అమరావతి: ప్రకాశం జిల్లా ఒంగోలులో భూ కుంభకోణం సంచలనంగా మారిన నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ జిల్లా ఎస్పీ మలికా గార్గ్‌కు ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) నుంచి పిలుపొచ్చింది………….. భూ కుంభకోణంపై పూర్తి వివరాలతో రావాలని సీఎంవో అధికారులు ఎస్పీకి సమాచారమిచ్చారు. దీంతో సంబంధిత దస్త్రాలతో మలికా గార్గ్‌ బయల్దేరారు.  నకిలీ డాక్యుమెంట్లు, స్టాంపులతో ప్రైవేటు భూములపై అక్రమ లావాదేవీలు జరిగాయన్న బాధితుల ఫిర్యాదుతో స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ దర్యాప్తు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కేసు అధికార వైకాపా ముఖ్యనేతలు, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి మధ్య పోరుగా మారింది. ఈ క్రమంలో ఇటీవల బాలినేని తన గన్‌మెన్లను ప్రభుత్వానికి సరెండర్‌ చేశారు.. మరోవైపు ఇదే విషయంపై బాలినేని గురువారం సీఎంవోకు వెళ్లారు. ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయ రెడ్డిని కలిసి ఈ కేసు సంగతి తేల్చేలా జిల్లా అధికారులను ఆదేశించాలంటూ పట్టుబట్టినట్లు తెలిసింది. 'నా పక్కనుండేవారైనా, పార్టీ (వైకాపా) మనుషులైనా.. కేసులో ఎవరున్నా సరే అరెస్టు చేయండి. జిల్లా కలెక్టర్‌,...

QR Code: క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తున్నారా? అయితే జాగ్రత్త…ఎడాపెడా క్యూఆర్‌ కోడ్లను స్కాన్‌ (QR Code Scanner) చేస్తున్నారా? అయితే జాగ్రత్త. ముఖ్యంగా ఈమెయిళ్లకు వచ్చే క్యూఆర్‌కోడ్లను ఫోన్‌తో స్కాన్‌ చేసేటప్పుడు అప్రమత్తత అవసరం………..

QR Code: క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తున్నారా? అయితే జాగ్రత్త… ఎడాపెడా క్యూఆర్‌ కోడ్లను స్కాన్‌ (QR Code Scanner) చేస్తున్నారా? అయితే జాగ్రత్త. ముఖ్యంగా ఈమెయిళ్లకు వచ్చే క్యూఆర్‌కోడ్లను ఫోన్‌తో స్కాన్‌ చేసేటప్పుడు అప్రమత్తత అవసరం………. వీటితో హ్యాకర్లు మోసాలకు పాల్పడే అవకాశముందని సైబర్‌ భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇమేజ్‌ రూపంలోని టెక్స్ట్‌, క్యూఆర్‌ కోడ్‌తో కూడిన ఈమెయిళ్లను హ్యాకర్లు పంపిస్తున్నారని వివరిస్తున్నారు. ఈమెయిల్‌ బాక్సుల్లోకి చొరబడటానికి ప్రయత్నించే మోసగాళ్లను సైబర్‌ సెక్యూరిటీ సొల్యూషన్లు సమర్థంగా వడపోస్తున్నప్పటికీ మోసగాళ్లు ఇలాంటి కొత్త పద్ధతులను ఆశ్రయిస్తున్నారు. మల్టీఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌కు సంబంధించి అర్జంట్‌ యాక్షన్‌ నీడెడ్‌ వంటి హెడర్లతో బురిడీ కొట్టిస్తున్నారు. ఈమెయిల్‌ సెక్యూరిటీ సాధనాల కంట పడకుండా నేరగాళ్లు క్యూఆర్‌ కోడ్లను వాడుకోవటం ఎక్కువైంది. నిజానికి ఫిషింగ్‌ కోసం క్యూఆర్‌ కోడ్లను ఉపయోగించటం కొత్తేమీ కాదు గానీ వీటిని గుర్తించకుండా ఉండటానికి లేయర్ల పద్ధతిని వినియోగించుకుంటున్నారని భద్రతా నిపుణులు చెబుతున్నారు. ఇమేజ్‌లతో కూడిన ఇలాంటి కోడ్లను ఫోన్‌...

బిల్లులు లేకుండా అమ్మకాలు సాగిస్తున్న బియ్యం సీజ్…. బేస్తవారిపేట జంక్షన్ లోని వాసవి రైస్ మిల్…. 10 టన్నుల బియ్యం సీజ్ చేసిన ఒంగోలు డీఎస్ఓ… 6ఏ కేసు నమోదు……...……

బిల్లులు లేకుండా అమ్మకాలు సాగిస్తున్న బియ్యం సీజ్…. బేస్తవారిపేట జంక్షన్ లోని వాసవి రైస్ మిల్…. 10 టన్నుల బియ్యం సీజ్ చేసిన ఒంగోలు డీఎస్ఓ… 6ఏ కేసు నమోదు………… బేస్తవారిపేట మండలంలోని అది ఓ పేరు మోసినటువంటి రైస్ మిల్ అలాంటి రైస్ మిల్లు. తమకు ప్రజా ప్రతినిధుల అండదండలు ఉన్నాయి అధికారులు ఏమి చేస్తారులే అనుకున్నారో ఏమో ఆ మిల్లు యజమాని. మార్కాపూర్ డివిజన్లోనే రైస్ మిల్లు అత్యధిక టెక్నాలజీతో వడ్లను బియ్యం గా మార్చుతూ ఇక్కడి నుండి హోల్ సీల్ గా మరియు రిటైల్ గా అమ్మకాలు సాగిస్తూ ఉంటారు. గత నాలుగు సంవత్సరాల నుండి ఈ మిల్లులో ఎలాంటి బిల్లులు లేకుండా వడ్లను బియ్యముగా మార్చి అధిక మొత్తంలో అమ్మకాలు సాగిస్తూ ఉంటారు. ఇక్కడే అధికారులు పప్పులో కాలేసినట్లయింది. గత కొన్ని సంవత్సరాలుగా నంద్యాల, కర్నూల్, దర్శి, త్రిపురాంతకం తదితర ప్రాంతాల్లో అధిక మొత్తంలో వడ్లు కొనుగోలు చేసే రైస్ మిల్ యజమాని అక్కడ  కొనుగోలు చేసిన వడ్లు కొనుగోలు చేసి అక్కడ నగదు చెల్లించిన బిల్లులు కానీ, ఇక్కడ బియ్యం అమ్మకాలు చేసినటువంటి బిల్లులు గాని, రోజువారి బిల్లులు లేకపోవడం ఆశ్చర్యకరం. ప్రభుత్వానికి టాక్స్ రూపేనా చెల్లించాల్సిన నగదు ఎక్కడ...

15-10-2023న భీమవరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ మినిస్ట్రీయల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ స్టేట్ బాడీ ఎన్నికలలో వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన గిద్దలూరు నగర పంచాయతీలో సీనియర్ అసిస్టెంట్ మరియు ఇంచార్జీ సానిటరీ ఇన్స్పెక్టర్ ……..శ్రీ షేక్ టపా ఖాదర్ వలిగారు……….

*మునిసిపల్ ఉద్యోగస్థుల సంఘము రాష్ట్ర ఉపాధ్యక్షులుగా షేక్ టపా ఖాదర్ వలి*                  15-10-2023న భీమవరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ మినిస్ట్రీయల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ స్టేట్ బాడీ ఎన్నికలలో వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన  గిద్దలూరు నగర పంచాయతీలో  సీనియర్ అసిస్టెంట్ మరియు ఇంచార్జీ సానిటరీ ఇన్స్పెక్టర్ … శ్రీ షేక్ టపా ఖాదర్ వలిగారు………… తేది 15-10-2023 న భీమవరం లో జరిగిన ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ మినిస్ట్రీయల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఎన్నికల లో స్టేట్ బాడీ నకు వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడిన గిద్దలూరు నగర పంచాయతీలో  సీనియర్ అసిస్టెంట్ మరియు ఇంచార్జీ సానిటరీ ఇన్స్పెక్టర్ అయిన శ్రీ షేక్ టపా ఖాదర్ వలి గారిని సన్మానం చేసి అభినందనలు తెలియజేసిన నగర పంచాయతీ కమిషనర్ వై రామకృష్ణయ్య, స్పెషల్ ఆఫీసర్ శ్రీ విష్ణు వర్ధన్ గారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆశిష్ కుమార్ గారు, సీనియర్ అసిస్టెంట్ వంశీకృష్ణగారు, JA వెంకటయ్యగారు, అకౌంట్స్ ఆఫీసర్ రామకోటేశ్వరమ్మగారు మరియు నగర పంచాయతీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది అభినందనలు తెలిపినారు……….