కోటికి చేరువలో ‘జగనన్న సురక్ష’………. నేటితో ముగియనున్న కార్యక్రమం. 15,002 సచివాలయాల వద్ద క్యాంపులు పూర్తి, రాష్ట్రవ్యాప్తంగా 1.38 కోట్ల కుటుంబాల వద్దకు వలంటీర్లు, 40.52 లక్షల మందికి కుల ధ్రువీకరణ పత్రాలు, 38.52 లక్షల మందికి ఇన్‌కమ్ సర్టిఫికెట్లు………….
కోటికి చేరువలో ‘జగనన్న సురక్ష’………. నేటితో ముగియనున్న కార్యక్రమం 15,002 సచివాలయాల వద్ద క్యాంపులు పూర్తి రాష్ట్రవ్యాప్తంగా 1.38 కోట్ల కుటుంబాల వద్దకు వలంటీర్లు 40.52 లక్షల మందికి కుల ధ్రువీకరణ పత్రాలు 38.52 లక్షల మందికి ఇన్‌కమ్ సర్టిఫికెట్లు…………. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం ద్వారా నెల రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 1.38 కోట్ల కుటుంబాలను ఇంటివద్ద కలుసుకోవడం ద్వారా పెండింగ్ సమస్యలు లేకుండా అధికార యంత్రాంగం ప్రతి ఇంటినీ జల్లెడ పట్టింది. జూన్ 23వ తేదీన సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం నేటితో (జూలై 31వ తేదీ) ముగియనుంది. రాష్ట్రవ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాలు ఉండగా శనివారం నాటికే 15,002 సచివాలయాల వద్ద మండల స్థాయి అధికారుల స్థాయిలో ప్రత్యేక వినతుల పరిష్కార క్యాంపులు పూర్తయ్యాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హులు ఏ ఒక్కరూ మిగిలిపోరాదనే లక్ష్యంతో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. విద్యాసంస్థల్లో అడ్మిషన్లు జరుగుతున్న తరుణంలో విద్...