Skip to main content

Posts

Showing posts from June, 2023

మార్కాపురం చేరుకున్న కందుల నారాయణరెడ్డి. ఈ సందర్భంగా ఘన స్వాగతం పలికిన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ళపల్లి సత్యనారాయణ, పట్టణపార్టీ అధ్యక్షులు ఎస్ కే. మౌలాలి, పార్టీ కార్యకర్తలు, నాయకులు,అభిమానులు, ఆయన బంధు మిత్రులు………

మార్కాపురం చేరుకున్న కందుల నారాయణరెడ్డి. ఈ సందర్భంగా ఘన స్వాగతం పలికిన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ళపల్లి సత్యనారాయణ, పట్టణపార్టీ అధ్యక్షులు ఎస్ కే. మౌలాలి, పార్టీ కార్యకర్తలు,నాయకులు, అభిమానులు, ఆయన బంధు మిత్రులు……….. నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కందుల. నారాయణరెడ్డి శుక్రవారం సాయంత్రం మార్కాపురంలోని తన నివాసానికి చేరుకున్నారు. గత నెల 15 వ తేదీ మార్కాపురం నుండి హైదరాబాద్ వెళుతుండగా మార్గమధ్యమమైన గురిజేపల్లి గ్రామం వద్ద  రోడ్డు ప్రమాదంలో గాయాలై హైదరాబాదులో వైద్య చికిత్స పొందిన విషయం తెలిసిందే. అనంతరం 45 రోజుల తరువాత హైదరాబాదు నుండి కందుల నారాయణరెడ్డి బుధవారం సాయంత్రం మార్కాపురం చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కందులకు పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ళపల్లి సత్యనారాయణ, పట్టణపార్టీ అధ్యక్షులు ఎస్ కే. మౌలాలి, పార్టీ కార్యకర్తలు,నాయకులు,అభిమానులు, ఆయన బంధు మిత్రులు ఘన స్వాగతం పలికారు……….

ఏపీలో రేషన్ కార్డు ఉన్నవాళ్లకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్.. జులై 1 నుంచి పక్కా………..

ఏపీలో రేషన్ కార్డు ఉన్నవాళ్లకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్..  జులై 1 నుంచి పక్కా……… ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ షాపుల్లో పౌరసర ఫరాల శాఖ గోధుమ పిండి పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా జులై 1 నుంచి ఏపీలోని మిగిలిన పట్టణ ప్రాంతాల్లో గోధుమ పిండి ప్రారంభిస్తున్నట్లు మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నుంచి ప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే పలు జిల్లాల్లో పంపిణీ.      ప్రధానాంశాలు: ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త పట్టణ ప్రాంతాల్లో పంపిణీ చేయనున్నారు పుంగనూరు నుంచి శ్రీకారం చుట్టనున్నారు ఏపీలో రేషన్ కార్డు ఉన్నవాళ్లకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. జులై 1 నుంచి రాష్ట్రంలో మిగిలిన పట్టణ ప్రాంతాల్లో గోధుమ పిండి పంపిణీ చేస్తామని.. దశలవారీగా అన్ని చౌక దుకాణాలకు సరఫరా చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం నుంచి ప్రారంభించనున్నామని.. చిరుధాన్యాలను ప్రోత్సహించేలా రాయలసీమ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు కింద రాగులు, జొన్నలు...

విద్యుత్ చార్జీల పెంపును ట్రూ ఆఫ్ చార్జిలను రద్దు చేయాలని, విద్యుత్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ఉపసంవరించుకోవాలని కేంద్ర ప్రభుత్వ విద్యుత్తు సంస్కరణలకు వ్యతిరేకంగా విద్యుత్ డివిజనల్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించిన వామపక్షాలు………….

విద్యుత్ చార్జీల పెంపును ట్రూ ఆఫ్ చార్జిలను రద్దు చేయాలని, విద్యుత్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ఉపసంవరించుకోవాలని కేంద్ర ప్రభుత్వ విద్యుత్తు సంస్కరణలకు వ్యతిరేకంగా విద్యుత్ డివిజనల్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించిన వామపక్షాలు…………. విద్యుత్ చార్జీల పెంపును ట్రూ ఆఫ్ చార్జిలను రద్దు చేయాలని, విద్యుత్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ఉపసంపరించు కోవావాలని కేంద్ర ప్రభుత్వ విద్యుత్తు సంస్కరణలకు వ్యతిరేకంగా శుక్రవారం మార్కాపురం పట్టణంలో వామపక్షాల ఆధ్వర్యంలో విద్యుత్ డివిజనల్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తగ్గించాలి పెంచిన విద్యుత్ చార్జీలను, విద్యుత్ స్మార్ట్ మీటర్లు ఏర్పాటును ఉపసంహరించుకోవాలని నినాదాలు చేశారు ఈ సందర్భంగా వామపక్ష నాయకులు అందే నాసరయ్య, దగ్గుబాటి సోమయ్య మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరిగాయని , ప్రజలపై విద్యుత్ చార్జీలు బాదుడే బాదుడు అంటూ అంటూ చెప్పిన పెద్దమనిషి అధికారంలోకి వచ్చాక కరెంట్ చార్జీలు విపరీతంగా పెంచుతున్నారని వారన్నారు కేంద్ర ప్రభుత్వానికి బానిసై కేంద్ర ప్రభుత్వం ఆదేశాల గతం...

హోంగార్డ్ చెన్నుపల్లి కాశయ్య ఆధ్వర్యంలో నిత్య భోజన సదుపాయం:- మార్కాపురం పట్టణానికి చెందిన భూపాని కాశయ్య (అడ్వకేట్) వారి ధర్మపత్ని అన్నపూర్ణా దేవి గార్ల కుమార్తె అయినటువంటి భూపాని శ్రీ అవంతిక గారి పుట్టినరోజు సందర్భంగా మార్కాపురం పట్టణంలోని స్ఫూర్తి వెల్ఫేర్ మానసిక వికలాంగుల రుగ్మత ఆశ్రమం నందు మరియు పట్టణంలోని వీధుల వెంబడి రోడ్లమీద నివసిస్తూ ఎటువంటి జీవనాధారం లేని అనాధలకు వృద్ధులకు మతిస్థిమితం లేనటువంటి వారికి దాదాపు 40 మందికి భోజన సదుపాయానికి ఆర్ధిక సహాయ సహకారాలు అందించిన………….

  హోంగార్డ్ చెన్నుపల్లి కాశయ్య ఆధ్వర్యంలో నిత్య భోజన సదుపాయం:- మార్కాపురం పట్టణానికి చెందిన భూపాని కాశయ్య (అడ్వకేట్) వారి ధర్మపత్ని అన్నపూర్ణా దేవి గార్ల కుమార్తె అయినటువంటి భూపాని శ్రీ అవంతిక గారి పుట్టినరోజు సందర్భంగా మార్కాపురం పట్టణంలోని స్ఫూర్తి వెల్ఫేర్ మానసిక వికలాంగుల రుగ్మత ఆశ్రమం నందు మరియు పట్టణంలోని వీధుల వెంబడి రోడ్లమీద నివసిస్తూ ఎటువంటి జీవనాధారం లేని అనాధలకు వృద్ధులకు మతిస్థిమితం లేనటువంటి వారికి దాదాపు 40 మందికి భోజన సదుపాయానికి ఆర్ధిక సహాయ సహకారాలు అందించిన…………. హోంగార్డ్ చెన్నుపల్లి కాశయ్య ఆధ్వర్యంలో నిత్య భోజన సదుపాయం:- సబ్కా మాలిక్ ఏక్ హై అందరి దేవుడు ఒక్కరే అనే నినాదంతో అన్నం పరబ్రహ్మ స్వరూపమని భావించి ఆకలితో ఉన్న ఏ ప్రాణికైనా పట్టెడు అన్నం పెట్టినచో ఆ పరమాత్ముని ఆకలి తీర్చినట్లే అని భావిస్తూ నేడు శుక్రవారం రోజున మార్కాపురం పట్టణానికి చెందిన భూపాని కాశయ్య (అడ్వకేట్) వారి ధర్మపత్ని అన్నపూర్ణా దేవి గార్ల కుమార్తె అయినటువంటి భూపాని శ్రీ అవంతిక గారి పుట్టినరోజు సందర్భంగా మార్కాపురం పట్టణంలోని స్ఫూర్తి వెల్ఫేర్ మానసిక వికలాంగుల రుగ్మత ఆశ్రమం నందు మరియు పట్టణంలోని వీ...

ఆక్రమణల నుంచి దేవుడి భూములకు విముక్తి వారంరోజులు గడువిచ్చి స్వాధీనం చేసుకోనున్న ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ.. గవర్నర్‌ ఆమోదం.. తక్షణం అమల్లోకి ఇప్పటివరకు భూముల స్వాధీనంలో ఎన్నో చిక్కులు...........

ఆక్రమణల నుంచి దేవుడి భూములకు విముక్తి      వారంరోజులు గడువిచ్చి స్వాధీనం చేసుకోనున్న ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ.. గవర్నర్‌ ఆమోదం.. తక్షణం అమల్లోకి ఇప్పటివరకు భూముల స్వాధీనంలో ఎన్నో చిక్కులు...........  దేవుడి భూముల ఆక్రమణలకు అడ్డుకట్ట వేసేలా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభు­త్వం బుధవారం పకడ్బందీ ఆర్డినెన్స్‌ను తీసు­కొ­చ్చింది. ఆక్రమణలపై కోర్టు ప్రక్రియ ద్వారా కా­లయాపన లేకుండా ఆక్రమణదారునికి కేవలం ఒక నోటీసు ఇచ్చి వారం తర్వాత ఆ భూమిని స్వా­ధీనం చేసుకునే అధికారాన్ని దేవదాయ శాఖ అధి­కారులకు కల్పించింది. ఈ మేరకు 1987, 2007 దే­వదాయ శాఖ చట్టాల్లోని 83, 84, 85, 86, 93, 94 సెక్షన్లలో పలు మార్పులు చేస్తూ, కొన్నింటిని తొ­ల­గిస్తూ ప్రభుత్వం కొత్త ఆర్డినెన్స్‌ను రూపొందించింది. గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆమోదంతో న్యాయ శా­ఖ ఈ ఆర్డినెన్స్‌ను విడుదల చేసింది. తక్షణమే ఆర్డినె­¯­Œ్స అమలులోకి వస్తుందని అందులో పేర్కొన్నారు.  ఇప్పటివరకు జరుగుతున్నదిదీ.. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం దేవుడి భూములను ఎవరైనా ఆక్రమిస్తే దేవదాయ శాఖ అధికారులు ముందు ఎండోమెంట్‌ ట్రిబ్యునల్‌లో పిటీషన్‌ వేయాల్సి వచ...

ఎంబీబీఎస్‌ గ్రాడ్యుయేట్లకు ఇక నెక్ట్స్‌ రెండు స్టెప్స్‌గా నేషనల్‌ ఎగ్జిట్‌ టెస్ట్‌.. ఎంసీక్యూ విధానంలో స్టెప్‌–1 క్లినికల్‌ ప్రాక్టికల్స్‌ విధానంలో స్టెప్‌–2 పీజీకీ ఇదే అర్హత వచ్చే నెల 28న స్టెప్‌–1 మాక్‌ టెస్ట్‌ కొనసాగుతున్న మాక్‌ టెస్ట్‌ దరఖాస్తుల ప్రక్రియ...........

ఎంబీబీఎస్‌ గ్రాడ్యుయేట్లకు ఇక నెక్ట్స్‌       రెండు స్టెప్స్‌గా నేషనల్‌ ఎగ్జిట్‌ టెస్ట్‌.. ఎంసీక్యూ విధానంలో  స్టెప్‌–1 క్లినికల్‌ ప్రాక్టికల్స్‌ విధానంలో  స్టెప్‌–2 పీజీకీ ఇదే అర్హత వచ్చే నెల 28న స్టెప్‌–1 మాక్‌ టెస్ట్‌ కొనసాగుతున్న మాక్‌ టెస్ట్‌ దరఖాస్తుల ప్రక్రియ........... దేశంలో వైద్య విద్యలో నాణ్యతను పెంచడానికి నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) సంస్కరణలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఎంబీబీఎస్‌ తుది సంవత్సరం విద్యార్థులకు నేషనల్‌ ఎగ్జిట్‌ టెస్ట్‌(నెక్ట్స్‌) నిర్వహించనుంది. ఈ ఏడాది ఎంబీబీఎస్‌ పూర్తి చేసుకుంటున్న విద్యార్థులతోనే నెక్ట్స్‌ ప్రారంభించనున్నారు. దీనిని స్టెప్‌–1, స్టెప్‌–2­గా రెండు పరీక్షలుగా నిర్వహిస్తారు. ఎంబీబీఎస్‌ పాస్‌కు, మెడికల్‌ ప్రాక్టీస్‌కు లైసెన్స్, రిజిస్ట్రేషన్‌కు ఈ పరీక్ష ఉతీ­్తర్ణత తప్పనిసరి. దీంతో పాటు పీజీ మెడికల్‌ సీటులో ప్రవేశాలకూ ఈ  అర్హతే ఆధారం కానుంది. విదేశాల్లో చది­విన వారికి కూడా ఈ పరీక్ష ద్వారానే గుర్తింపు ఇస్తారు. ఈ క్రమంలో విద్యార్థుల్లో నెక్ట్స్‌పై అవగాహన కల్పించడం కోసం వచ్చే నెల 28న స్టెప్‌–1 మాక్‌ టెస్ట్‌ నిర్వహి...

331 వైద్య పోస్టుల భర్తీకి వాక్‌–ఇన్‌ ఇంటర్వ్యూ వచ్చే నెల 5వ తేదీ నుంచి నిర్వహణ శాశ్వత, కాంట్రాక్ట్‌ పద్ధతుల్లో పోస్టుల భర్తీ…. ఏపీవీవీపీ కమిషనర్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్‌……

331 వైద్య పోస్టుల భర్తీకి వాక్‌–ఇన్‌ ఇంటర్వ్యూ       వచ్చే నెల 5వ తేదీ నుంచి నిర్వహణ  శాశ్వత, కాంట్రాక్ట్‌ పద్ధతుల్లో పోస్టుల భర్తీ  ఏపీవీవీపీ కమిషనర్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్‌…… రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖలోని ఏపీ వైద్యవిధాన పరిషత్‌ (ఏపీవీవీపీ) పరిధిలో 14 స్పెషాలిటీల్లో 331 వైద్య పోస్టుల భర్తీకి వచ్చే నెల ఐదోతేదీ నుంచి వాక్‌–ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు ఏపీవీవీపీ కమిషనర్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్‌ బుధవారం తెలిపారు. శాశ్వత, కాంట్రాక్ట్‌ పద్ధతుల్లో పోస్టుల భర్తీ ఉంటుందన్నారు. ప్రభుత్వ వైద్యులుగా పనిచేసి రిటైరైన వారికి కాంట్రాక్ట్‌ పద్ధతి నియామకాల్లో అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది జూన్‌ ఒకటో తేదీ నాటికి 70 ఏళ్లు పైబడని రిటైర్డ్‌ వైద్యులు అర్హులని తెలిపారు. 5వ తేదీ జనరల్‌ మెడిసిన్, జనరల్‌ సర్జన్, డెర్మటాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ స్పెషాలిటీల్లో, 7వ తేదీ గైనకాలజీ, అనస్తీషియా, ఈఎన్‌టీ, పాథాలజీ, 10వ తేదీ పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, ఆప్తమాలజీ, రేడియాలజీ, సైకియాట్రి స్పెషాలిటీల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తా­మని వివరించారు. షెడ్యూల్‌ ప్రకారం అభ్యర్థులు ...

మార్కాపురం పురపాలక సంఘ కార్యాలయంలోని అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు కౌన్సిల్ హాల్ నందు ఆన్లైన్ ప్రి-ఆడిట్ ప్రోటోకాల్ అమలుపై జిల్లాలోని పురపాలక సంఘ కమిషనర్లు అందరితో సమావేశము నిర్వహించి అవగాహన కార్యక్రమమును చేపట్టిన శ్రీ ఆర్.హరి ప్రకాష్, డైరెక్టర్ ఆఫ్ స్టేట్ ఆడిట్, ఆంధ్రప్రదేశ్……………

ఈరోజు మార్కాపురం పురపాలక సంఘ కార్యాలయంలోని అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు కౌన్సిల్ హాల్ నందు ఆన్లైన్ ప్రి-ఆడిట్ ప్రోటోకాల్ అమలుపై జిల్లాలోని పురపాలక సంఘ కమీషనర్లు అందరితో సమావేశము నిర్వహించి అవగాహన కార్యక్రమమును చేపట్టిన    శ్రీ ఆర్.హరి ప్రకాష్, డైరెక్టర్ ఆఫ్ స్టేట్ ఆడిట్, ఆంధ్రప్రదేశ్…………… పురపాలక సంఘ కార్యాలయములయందు ప్రతి సంవత్సరంనకు ఒకేసారిగా నిర్వహిస్తున్న పోస్ట్ఆడిట్ కార్యక్రమంనకు బదులుగా ప్రి-ఆడిట్ విధానాన్ని అమలుపరచుటకు తగు చర్యలు తీసుకొనబడుచున్నవని, పురపాలక సంఘ సిబ్బంది మరియు ఆడిట్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో బిల్లులకు సంబంధించి ఎప్పటికప్పుడు తనిఖీ చేసి ప్రి-ఆడిట్ చేసేవిధంగా చర్యలు తీసుకుంటామని శ్రీ ఆర్.హరి ప్రకాష్, డైరెక్టర్ ఆఫ్ స్టేట్ ఆడిట్, ఆంధ్రప్రదేశ్ వారు తెలియజేశారు. ప్రి-ఆడిట్ నిర్వహించే విధానాన్ని పురపాలక సంఘ సిబ్బందికి మరియు ఆడిట్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేస్తూ వీటిని సక్రమంగా నిర్వహించటానికి జిల్లాలోని అందరూ పురపాలక సంఘ కమిషనర్ల వారి సలహాలు వగైరా కోరి ఉన్నారు. ఈ ప్రి-ఆడిట్ విధానాన్ని జిల్లా లోని అందరూ పురపాలక సంఘ కమిషనర్లు ఆహ్వానించి ఉన్నారు. చీమకుర్తి ము...

ఎన్నికలకు 9 నెలల ముందు ఆంధ్రప్రదేశ్‌ అద్వితీయ ప్రగతి……. పరిపాలనా వికేంద్రీకరణతో ప్రజల ముంగిటకు ప్రభుత్వం…….

ఎన్నికలకు 9 నెలల ముందు ఆంధ్రప్రదేశ్‌ అద్వితీయ ప్రగతి……….. పరిపాలనా వికేంద్రీకరణతో ప్రజల ముంగిటకు ప్రభుత్వం…………. ఆంధ్రప్రదేశ్‌ 16వ శాసనసభకు ఎన్నికలు జరగడానికి 9 నెలల ముందు రాష్ట్రం ప్రగతిపథంలో ఉరకలు పెడుతోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారి నేతృత్వంలో నాలుగేళ్ల క్రితం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేసిన కృషి అన్ని రంగాల్లో సత్ఫలితాలు ఇస్తోంది. సాధారణంగా ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయనగా ఏ రాష్ట్రంలోని పాలకపక్షమైనా విజయాలు, వైఫల్యాలు బేరీజు వేసుకుంటూ ఆందోళనతో ముందుకు నడుస్తుంది. అయితే, ముఖ్యమంత్రి సహా మంత్రివర్గం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పూర్తి విశ్వాసంతో, విజయోత్సాహంతో ముందుకు సాగుతున్నారు. 2019 ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో 98.5 శాతం నెరవేర్చామని మూడున్నర నెలల క్రితం సీఎం గారు చెప్పిన మాటలు ముమ్మాటికీ నిజం. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అన్ని రంగాల్లో ప్రభుత్వం తెచ్చిన మార్పుల ఫలితంగా ఏపీ 11.23 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. వివిధ సంక్షేమ పథకాల కింద ప్రజలకు రూ.1,97,473 కోట్ల సొమ్ము అందజేసి ఈ ఏడాది బడ్జెట్‌...

కంటి నిండా నిద్ర కరువు 40 ఏళ్లు పైబడిన వారిని వేధిస్తున్న నిద్ర లేమి ఏజ్‌ వెల్‌ ఫౌండేషన్‌ అధ్యయనంలో వెల్లడి, 5 వేల మందిపై సర్వే కనీసం 6 గంటలు నిద్ర పోలేకపోతున్నట్టు 70 శాతం మంది వెల్లడి. నిద్ర లేమితో బాధపడుతున్న వారిలో పురుషులే అధికం…………….

కంటి నిండా నిద్ర కరువు..       40 ఏళ్లు పైబడిన వారిని వేధిస్తున్న నిద్ర లేమి  ఏజ్‌ వెల్‌ ఫౌండేషన్‌ అధ్యయనంలో వెల్లడి  5 వేల మందిపై సర్వే    కనీసం 6 గంటలు నిద్ర పోలేకపోతున్నట్టు 70 శాతం మంది వెల్లడి  నిద్ర లేమితో బాధపడుతున్న వారిలో పురుషులే అధికం……………. మారిన జీవన విధానాలు,  చు­ట్టుముడుతున్న ఆర్థిక, కుటుంబ సమస్యల నడుమ మధ్య వయస్కులు, వృద్ధుల్లో కంటి నిండా నిద్ర కరవు అవుతోంది. ముఖ్యంగా మధ్య వయసు్కలు పగలంతా కష్టం చేసి రాత్రి అయ్యాక కంటి నిండా నిద్రపోవడం ఒక కలగా మారుతోంది. ఏజ్‌వెల్‌ ఫౌండేషన్‌ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. 40 నుంచి 64 ఏళ్లు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులు ఇలా  రెండు వర్గాలుగా మే నెలలో దేశవ్యాప్తంగా 5 వేల మంది నుంచి ఫౌండేషన్‌ వివరాలు సేకరించింది. వీరిలో 40 నుంచి 64 ఏళ్ల వారు 2245 (పురుషులు 1102, మహిళలు 143)మంది, 65 ఏళ్లు పైబడిన వారు 2,755 (పురుషులు 1,336, మహిళలు 1,419) మంది ఉన్నారు.  ఆరు గంటలు కూడా నిద్రపోలేకున్నాం  70 శాతం మంది రోజులో కనీసం ఆరు గంటలు కూడా కంటి నిండా నిద్ర పోలేకపోతున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. 24 శాతం మంది ...

హోంగార్డు చెన్నుపల్లి కాశయ్య ఆధ్వర్యంలో స్ఫూర్తి వెల్ఫేర్ మానసిక వికలాంగుల రుగ్మత ఆశ్రమం నందు మానసిక వికలాంగుల పిల్లలకు మంచాలు పంపిణి చేసిన మార్కాపురం పట్టణం కమ్యూనికేషన్ ఆఫీసులో (పోలీస్ డిపార్ట్మెంట్) ఏఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్నటువంటి సింగరెడ్డి రామకృష్ణారెడ్డి గారు…….....

హోంగార్డు చెన్నుపల్లి కాశయ్య ఆధ్వర్యంలో  స్ఫూర్తి వెల్ఫేర్ మానసిక వికలాంగుల రుగ్మత ఆశ్రమం నందు మానసిక వికలాంగుల పిల్లలకు మంచాలు  పంపి ణి చేసిన   మార్కాపురం పట్టణం కమ్యూనికేషన్ ఆఫీసులో (పోలీస్ డిపార్ట్మెంట్) ఏఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్నటువంటి సింగరెడ్డి రామకృష్ణారెడ్డి గారు............. మానవ సేవే మాధవ సేవగా భావించి పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రతిరోజు ఏదో ఒక సేవా కార్యక్రమంతో ముందుకు సాగుతున్న తరుణంలో భాగంగా నేడు మార్కాపురం పట్టణం కమ్యూనికేషన్ ఆఫీసులో (పోలీస్ డిపార్ట్మెంట్) ఏఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్నటువంటి సింగరెడ్డి రామకృష్ణారెడ్డి గారు స్ఫూర్తి వెల్ఫేర్ మానసిక వికలాంగుల రుగ్మత ఆశ్రమం నందు మానసిక వికలాంగుల పిల్లలకు మంచాలు పంపిణీ చేయడం జరిగినది ఈ మహోన్నతమైన సేవా కార్యక్రమానికి ఆర్థిక సహాయ సహకారాలు అందించిన రామకృష్ణారెడ్డి గారికి స్ఫూర్తి వెల్ఫేర్ సభ్యులు మరియు మానసిక వికలాంగుల పిల్లల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసినారు ఇటువంటి మహోన్నతమైన సేవా కార్యక్రమాలకు ఎవరైనా దాతలు ఆర్థిక సహాయం చేయదలచినచో 9603580633 నెంబర్ ని సంప్రదించవలసినదిగా తెలియజేయడమైనది ఈ మహోన్న...

*భారీ చోరీ కేసులను చాకచక్యంగా ఛేదించిన ప్రకాశం పోలీసులు.…. *తలుపులు వేసిన ఇళ్లల్లో చోరీలు చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగలను స్వల్ప వ్యవధిలో అరెస్ట్……….

*ప్రకాశం జిల్లా                                 తేది: 23.06.2023* *భారీ చోరీ కేసులను చాకచక్యంగా ఛేదించిన ప్రకాశం పోలీసులు.…….. *తలుపులు వేసిన ఇళ్లల్లో చోరీలు చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగలను స్వల్ప వ్యవధిలో అరెస్ట్……….. ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్ IPS గారి స్వీయ పర్యవేక్షణలో Addl SP (క్రైమ్) శ్రీ SV శ్రీధర్ రావు గారి మరియు ఒంగోలు DSP, V నారాయణ స్వామి రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సంక్లిష్ట వరుస దొంగతనాల కు పాల్పడి తప్పించుకొని తిరుగుతున్న అంతర్రాష్ట్ర నేరస్థులు అరెస్టు చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు. దొంగలను అరెస్ట్ చేసి చోరీ సొత్తు రికవరీ చేసిన పోలీస్ సిబ్బందిని అభినందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్ ఐపీఎస్ గారు.  *ముద్దాయిలు పేర్లు:-* 1. దురై సూర్య, తండ్రి దురై, 20 సం II, చిన్న గుందార్  కులం, చిత్తు పేపర్స్ కలెక్షన్, వేల్లివోయాల్ చావడి,  వేల్లివోయాల్, తిరువళ్ళురు, చెన్నై, తమిళనాడు.  2. కుమార్ గోపాల్, తండ్రి కుమార్, 22 సం II, నాయగర్ కులం,...

ఏపీలో కొత్తగా సబ్‌ డిస్ట్రిక్ట్‌ల ఏర్పాటు.. జగన్ సర్కార్ నోటిఫికేషన్‌……….

ఏపీలో కొత్తగా సబ్‌ డిస్ట్రిక్ట్‌ల ఏర్పాటు.. జగన్ సర్కార్ నోటిఫికేషన్‌…………. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా సబ్ డిస్ట్రిక్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కొత్తగా ఏర్పాటు చేసిన ఈ సబ్‌ డిస్ట్రిక్ట్‌లలో జాయింట్ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఏర్పాటవుతాయని రాష్ట్ర ప్రభుత్వం వివరించింది.      ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భూముల రీ సర్వే అనంతరం పరిపాలన, పౌర సేవలు, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగంగా చేపట్టేలా కొన్ని జిల్లాల్లో కొత్తగా సబ్‌ డిస్ట్రిక్ట్‌లను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. అనకాపల్లి, చిత్తూరు, కృష్ణా, పార్వతీపురం మన్యం, నెల్లూరు, శ్రీకాకుళం, తిరుపతి, విజయనగరం, వైఎస్సార్, కోనసీమ, ఏలూరు, కర్నూలు, తూర్పు గోదావరి జిల్లాల్లో సబ్‌ డిస్ట్రిక్ట్‌లను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, స్టాంపులు - రిజిస్ట్రేషన్ల శాఖ తరఫున శనివారం నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. తక్షణమే ఈ నోటిఫికేషన్‌ అమల్లోకి వస్తుందని ప్రభుత్వం పేర్కొంది. కొత్తగా ఏర్పాటు చేసిన సబ్‌ డిస్ట్రిక్ట్‌...

వైద్య పోస్టుల భర్తీకి బోర్డు.. నియామకాలకు ప్రత్యేక వెబ్‌సైట్‌…….

వైద్య పోస్టుల భర్తీకి బోర్డు నియామకాలకు ప్రత్యేక వెబ్‌సైట్‌………. ప్రజలకు నిరంతరం నాణ్యమైన వైద్య సేవలందించడానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పలు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండకుండా ఎప్పటి పోస్టులు అప్పుడు భర్తీ చేస్తున్నారు. వైద్య శాఖలో పోస్టుల భర్తీ కోసమే ప్రత్యేకంగా ఏపీ మెడికల్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఎంఎస్‌ఆర్‌బీ)ని ఏర్పాటు చేశారు. ఈ బోర్డుకు వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా ఉంటారు. మెంబర్‌ సెక్రటరీగా స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్, మరో మెంబర్‌గా జాయింట్‌ డైరెక్టర్‌ వ్యవహరిస్తారు. ఈ బోర్డు కార్యకలాపాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. డీహెచ్, ఏపీవీవీపీ, డీఎంఈ పరిధుల్లో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ (సీఏఎస్‌), సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌ (సీఏఎస్‌ఎస్‌), అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను రాష్ట్ర స్థాయిలో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌లో భర్తీ చేస్తారు. పదోన్నతుల ద్వారా డిప్యూటి సివిల్‌ సర్జన్, సివిల్‌ సర్జన్, అసోసియేట్‌ ప్రొఫెసర్, ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేస్తుంటారు. ఇప్పటివరకు...

ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ శుభవార్త.. జులై 1 నుంచి ఉచితంగా, నాలుగు వారాల పాటు…………..

ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ శుభవార్త.. జులై 1 నుంచి ఉచితంగా, నాలుగు వారాలపాటు…………   జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. జులై 1 నుంచి స్పెషల్ క్యాంపులు నిర్వహించాలని నిర్ణయించింది. నాలుగు వారాల పాటూ ఈ ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి 11 రకాల సేవలు, ధ్రువీకరణ పత్రాలు జారీ చేయనున్నారు. వీటికి ఎలాంటి సర్వీస్ ఛార్జీలు వసూలు చేయరు. ఈ నెల 24 నుంచి వాలంటీర్లతో పాటూ సచివాలయ సిబ్బంది ఈ కార్యక్రమం గురించి ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరిస్తారు.      ప్రధానాంశాలు: జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది జులై 1 నుంచి స్పెషల్ క్యాంపులు నిర్వహణ నాలుగు వారాల పాటూ సచివాయాల్లో సేవలు ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. జులై 1 నుంచి జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా.. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల దగ్గర ప్రత్యేక క్యాంపులు నాలుగు వారాల పాటు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ స్పెషల్ క్యాంపుల్లో 11 రకాల సేవలు, ధ్రువీకరణ పత్రాల జారీకి ఎలాంటి సర్వీస్ చార్జీలు వసూలు చేయరు. ఈ నెల 24 నుంచే వాలంటీర్లు, సచివాలయాల ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి ఈ కార్యక్రమం గురించి వివరిస్తారు. ప్రభు...

ఏపీ ప్రజల కోసం 'జగనన్న సురక్ష'.. జులై 1 నుంచి ఉచితంగా, మంచి అవకాశం……..

ఏపీ ప్రజల కోసం 'జగనన్న సురక్ష'.. జులై 1 నుంచి ఉచితంగా,  మంచి అవకాశం!………… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముఖ్యమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జగనన్నకు చెబుదాంకు కొనసాగింపుగా.. ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటుగా అర్హులైనా పథకాలు రానివారి కోసం జగనన్న సురక్షకు శ్రీకారం చుట్టింది. సీఎం జగన్ తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి వర్చువల్ ద్వారా ప్రారంభించారు. జులై 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నారు. అలాగే 11 రకాల సేవల్ని ఎలాంటి సర్వీస్ ఛార్జీలు లేకుండా ఉచితంగా అందించనున్నారు.      ప్రధానాంశాలు: జగనన్న సురక్ష కార్యక్రమం ప్రారంభం జులై 1 నుంచి ప్రత్యేక క్యాంపులు షురూ 11 రకాల సేవలు ఉచితంగానే అందిస్తారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 'జగనన్న సురక్ష' కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంక్షేమ పథకాలు, ప్రజా సమస్యలు సంతృప్త స్థాయిలో పరిష్కారమే లక్ష్యంగా.. నెలరోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. శనివారం నుంచి గృహాల సందర్శించి రాష్ట్రవ్యాప్తంగా 1.6 కోట్ల కుటుంబాలతో మమేకం కానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 15,004 సురక్ష క్యాంపుల నిర్వహిస్తున్నారు.. అలాగే‘1902’...

1 నుంచి ‘సచివాలయాల’ వద్ద ప్రత్యేక క్యాంపులు…. నాలుగు వారాలపాటు నిర్వహణ క్యాంపుల్లో అన్ని రకాల వినతుల పరిష్కారానికి చర్యలు.. 11 రకాల సేవలకు సర్విసు చార్జీలు ఉచితం. 24 నుంచి సచివాలయ సిబ్బంది, వలంటీర్ల ఆధ్వర్యంలో అవగాహన జగనన్న సురక్ష కార్యక్రమం విధివిధానాలు ఖరారు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం…………

1 నుంచి ‘సచివాలయాల’ వద్ద ప్రత్యేక క్యాంపులు…  నాలుగు వారాలపాటు నిర్వహణ.. క్యాంపుల్లో అన్ని రకాల వినతుల పరిష్కారానికి చర్యలు… 11 రకాల సేవలకు సర్విసు చార్జీలు ఉచితం   24 నుంచి సచివాలయ సిబ్బంది, వలంటీర్ల ఆధ్వర్యంలో అవగాహన.. జగనన్న సురక్ష కార్యక్రమం విధివిధానాలు ఖరారు,  ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం… జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా జూలై 1 నుంచి అన్ని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రత్యేక క్యాంపుల్లో ప్రధానంగా 11 రకాల సేవలు, ధ్రువీకరణ పత్రాల జారీకి ఎలాంటి సర్విసు చార్జీలు వసూలు చేయకూడదని నిర్ణయం తీసుకుంది. నాలుగు వారాల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ‘జగనన్నకు చెబుదాం’కు అనుబంధంగా అన్ని రకాల ప్రజా వినతులను సంతృప్త స్థాయిలో పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దీని నిర్వహణకు సంబంధించి గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌ మంగళవారం విధివిధానాలతో కూడిన ఉత్తర్వులను జారీ చేశారు. తహసీల్దార్, ఎంపీడీవోలతో సహా వివిధ మండల స్...

భవిష్యత్తు టిడిపిదే... రాష్ట్ర భవిష్యత్తు కు గ్యారెంటీ కార్యక్రమానికి ప్రజల నుండి అనుహ్యా స్పందన.…టిడిపి జిల్లా అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం.

భవిష్యత్తు టిడిపిదే... రాష్ట్ర భవిష్యత్తు కు గ్యారెంటీ కార్యక్రమానికి ప్రజల నుండి అనుహ్యా స్పందన.… టిడిపి జిల్లా అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వినాశకర విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా అదోగతిపాలైందని, దీంతో అన్ని వర్గాల ప్రజలు జగన్ పాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, కావున భవిష్యత్తు అంతా టిడిపి దేనిని జిల్లా టిడిపి అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం అన్నారు. టిడిపి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా బస్సు యాత్ర సోమవారం బుధవారం ఒంగోలు నగరానికి చేరింది. ఈ సందర్భంగా బస్సు యాత్రలో పాల్గొన్న శాసనాల మాట్లాడుతూ జగన్ నాలుగున్నర సంవత్సరాల పాలన కాలంలో నిత్యవసర వస్తువులు గణనీయంగా పెరిగాయని, దీంతో సామాన్య ప్రజలు కొనుగోలు చేయలేక అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ఇసుక సిమెంటు ఇనుము తదితర వస్తువుల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయని దీంతో నూతన గృహాలు నిర్మాణ దశలోనే ఎక్కడికక్కడ ఆగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీని ఫలితంగా ఈ రంగాన్ని నమ్ముకున్న లక్షలాది మంది భవన కార్మికులు జీవనోపాధి కోల్పోయి దిక్కుతోచని ...

ప్రభుత్వం నిలిపివేసిన పింఛనును తిరిగి పునరుద్ధరింపజేసి, వారికి నిలుపుదల చేసిన మూడు ఏళ్ల బకాయిలను 84 వేల రూపాయలను చెక్కురుపేనా సదరు పింఛనుదారురాలుకు అందజేసిన ఎంపీడీవో శ్రీ ఎస్ నరసింహులు గారు…………

ప్రభుత్వం నిలిపివేసిన పింఛనును తిరిగి పునరుద్ధరింపజేసి,  వారికి నిలుపుదల చేసిన మూడు ఏళ్ల బకాయిలను 84 వేల రూపాయలను చెక్కురుపేనా సదరు పింఛనుదారురాలుకు  అందజేసిన ఎంపీడీవో శ్రీ ఎస్ నరసింహులు గారు………… మార్కాపురం మండలం పిచ్చిగుంట్ల పల్లె గ్రామం నివాసి . దివ్యాంగురాలు శ్రీమతి నాగిరెడ్డి వెంకటమ్మ గారికి ప్రభుత్వం నిలిపివేసిన పింఛనును తిరిగి పునరుద్ధరుంపజేసి వారికి నిలుపుదల చేసిన మూడు ఏళ్ల బకాయిలను 84 వేల రూపాయలను చెక్కురుపేనా ప్రభుత్వం మంజూరు చేసి ఉన్నందున సదరు చెక్కును ఈరోజు మండల పరిషత్ మార్కాపురం ఆఫీసు నందు ఎంపీడీవో శ్రీ ఎస్ నరసింహులు గారు పింఛనుదారురాలు గారికి అందజేశారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో ఆఫీసు సిబ్బంది కుందూరు వెంకటరమణారెడ్డి వడ్లమని శ్రీనివాసు మల్లికార్జున్ లు పాల్గొన్నారు………

ఫ్యాషన్ ప్లస్ 100 సీసి మోటార్ బైక్ ను ఆవిష్కరించిన యం.వి. ఐ. మాధవ రావు………..

ఫ్యాషన్ ప్లస్ 100 సీసి మోటార్ బైక్ ను ఆవిష్కరించిన  యం.వి.ఐ.               మాధవ రావు……………. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో తిరిగి రూపుదిద్దుకున్న హీరో ఫ్యాషన్ ప్లస్ స్టైలిష్ ఫర్ ఎవర్ మోటార్ బైక్ ను బుధవారం పట్టణంలోని కాలేజి రోడ్డులో గల హీరో షో రూమ్ లో మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ మాధవ రావు  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కేట్ లో రోజు రోజుకు వినియోగదారులను ఆకర్షించే విధంగా మోటార్ బైక్ లు కొత్త మోడల్స్ లో వస్తున్నప్పటికీ హీరో ఫ్యాషన్ ప్లస్ స్టైలిష్ ఫర్ ఎవర్ 100 సిసి మోటార్ బైక్ ఎంతో ప్రత్యేకత సంతరించుకున్నదని కొనియాడారు . హీరో షోరూమ్ డీలర్ రమణా రెడ్డి మాట్లాడుతూ అనేక ఫ్యూచర్స్ తిరిగి మార్కెట్ లోకి వచ్చిన ఫ్యాషన్ ప్లస్ స్టైలిష్ ఫర్ ఎవర్ మోటార్ బైక్ కు వినియోగారుల నుండి మంచి స్పందన లభించడం ఆనందంగా వుందని అన్నారు. ఈ బైక్ మంచి మైలేజి ఇస్తుందని  ఆన్నారు.ఈ సంధర్భంగా సాయి కిరణ్ హీరో షో రూమ్ కు చేరుకున్న యం వి ఐ మాధవ రావు కు సాయి  ప్రొప్రైటర్ జి. రమణా రెడ్డి బొకే అందజేసి స్వాగతం పలికారు………….

మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్ వెనుక గల 9 వ బ్లాక్ నూరాని మసీదు వీధిలో నూతన రోడ్డు నిర్మాణం కొరకు శంకుస్థాపన చేసిన గౌరవనీయులైన మున్సిపల్ చైర్మన్ చిర్లంచర్లబాల మురళీకృష్ణ గారు, 9వ బ్లాక్ కౌన్సిలర్ సిరాజ్ గారు………….

మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్ వెనుక గల  9 వ బ్లాక్ నూరాని మసీదు వీధిలో నూతన రోడ్డు నిర్మాణం కొరకు శంకుస్థాపన చేసిన గౌరవనీయులైన మున్సిపల్ చైర్మన్ చిర్లంచర్లబాల మురళీకృష్ణ గారు, 9వ బ్లాక్ కౌన్సిలర్ సిరాజ్ గారు…………. ఈరోజు ఉదయం మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్ వెనుక గల   9 వ బ్లాక్ నూరాని మసీదు వీధిలోని నూతన రోడ్డు నిర్మాణం కొరకు శంకుస్థాపన చేసిన గౌరవనీయులైన మున్సిపల్ చైర్మన్ చిర్లంచర్లబాల మురళీకృష్ణ గారు, 9వ బ్లాక్ కౌన్సిలర్ సిరాజ్ గారు, ఈ కార్యక్రమములో   మార్కెట్ యాడ్ మెంబర్ సయ్యద్ కుర్షిద్  అహమ్మద్ గారు  మరియు  9 బ్లాకు వై.సి.పి ముఖ్య నాయకులు,కార్యకర్తలు  షేక్ మున్వర్,  సయ్యద్ ఇస్మాయిల్,  సయ్యద్ హారూన్ రషీద్,  సుభాని, డేగ శ్రీను,  హానేష్, హబీబ్ భాషా పాల్గొన్నారు.  ఇచ్చిన మాట మరవకుండా నూరాని మస్జిద్ వీధి ప్రజల కలను నెరవేర్చిన ఎమ్మెల్యే నాగార్జున గారికి, యంగ్ డైనమిక్ లీడర్ కృష్ణమోహన్ రెడ్డి గారికి మరియు చైర్మన్ గారికి వారంత హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు………… 💐💐💐💐

*ఉపాధ్యాయురాలు లలితను అభినందించిన ఎంఈఓ ఆంజనేయులు..………

*ఉపాధ్యాయురాలు లలితను అభినందించిన ఎంఈఓ ఆంజనేయులు..……… మండలం లోని చిన్న బోయలపల్లి ప్రభుత్వ పాఠశాల నందు ఆ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు శాసనాల లలిత బదిలీపై వెళ్తున్న సందర్భంగా విద్యార్థులకు అట్టలు, పలకలు పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారి ఆంజనేయులు హాజరై విద్యార్థులకు పలకలు, పరీక్ష అట్టలను అందించి వృధా పేపర్లతో విద్యార్థులు తయారుచేసిన ఆట వస్తువులను పరీక్షించారు. ఈ సందర్భంగా ఎంఈఓ ఆంజనేయులు మాట్లాడుతూ ఉపాధ్యాయురాలు లలిత విద్యార్థులకు చక్కటి విద్యను అందిస్తూ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అలవాటు చేయడం అభినందనీయమని అన్నారు. వేస్ట్ పేపర్లు, పెళ్లి కార్డులు, ఇంకా ఎన్నో పనికిరాని వాటితో విద్యార్థులతో రకరకాల బొమ్మలను తయారు చేయించడం, క్రమశిక్షణ, సంస్కారం వంటివి విద్యార్థులకు చక్కగా నేర్పించిందని కొనియాడారు.. ఏ పాఠశాలకు వెళ్లిన ఇదేవిధంగా విద్యార్థులకు మంచి బోధన అందిస్తూ అన్ని రంగాలలో తీర్చిదిద్దాలని కోరారు. అనంతరం బదిలీపై బోయలపల్లి పాఠశాలకు వెళ్లిన లలితాను ఎంఈఓ తో పాటు పాఠశాల సిబ్బంది దుశ్యాలువతో సత్కరించారు. అనంతరం పాఠశాల ప్రారంభం సందర...