మున్సిపల్ స్థలాలను కాపాడాలని అందులో, నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని కోరుతూ మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన మార్కాపురం సిపిఎం పట్టణ కమిటీ……….
మున్సిపల్ స్థలాలను కాపాడాలని అందులో, నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని కోరుతూ మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన మార్కాపురం సిపిఎం పట్టణ కమిటీ………. సర్వే నంబర్ 494/B4 లో గల మున్సిపల్ స్థలాలని కాపాడాలని అందులో, నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని కోరుతూ ఈరోజు మార్కాపురం సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం మార్కాపురం పట్టణ కార్యదర్శి దగ్గుపాటి సోమయ్య మాట్లాడుతూ మార్కాపురం క్రిస్టియన్ వెల్ఫేర్ హౌసింగ్ సొసైటీ వారు 10 సెంట్ల విస్తీర్ణం గల స్థలాన్ని పబ్లిక్ పర్పస్ కొరకు పురపాలక సంఘానికి కేటాయించడం జరిగిందని, సదరు స్థలంలో మార్కాపురం పట్టణానికి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, అధికార పార్టీ నాయకుల అండదండతో అక్రమంగా స్థలంలోకి ప్రవేశించి ఎటువంటి మునిసిపల్ అనుమతులు లేకుండా,ఫోర్జరీ పత్రాలు సృష్టించి అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని, సదరు నిర్మాణాలను వెంటనే నిలుపుదల చేయాలని కోరుతూ మార్కాపురం మున్సిపల్ కమిషనర్ గారికి పలు స...