కుల ధ్రువీకరణ పత్రాలు రెడీ.. కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం. అడక్కుండానే 10 లక్షల మంది విద్యార్థుల కుటుంబాల ధ్రువీకరించిన డేటా సిద్ధం.. టెన్త్ రాసిన విద్యార్థులందరికీ ప్రయోజనం, విద్యార్థుల డేటా గ్రామ, వార్డు సచివాలయం డేటా బేస్‌కు అనుసంధానం. పరీక్షలు రాసిన విద్యార్థులు క్యాస్ట్ సర్టిఫికెట్ కోసం తిరక్కుండా ముందుగానే జారీ………….
కుల ధ్రువీకరణ పత్రాలు రెడీ.. కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం అడక్కుండానే 10 లక్షల మంది విద్యార్థుల కుటుంబాల ధ్రువీకరించిన డేటా సిద్ధం.. టెన్త్ రాసిన విద్యార్థులందరికీ ప్రయోజనం విద్యార్థుల డేటా గ్రామ, వార్డు సచివాలయం డేటా బేస్‌కు అనుసంధానం పరీక్షలు రాసిన విద్యార్థులు క్యాస్ట్ సర్టిఫికెట్ కోసం తిరక్కుండా ముందుగానే జారీ………… పదో తరగతి విద్యార్థులు అడక్కుండానే.. వారికి కుల ధ్రువీకరణ సర్టీఫికెట్లు జారీచేసే కొత్త విధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో మెరుగైన సేవల్ని అందించే క్రమంలో ఎక్కడా, ఎప్పుడూ లేనివిధంగా సరికొత్తగా రాష్ట్రంలో ఈ విధానాన్ని తీసుకువచ్చారు. సాధారణంగా పదో తరగతి పూర్తయిన విద్యార్థులు.. ఇంటర్, ఆపై చదువుల కోసం తప్పనిసరిగా కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అంతకుముందు కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లు తీసుకున్నా.. పదో తరగతి ఉత్తీర్ణులయ్యాక తాజా సర్టిఫికెట్ తీసుకోవడం తప్పనిసరి. దీంతో విద్యా సంవత్సరం ప్రారంభంలో ఈ సర్టిఫికెట్ల కోసం గతంలో మీసేవ, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ విద్యార్థులు తిర...