*గర్భిణీ స్త్రీలు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలి……… డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ. గర్భిణీ స్త్రీలు మరియు చిన్నారుల కొసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పోషణ పక్వాడ కార్యక్రమాన్ని పట్టణంలోని నాలుగో వార్డుల గల అంగన్వాడి కేంద్రం నందు అంగన్వాడీ కార్యకర్త అపర్ణ ఆధ్వర్యంలో శుక్రవారం గర్భిణీ స్త్రీలకు సమతుల్య ఆహారంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆ వార్డు కౌన్సిలర్, శ్రావణి హాస్పిటల్ స్త్రీల వైద్య నిపుణురాలు డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ, సిడిపిఓ లు హాజరై గర్భిణీ స్త్రీలకు పలు సలహాలు సూచనలను అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ కనకదుర్గ మాట్లాడుతూ మహిళలు గర్భిణీగా వున్నప్పుడు గర్భంలోని బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలంటే సమతుల్య ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు. ఆరోగ్యాన్నిచ్చే ఆకుకూరలు, గుడ్లు, కూరగాయలు వంటి ఆహారాన్ని తీసుకోవాలని, జింకు ఫుడ్ కు దూరంగా ఉండాలని తెలిపారు. అనంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన పౌష్టికాహార కిట్టును గర్భిణీ స్త్రీలకు అందించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు…………..
Choose people who are good for your mental health.….