మరణించిన ASI కుమారునికి కారుణ్య నియామకం పత్రం అందజేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్ ఐపియస్ గారు………..
*ప్రకాశం జిల్లా, తేదీ: 31.01.2023*. మరణించిన ASI కుమారునికి కారుణ్య నియామకం పత్రం అందజేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్ ఐపియస్ గారు………… జిల్లా పోలీస్ శాఖలో కొనకనమిట్ల పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వహిస్తూ తేది:06.08.2022 న అనారోగ్యంతో మరణించిన కీర్తి శేషులు యం.చంద్ర శేఖర్ రాజు గారి (ASI.1738) కుమారుడు హేమంత్ రాజుకి కారుణ్య నియామకం కింద జిల్లా పోలీసు కార్యాలయంలో టైపిస్ట్ గా ఉద్యోగం కల్పిస్తూ అపాయింట్మెంట్ ఆర్డర్ కాపీని జిల్లా ఎస్పీ అందచేసినారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మరణించిన ASI యొక్క కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అంకిత భావంతో విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో మరణించడం బాధాకరమని, వారికి ఏదైనా సమస్య ఉంటే నేరుగా తనను కలవవచ్చునని, పోలీసు శాఖ వారి కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. హేమంత్ రాజుతో మాట్లాడుతూ విధుల నిర్వహణలో నైపుణ్యం పెంచుకొని బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించి మంచి ప్రతిభ కనపర్చాలని ఎస్పీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీపీఓ AO సులోచన ప...