Skip to main content

Posts

Showing posts from November, 2022

మార్కాపురం నియోజకవర్గంలోని మార్కాపురం పట్టణంలో దోర్నాల బస్టాండ్ లో గల స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఈ దుర్మార్గపు వైసిపి అసమర్థపాలన గురించి తెలియజేసే " ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి "అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారు…………

తేది:1.12.2022. మార్కాపురం పట్టణం.       మార్కాపురం నియోజకవర్గంలోని మార్కాపురం పట్టణంలో దోర్నాల బస్టాండ్ లో గల స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఈ దుర్మార్గపు వైసిపి అసమర్థపాలన గురించి తెలియజేసే " ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి "అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారు………… మార్కాపురం పట్టణంలో  ప్రతిష్టాత్మక   " ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి " కార్యక్రమం ప్రారంభం……                            ఈరోజు మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి గారి ఆధ్వర్యంలో మార్కాపురం నియోజకవర్గంలోని మార్కాపురం పట్టణంలో దోర్నాల బస్టాండ్ లో గల స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఈ దుర్మార్గపు వైసిపి అసమర్థపాలను గురించి తెలియజేసే " ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి " కార్యక్రమం మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణంలోని 6 వ వార్డులోని నాయుడు బజార్, రథం రోడ్, అమ్మవారి శాల బజార్ తదితర బజా...

◆ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఏ పూల మొక్కో అనుకుంటే పొరపాటే……మత్తులో ముంచెత్తే గంజాయి ఇది◆* ………………

*◆ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఏ పూల మొక్కో అనుకుంటే పొరపాటే……మత్తులో ముంచెత్తే గంజాయి ఇది◆*…………. మార్కాపురం బాపూజీ కాలనీలో ఇవి వెలుగుచూశాయి. ఈ ప్రాంతంలో రెండు వీధుల్లో నివసిస్తున్నవారికి మంగళవారం ఘర్షణ జరిగింది. దాసరి నాగమ్మ, దాసరి పేరయ్యలు తమ గృహాల్లోని పెరట్లో గంజాయి మొక్కలు సాగు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై శశికుమార్ కి సమాచారం అందింది. పోలీసులు వెళ్లి మూడు మొక్కలను గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకొని సెబ్ పోలీసులకు అప్పగించారు. మరోవైపు అక్కడే ఉండే శివ అనే వ్యక్తి కశాశాల విద్యార్థులు, యువతే లక్ష్యంగా గంజాయి విక్రయాలు సాగిస్తున్నా సెబ్ సిబ్బందికి తెలియలేదు. పోలీసుల రాకతో శివ పరారవగా... మిగిలిన ఇద్దరిపైన కేసు నమోదు చేసినట్లు ఎస్సై పద్మ తెలిపారు……….

AP Budget 2023-24: వనరుల సద్వినియోగం.. ప్రతిపాదనలపై కసరత్తు, 12లోగా ఆన్‌లైన్‌లో పంపాలని ఆర్థిక శాఖ మార్గదర్శకాలు………

AP Budget 2023-24: వనరుల సద్వినియోగం.. ప్రతిపాదనలపై కసరత్తు       12లోగా ఆన్‌లైన్‌లో పంపాలని ఆర్థిక శాఖ మార్గదర్శకాలు నేడు అన్ని శాఖల ఉన్నతాధికారులతో ప్రాథమిక సమావేశం ప్రాథమిక సదుపాయాల కల్పనకు పెద్దపీట  ఇళ్లు, తాగునీరు, విద్య, ఆరోగ్యం, రోడ్లు, రవాణా రంగాలకు ప్రాధాన్యం  పారిశ్రామికీకరణ లక్ష్యాలను సాధించేలా మూలధన వ్యయం  నవరత్నాల పథకాలకు తగినన్ని నిధుల కేటాయింపు  మహిళలు, పిల్లల కోసం చేపట్టిన పథకాలకు బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు జీతాలేతర వ్యయాల్లో 20 శాతం ఆదా చేసేలా ప్రతిపాదనలు………. అందుబాటులో ఉన్న వనరులను సమర్ధంగా వినియోగించుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు రాబట్టేలా 2023 – 24 ఆర్థిక ఏడాది బడ్జెట్‌ ప్రతిపాదనలు సమర్పించాలని ఆర్థిక శాఖ అన్ని శాఖలకు సూచించింది. ప్రాథమిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లు, తాగునీరు, విద్య, ఆరోగ్యం, రహదారులు, రవాణా రంగాలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందిస్తోందని తెలిపింది. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ ప్రతిపాదనలు అందుకు అనుగుణంగా ఉండాలని సూచించింది. వేగంగా పారిశ్రామీకరణ ద్వారా ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచి...

నరేంద్ర మోడి గారి అధ్వర్యములో సంచారజాతులకై కేంద్ర ప్రభుత్వ లోన్స్, లింక్ ఓపెన్ అయ్యింది ... అర్హత కలిగిన వారు అప్లై చేసుకోండి …………….

నరేంద్ర మోడి గారి అధ్వర్యములో సంచారజాతులకై కేంద్ర ప్రభుత్వ లోన్స్ లింక్ ఓపెన్ అయ్యింది ... అర్హత కలిగిన వారు అప్లై  చేసుకోండి………. బిజెపి ప్రభుత్వం జాతియ స్థాయిలో ' వెల్ఫేర్ డెవలప్మెంట్ బోర్డు లొని సీడ్ ( seed ) అనే సంక్షేమ పథకం ద్వారా  నాలుగు రకాల సంక్షేమ పధకాలను సంచార జాతులు(DNT) కు  అందిస్తున్నది .  వాటిని సంచార జాతులు(DNT)  అందరు  సద్వినియొగం చేసుకోగలరు . 1 ఇల్లు లేని వారికి ఇంటినిర్మాణం అయ్యే ఖర్చుకు  దాదాపుగా  - 5,00,000   2. ఉచిత ఆరోగ్యభీమా అయ్యే ఖర్చుకు  దాదాపుగా - 5,౦౦౦౦౦ 3.ఉద్యోగం పొందుటకు కావాల్సిన కోచింగ్ కు  అయ్యే ఖర్చుకు  దాదాపుగా -  2,50000  4 . వ్యాపారాలకు లోన్ రూపంలో 5,౦౦౦౦౦ ఏ బ్యాంక్ చుట్టూ తిరగనవసరం లేదు . డైరెక్ట్ గా   ఈ అవకాశాన్ని సంచార జాతులు(DNT) వారు అందరూ https://seed.dosje.gov.in/   ద్వారా సద్వినియోగం చేసుకోగలరు.  అర్హత కలిగిన కులాలు  ------------------------------ పూసల , సిందోళ్లు , వంజర , అర్య బొందిలి ,  బోరివలె , దేవర , గంట సాయుబు , గుద్ది , ఐర్లా , జలకడుగ...

461 స్టాఫ్‌ నర్సు పోస్టులకు నోటిఫికేషన్‌ దరఖాస్తుల సమర్పణకు డిసెంబర్‌ 6 వరకు గడువు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం ఇప్పటికే వైద్య శాఖలో 46 వేలకు పైగా పోస్టులు భర్తీ ……….

461 స్టాఫ్‌ నర్సు పోస్టులకు నోటిఫికేషన్‌       దరఖాస్తుల సమర్పణకు డిసెంబర్‌ 6 వరకు గడువు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం ఇప్పటికే వైద్య శాఖలో 46 వేలకు పైగా పోస్టులు భర్తీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ……     బీఎస్సీ నర్సింగ్‌ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. ప్రభుత్వాస్పత్రుల్లోని 461 స్టాఫ్‌ నర్సు పోస్టుల భర్తీకి వైద్య, ఆరోగ్య శాఖ మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. నాలుగు జోన్‌ల వారీగా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. బుధవారం నుంచి  డిసెంబర్‌ 5 వరకు http://cfw.ap.nic.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు దరఖాస్తులను డౌన్‌లోడ్‌ చేసుకుని డిసెంబర్‌ 6వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోగా వైద్య, ఆరోగ్య శాఖ రీజనల్‌ డైరెక్టర్‌ కార్యాలయాల్లో సమర్పించాల్సి ఉంటుంది. జీఎన్‌ఎం/బీఎస్సీ నర్సింగ్‌ పూర్తి చేసి 42 ఏళ్ల లోపు వయసున్న అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదేళ్లు, ఎక్స్‌–సర్వీస్‌మెన్‌లకు మూడేళ్లు, విభిన్న ప్రతిభావంతులకు 10 ఏళ్ల పాటు వయోపరిమితి నుంచి సడలింపు ఉంటుంది. ఓసీ అభ్యర్థులకు దరఖాస్...

సంక్రాంతికి ఊరెళుతున్నారా..? ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్……………..

సంక్రాంతికి ఊరెళుతున్నారా..? ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్……….. ఈసారి సంక్రాంతికి ఆర్టీసీ శుభవార్తలు చెప్పింది. సంక్రాంతి పండగకు ఊరు వెళ్లే వారికి రాయితీని ప్రకటించింది. రానూపోనూ టిక్కెట్టును ముందుగా బుక్‌ చేసుకుంటే తిరుగు ప్రయాణంలో (ఏసీ, నాన్‌ ఏసీ ఏ బస్సుకైనా) 10 శాతం డిస్కౌంట్‌ ఇవ్వనుంది. అంతేకాదు.. సంక్రాంతి ప్రయాణికులకు ఆర్టీసీ మరో వెసులుబాటును కల్పించింది. ఏటా దసరా, సంక్రాంతి పండగల సమయంలో రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ స్పెషల్స్‌ పేరిట ప్రత్యేక బస్సులను నడుపుతుంది. ఈసారి సంక్రాంతికి మాత్రం స్పెషల్‌ బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీని వసూలు చేయడం లేదని స్పష్టం చేసింది. గత దసరా సీజనుకు నడిపిన స్పెషల్స్‌కు కూడా ఆర్టీసీ అదనపు చార్జీ వసూలు చేయకుండానే నడిపింది. అది ప్రయాణికుల ఆదరణను చూరగొనడంతో ఆశించిన స్థాయిలో ఆదాయమూ సమకూరింది. దీంతో ఈ సంక్రాంతికి కూడా అదనపు బాదుడు లేకుండా సాధారణ చార్జీలతోనే స్పెషల్‌ బస్సులను నడపాలని నిర్ణయించింది. ఇది ప్రయాణికులకు ఊరట కలిగించనుంది.   ఆన్‌లైన్‌ బుకింగ్స్‌ ప్రారంభం  ఈ సంక్రాంతి పండగకు ఊరెళ్లే వారి కోసం ఆర్టీసీ ఆన్‌లైన్‌ బుకింగ్స్‌ను ఇటీవలే ప్...

ఏపీలో16 చోట్ల హెల్త్‌ హ‌బ్‌లు ఆరోగ్య‌శ్రీ కింద 50 శాతం ప‌డ‌క‌లు కేటాయించేలా ఒప్పందం ప్ర‌పంచ‌స్థాయి ఆస్ప‌త్రుల ఏర్పాటుకు ఆహ్వానం, ప్ర‌తిష్టాత్మ‌క ప్రైవేటు ఆస్ప‌త్రుల య‌జ‌మానుల‌తో మంత్రి భేటీ……….

ఏపీలో16 చోట్ల హెల్త్‌ హ‌బ్‌లు       ఆరోగ్య‌శ్రీ కింద 50 శాతం ప‌డ‌క‌లు కేటాయించేలా ఒప్పందం ప్ర‌పంచ‌స్థాయి ఆస్ప‌త్రుల ఏర్పాటుకు ఆహ్వానం పెట్టుబ‌డులకు ఏపీ ప్ర‌భుత్వం ఎంతో అనుకూలం పెట్ట‌బడులు పెట్టేవారికి ఫోన్ కాల్ దూరంలో ప్ర‌భుత్వం వైద్య ఆరోగ్య రంగ స్వ‌రూపాన్ని సీఎం జ‌గ‌న్ మార్చేస్తున్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని ప్ర‌తిష్టాత్మ‌క ప్రైవేటు ఆస్ప‌త్రుల య‌జ‌మానుల‌తో మంత్రి భేటీ సీఐఐ ఆధ్వ‌ర్యంలో ఢిల్లీలో స‌మావేశం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో 16 చోట్ల హెల్త్‌ హబ్‌ల ఏర్పాటు చేయాల‌ని ముఖ్య‌మంత్రివ‌ర్యులు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నిర్ణ‌యం తీసుకున్నార‌ని, ఆ దిశ‌గా చ‌ర్య‌లు కూడా తీసుకున్నామ‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. కాన్ఫ‌డ‌రేష‌న్ ఆఫ్ ఇండియ‌న్ ఇండ‌స్ట్రీ (భార‌త  ప‌రిశ్ర‌మ‌ల స‌మాఖ్య‌) ఆధ్వ‌ర్యంలో సోమ‌వారం రాత్రి న్యూ ఢిల్లీలో ఏపీ ప్ర‌భుత్వ ఉన్న‌త‌స్థాయి ప్ర‌తినిధులతో  ప్ర‌పంచ స్థాయిలో పేరున్న‌ ప్రైవేటు ఆస్ప‌త్రులు, డ‌యాగ్న‌స్టిక్ యూనిట్ల అధినేత‌ల స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఏపీ ప్ర‌భుత్వ ఉన్న‌త‌స్థాయి ప్ర‌తినిధి బృందంలో మం...

ఏపీ: గవర్నమెంట్‌ టీచర్లకు బోధనేతర విధుల నుండి మినహాయింపు

ఏపీ: గవర్నమెంట్‌ టీచర్లకు బోధనేతర విధుల నుండి మినహాయింపు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు.. ఉపాధ్యాయులు అకడమిక్ ఆచివమెంట్ లెవెల్ పెంచేందుకు.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా శాఖ పరిధి కింద పనిచేస్తున్న ఉపాధ్యాయులకు బోధనేతర బాధ్యతలను ఇవ్వకూడదని మం‍గళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యాయులను బోధనేతర విధుల నుంచి తప్పిస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏపీ ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇకపై ఉపాధ్యాయులు కేవలం విద్యా బోధనకు మాత్రమే పరిమితం కానున్నారు. మంగళవారం వర్చువల్‌గా భేటీ అయిన ఏపీ కేబినెట్ సమావేశం పాఠశాల విద్యా శాఖకు సంబంధించిన ఈ కీలక నిర్ణయానికి ఆమోద ముద్ర వేసింది. కేబినెట్ ఆమోదం లభించిన వెంటనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను పాఠశాల విద్యా శాఖ వెలువరించింది. విద్యా శాఖ కార్యదర్శి రాజశేఖర్ పేరిట నోటిఫికేషన్ జారీ అయ్యింది. అనేక సందర్భాల్లో బోధనేతర బాధ్యతలు భారం తగ్గించాలని కోరుతూ వస్తున్నారు ఉపాధ్యాయులు. అంతేకాదు.. ఉపాధ్యాయులు బోధనేతర విధులకు నిషిద్ధమని విద్యా హక్కు చట్టం చెబుతున్న విషయాన్ని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించింది. తప్పనిస...

పీజీ మెడికల్ సీట్లు: కేంద్రం కీలక నిర్ణయం.. ఆంధ్రప్రదేశ్‌కు 630 పీజీ వైద్యసీట్లు…….

పీజీ మెడికల్ సీట్లు: కేంద్రం కీలక నిర్ణయం.. ఆంధ్రప్రదేశ్‌కు 630 పీజీ వైద్యసీట్ లు      11 మెడికల్‌ కాలేజీలకు కొత్త సీట్లు అత్యధికంగా ఆంధ్రా మెడికల్‌ కాలేజీకి 128  అత్యల్పంగా నెల్లూరు మెడికల్‌ కాలేజీకి 5 సీట్లు : రాష్ట్రంలో పీజీ వైద్యసీట్ల పంట పండింది. చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా ఈ ప్రభుత్వం ఒకేసారి 630 పీజీ వైద్యసీట్లను తెచ్చింది. ఈమేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అండర్‌ సెక్రటరీ చందన్‌కుమార్‌ ఆంధ్రప్రదేశ్‌ సర్కారుకు అనుమతిస్తూ లేఖ రాశారు. ఈ మేరకు ఎంవోయూ పంపిస్తున్నామని, దీనికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కాలేజీల వారీగా ఎంవోయూకు ఆమోదం తెలపాలని సూచించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వైద్యకళాశాలలు పీజీలు, సీనియర్‌ రెసిడెంట్‌లతో కళకళలాడనున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 11 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలున్నాయి. ఆయా కాలేజీలు రెండునెలల కిందట సెంట్రల్‌ స్పాన్సర్‌షిప్‌ కింద 688 సీట్లకు ప్రతిపాదన పంపించాయి. ఈ ప్రతిపాదనలు పరిశీలించిన కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ 630 పీజీ వైద్యసీట్లకు ఆమోదముద్ర వేసింది.   భారీగా నియామకాలు చేసినందునే.. రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా కనివినీ ఎరుగని రీతి...

పెద్దారవీడు: ఫోక్సో కేసు నిందితుడికి శిక్ష పడడంలో ప్రతిభ కనబరిచిన ఎస్సై పులి. రాజేష్, ప్రత్యేకంగా అభినందించిన జిల్లా ఎస్పీ* మల్లిక గార్గ్………..

పె ద్దారవీడు: ఫోక్సో కేసు నిందితుడికి శిక్ష పడడంలో ప్రతిభ కనబరిచిన ఎస్సై పులి. రాజేష్ ను ప్రత్యేకంగా అభినందించిన జిల్లా ఎస్పీ* మల్లిక గార్గ్   అభినందన ఫోక్సో కేసులో నిందితుడికి జైలు శిక్ష పడటంలో సమర్థవంతంగా విధులు నిర్వహించిన పెద్దారవీడు ఎస్సై రాజేష్, పోలీసులను సోమవారం జిల్లా ఎస్పీ మలికా గార్గ్ ప్రత్యేకంగా అభినందించారు. మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై పెద్దారవీడు పోలీస్ స్టేషన్లో గతంలో కేసు నమోదయింది. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేసి న్యాయమూర్తి ముందు హాజరు పరచగా, నిందితుడికి 5 సంవత్సరాలు జైలు శిక్ష, రూ.500 జరిమానా విధించారు.

నాటుసారా తయారీని విడనాడి పరివర్తన చెందిన వారికి మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జీవనోపాధి కోసం పశువులను, ఆటోలను పంపిణీ చేస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీ ఏఎస్ దినేష్ కుమార్, ఎస్పీ శ్రీమతి మలికా గర్గ్, సబ్ కలెక్టర్ సేతు మాధవన్, సెబ్ జాయింట్ కలెక్టర్ సూర్యచంద్రరావు, ఎస్పీ ఆవులయ్య………………

29.11.2022, మార్కాపురం.  నాటుసారా తయారీని విడనాడి పరివర్తన చెందిన వారికి మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జీవనోపాధి కోసం పశువులను, ఆటోలను పంపిణీ చేస్తున్న కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీ ఏఎస్ దినేష్ కుమార్, ఎస్పీ శ్రీమతి మలికా గర్గ్, సబ్ కలెక్టర్ సేతు మాధవన్, సెబ్ జాయింట్ కలెక్టర్ సూర్యచంద్రరావు, ఎస్పీ ఆవులయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు………..

మార్కాపురం నియోజకవర్గంలో ఉన్న పలు సమస్యలను ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని వెళ్లిన మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారు………

మార్కాపురం నియోజకవర్గంలో ఉన్న పలు సమస్యలను ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని వెళ్లిన మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారు…….. తేది:29.11.2022.  మార్కాపురం పట్టణం.                               ఈరోజు మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారు మార్కాపురం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో గౌరవ ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గారిని కలిశారు. ఈ సందర్భంగా  మార్కాపురం నియోజకవర్గంలో ఉన్న పలు సమస్యలను కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని వెళ్లారు. #రాబోయే అసైన్మెంట్ కమిటీలో భూములు ఇప్పిస్తామంటూ నియోజకవర్గం లో వైకాపా నాయకులు పేదల దగ్గర లక్షల్లో నగదు వసూలు చేస్తున్నారని కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించారు. #మార్కాపురంలో ఆక్రమణకు గురైన 206 సర్వే నంబర్ లోని 100 కోట్ల రూపాయల  చెన్నకేశవస్వామి భూమిని కాపాడాలని  అలాగే ఆక్రమణకు గురైన ఇతర చెన్నకేశవ స్వామి భూములను రక్షించాలని కోరిన మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారు, #రాయవరం వద్ద చేపట్టబోయే మెడ...

పోలీసు నియామకాలకు నోటిఫికేషన్‌ విడుదల………

పోలీసు నియామకాలకు నోటిఫికేషన్‌ విడుదల………. మొత్తం 6100 కానిస్టేబుళ్లు, 411 ఎస్‌ఐ పోస్టులకు నోటిఫికేషన్‌ 315 ఎస్‌ఐ, 96 రిజర్వ్ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ 3,580 పోలీస్‌ కానిస్టేబుల్‌ (సివిల్‌) పోస్టులకు నోటిఫికేషన్‌ 2,520 ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తుల స్వీకరణ కానిస్టేబుల్‌ పోస్టులకు ఈనెల30 నుంచి డిసెంబర్‌ 28 వరకు దరఖాస్తుల స్వీకరణ కానిస్టేబుల్‌ పోస్టులకు జనవరి 9 నుంచి హాల్‌టికెట్లు జారీ కానిస్టేబుల్‌ పోస్టులకు జనవరి 22న ప్రిలిమినరీ రాత పరీక్ష ఎస్‌ఐ పోస్టులకు డిసెంబర్‌ 14 నుంచి జనవరి 18 వరకు దరఖాస్తుల స్వీకరణ ఎస్‌ఐ పోస్టులకు ఫిబ్రవరి 5 నుంచి హాల్‌టికెట్లు జారీ ఎస్‌ఐ పోస్టులకు ఫిబ్రవరి 19న ప్రిలిమినరీ రాత పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు పేపర్‌-1 ఎస్‌ఐ పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి సా.5.30 వరకు పేపర్‌-2 ఎస్‌ఐ పరీక్ష………

ఆంధ్ర ప్రజలకు సుప్రీంకోర్టు తీపి కబురు అందించింది.. *ఏపీ 3 రాజధానులకు దాదాపు లైన్ క్లియర్ చేసిన దేశ అత్యున్నత సుప్రీంకోర్టు..……..

ఆంధ్ర ప్రజలకు సుప్రీంకోర్టు తీపి కబురు అందించింది.. *ఏపీ 3 రాజధానులకు దాదాపు లైన్ క్లియర్ చేసిన దేశ అత్యున్నత సుప్రీంకోర్టు………… *ఆంధ్ర ప్రజలకు శుభవార్త .. 3 రాజధానులకు లైన్ క్లియర్ చేసిన సుప్రీంకోర్టు!* ఆంధ్ర ప్రజలకు సుప్రీంకోర్టు తీపి కబురు అందించింది.. *ఏపీ 3 రాజధానులకు దాదాపు లైన్ క్లియర్ చేసిన దేశ అత్యున్నత సుప్రీంకోర్టు..* కాల పరిమితితో రాజధాని పూర్తి చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది.హైకోర్టు ప్రభుత్వంలా వ్యవహరిస్తోందా? అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.*అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకరిస్తే ఎలా? హైకోర్టు ఏమైనా టౌన్‌ ప్లానరా అని ఏపీ హైకోర్టును ప్రశ్నించింది..ఆరు నెలల్లో నిర్మాణం చేయాలంటారా?మీరే ప్రభుత్వమైతే అక్కడ సీఎం ఎందుకు?అని పేర్కొంది.* *అభివృద్ధి ఎలా చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కదా?హైకోర్టు ఈ విషయంలో తన పరిధిని అతిక్రమించింది అని సుప్రీంకోర్టు పేర్కొంది. *రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలో అది రాష్ట్ర ప్రభుత్వ ఇష్టం అని స్పష్టం చేసింది.ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని రాష్ట్రానికి చెప్పలేం అని తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు.**తదుపరి విచారణ జనవరి 31కి వ...

*రణగొణ ధ్వని చేసే సైలెన్సర్లు అమర్చి వాహనాలు నడిపితే కఠిన చర్యలు: ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్ ఐపియస్* *విపరీతమైన ధ్వని పుట్టించే సైలెన్సర్ల బైకర్లపై ఉక్కుపాదం మోపుతున్న ఒంగోలు ట్రాఫిక్ పోలీసులు*………

*ప్రకాశం జిల్లా* *రణగొణ ధ్వని చేసే సైలెన్సర్లు అమర్చి వాహనాలు నడిపితే కఠిన చర్యలు: ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్ ఐపియస్* *విపరీతమైన ధ్వని పుట్టించే సైలెన్సర్ల బైకర్లపై ఉక్కుపాదం మోపుతున్న ఒంగోలు ట్రాఫిక్ పోలీసులు*………… ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్ ఐపియస్ గారి ఆదేశాల మేరకు ఒంగోలు టౌన్ లో ట్రాఫిక్  పోలీస్ అధికారులు మరియు సిబ్బంది కలసి ఈ రోజు  అధిక శబ్దం చేసే  సైలెన్సర్లు గల వాహనాలపై  స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వాహనాలను సీజ్ చేస్తున్నారు.  ప్రజలకు, తోటి వాహనదారులకు అసౌకర్యం కలిగిస్తూ ధ్వని కాలుష్యానికి కారణమయ్యే సైలెన్సర్లు ఉన్న వారిపై పోలీసులు చర్యలు  తీసుకుంటున్నారు. రణగొణ ధ్వనులు చేసే సైలన్సర్లను ఆయా వాహనదారులచే ఊడదీయించి తిరిగి బండికి వచ్చిన ఒరిజినల్ సైలన్సర్లనే బిగించేలా చేశారు.  ఈ సందర్భంగా  ఎస్పీ గారు మాట్లాడుతూ ఒంగోలు నగరంలో ఇటువంటి సైలన్సర్లతో ప్రయాణించే వాహనాలను ఉపేక్షించమన్నారు. వాహనదారులు ఈ విషయంలో ఒరిజినల్ సైలన్సర్లనే ఉపయోగించాలన్నారు. లెన్సర్ తీసేసి వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు పెడతామని, వాహనాలకు ఇటువంటి సైలెన్సర్...

మార్కాపురం పట్టణ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల వేదికగా ప్రధానోపాధ్యాయులు శ్రీ మునగాల చంద్రశేఖర్ రెడ్డి గారి అధ్యక్షతన ఘనంగా నిర్వహించిన మహాత్మా పూలే 132 వ వర్ధంతి వేడుకలు…………….

మార్కాపురం పట్టణ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల వేదికగా  ప్రధానోపాధ్యాయులు శ్రీ మునగాల చంద్రశేఖర్ రెడ్డి గారి అధ్యక్షతన ఘనంగా నిర్వహించిన  మహాత్మా పూలే 132 వ వర్ధంతి వేడుకలు……………. అణగారిన వర్గాల ఆశాజ్యోతి పూలే సమసమాజ స్థాపనకోసం నిరంతరం కృషి చేసిన మహానీయుడు మన మహాత్మ జోతిరావ్ పూలే అని వక్తలు కొనియాడారు... స్వేచ్ఛ, సమానత్వం, ఐక్యమత్యం, మానవత్వంతో కూడిన సమసమాజాన్ని కాంక్షించాడు పూలే.  'గులాంగిరి'', ''తృతీయరత్న'', ''పౌరోహిత్యం బండారం'', సార్వజనిక సత్యధర్మం'', ''సేద్యగాడి చెర్నకోల'', ''హెచ్చరిక'' తదితర ఎన్నో గ్రంథాలు రాసి, ప్రచురించాడు. అంతేకాదు ''దీనబంధు'' అనే వారపత్రికను నిర్వహించారు..      వారి ఆశయాలు సాధించేందుకు కృషి చేయడమే వారికి మన మిచ్చే నిజమైన నివాళి అని వక్తలు కొనియాడారు.. ఈ కార్యక్రమంలో ఇంచార్జి యన్. వెంకటేశ్వర్లు.. ప్రభాకర్ రెడ్డి.. రత్న రాజు..జి.యల్. రమేష్.. యం.రంగనాయకులు..భాస్కర్ రెడ్డి.. వై.కోటేశ్వరరావు..వి.ముసలయ్య.. వి.నారాయణ రెడ్డి. ప్రసాద్.. రంగనాధ్..సమీఉల్లా.. వి.ఆంజనేయుల...

రాష్ట్ర విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం... అన్ని కళాశాలల్లో ప్రమాణాల పెంపునకు సైతం అనేక చర్యలు………. 2024 నాటికి డిగ్రీ, ఇంజనీరింగ్‌ కాలేజీలతో పాటు అన్ని ఉన్నత విద్యాసంస్థలకు నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రిడిటేషన్‌ కౌన్సిల్‌ (నాక్‌) గుర్తింపు తప్పనిసరి…….

రాష్ట్ర విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం... అన్ని కళాశాలల్లో ప్రమాణాల పెంపునకు సైతం అనేక చర్యలు………. 2024 నాటికి డిగ్రీ, ఇంజనీరింగ్‌ కాలేజీలతో పాటు అన్ని ఉన్నత విద్యాసంస్థలకు నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రిడిటేషన్‌ కౌన్సిల్‌ (నాక్‌) గుర్తింపు తప్పనిసరి……. 2024 నాటికి అన్ని కాలేజీలకు నాక్‌ గుర్తింపు!   రాష్ట్ర విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం... అన్ని కళాశాలల్లో ప్రమాణాల పెంపునకు సైతం అనేక చర్యలు చేపట్టింది. 2024 నాటికి డిగ్రీ, ఇంజనీరింగ్‌ కాలేజీలతో పాటు అన్ని ఉన్నత విద్యాసంస్థలకు నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రిడిటేషన్‌ కౌన్సిల్‌ (నాక్‌) గుర్తింపును తప్పనిసరి చేసింది. నాక్‌తో పాటు ఇంటర్నేషనల్‌ ర్యాంకింగ్స్‌లోనూ రాష్ట్ర విద్యాసంస్థలు స్థానం సంపాదించేలా చర్యలు చేపట్టింది.   కాలేజీలకు నాక్‌ గుర్తింపు రావడంలో సహకారం అందించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలిలో ప్రత్యేకంగా క్వాలిటీ అస్యూరెన్స్‌ సెల్‌ను ఏర్పాటు చేయించింది. దీని ద్వారా అన్ని కాలేజీలు నాక్‌ ‘ఎ’ గ్రేడ్‌తో పాటు నేషనల్‌ ఇన్‌స్టిట...

బ్లాక్ బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్, ఆపై గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేసిన ప్రకాశం జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు పివి కృష్ణారావు గారు……..

బ్లాక్ బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్, ఆపై గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేసిన ప్రకాశం జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు పివి కృష్ణారావు గారు…….. బ్లాక్ బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ఎమ్మెస్ స్పోర్ట్స్ కరాటే స్కూల్ ఈరోజు జడ్పీహెచ్ఎస్ బాయ్స్         హైస్కూల్ ఆవరణంలో చీఫ్ ఎగ్జామినర్ మారం రెడ్డి శ్రీనివాసరెడ్డి బ్లాక్ బెల్ట్ 6th Don ఆధ్వర్యంలో బ్లాక్ బెల్ట్ టెస్ట్ నిర్వహించినారు. ఈ బ్లాక్ బెల్ట్ టెస్ట్ నందు 5 విద్యార్థులు అర్హత సాధించారు అర్హత సాధించిన విద్యార్థులు  M.సాయి ప్రణవి, ప్రత్యుక్ష ,sk యాసిన్ భాష, sk రిహాన్, రోహిత్, బ్లాక్ బెల్ట్ కు అర్హత సాధించారు ఈ బ్లాక్ బెల్ట్ టెస్ట్ కు ముఖ్య అతిథిగా ప్రకాశం జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు పివి కృష్ణారావు గారు మరియు ప్రముఖ సీనియర్ న్యాయవాది యూసఫ్ అలీ గారు ఈ కార్యక్రమానికి హాజరై విద్యార్థులకు బెల్టులు సర్టిఫికెట్లు ప్రధానం చేసినారు అని ఎమ్మెస్ స్పోర్ట్స్ కరాటే స్కూల్ ఇన్స్పెక్టర్ తోట ప్రసాద్ blackbelt 4th don తెలియజేసినారు……….

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారి ఆదేశాల మేరకు, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు కేతినేని సురేంద్రమోహన్ గారి పిలుపుమేరకు, మార్కాపురం పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు కొంగల వీటి విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా భారతీయ జనతా పార్టీ యువమోర్చా కార్యవర్గ సమావేశం………..

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారి ఆదేశాల మేరకు, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు కేతినేని సురేంద్రమోహన్ గారి పిలుపుమేరకు, మార్కాపురం పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు కొంగల వీటి విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా భారతీయ జనతా పార్టీ యువమోర్చా కార్యవర్గ సమావేశం……….. ఈరోజు 26 11 2022న, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారి ఆదేశాల మేరకు, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు కేతినేని సురేంద్రమోహన్ గారి పిలుపుమేరకు, మార్కాపురం పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు కొంగల వీటి విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా భారతీయ జనతా పార్టీ యువమోర్చా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుమన్ ప్రజాపతి గారు గారు, బిజెపి ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షులు కంభం వెంకటరమణ రావు గారు పాల్గొన్నారు. సుమన్ ప్రజాపతి గారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ బలోపేతానికి, యువమోర్చా నాయకులు కార్యకర్తలు నడుంబిగించాలని, మన దేశ ప్రధాని...

మార్కాపురం పట్టణములోని జవహర్ నగర్ లోగల తన నివాస గృహంలో, ఆత్మీయుల సమక్షములో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించిన…మాజీ ఎమ్యెల్యే, ప్రకాశం జిల్లా అధ్యక్షులు శ్రీ జంకె వెంకటరెడ్డి గారు…………..

మార్కాపురం పట్టణములోని జవహర్ నగర్ లోగల తన నివాస గృహంలో, ఆత్మీయుల సమక్షములో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించిన……మాజీ ఎమ్యెల్యే, ప్రకాశం జిల్లా అధ్యక్షులు శ్రీ జంకె వెంకటరెడ్డి…………..                     ప్రపంచములో అతి పెద్ద రాజ్యాంగాల్లో భారతదేశ రాజ్యాంగానిదే  పై చేయి అని వైసిపి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్యేల్యే జంకె వెంకటరెడ్డి పేర్కొన్నారు. శని వారం స్ధానిక జవహార్ నగర్ లోని ఆయన నివాస గృహంలో రాజ్యాంగా దినోత్సవ వేడుకలు శనివారం నిర్వహించారు. ముందుగా భారత రాజ్యంగ నిర్మాణ కర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలవేసి స్మరించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగం నిర్మించేందుకు డాక్టర్ అంబేద్కర్ తో పాటు ఆయన బృందం విశేష కృషి చేసిందని కొనియాడారు. భారతీయులందరికి సమాన హక్కులు కల్పించడంజరిగిందన్నారు.  ఈ కార్యక్రమంలో పెద్దారవీడు మండల వైసిపి కన్వీనర్ పాలిరెడ్డి క్రిష్ణారెడ్డి, వైసిపి నాయకులు గుండారెడ్డి వెంకటేశ్వరరెడ్డి, అక్కిరెడ్డి, రామక్రిష్ణారెడ్డి, మంద టి. మహేశ్వరరెడ్డి, కనిగిరి ప్...

మార్కాపురం పట్టణంలో వాసవీ విద్యానికేతన్ పాఠశాల డైరెక్టర్ మరియు ప్రిన్సిపల్ శ్రీ కె. రంగయ్యగారి ఆధ్వర్యములో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన వాసవీ విద్యానికేతన్ పాఠశాల సిబ్బంది……….

మార్కాపురం పట్టణంలో  వాసవీ విద్యానికేతన్   పాఠశాల డైరెక్టర్ మరియు ప్రిన్సిపల్ శ్రీ కె. రంగయ్యగారి ఆధ్వర్యములో  రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన  వాసవీ విద్యానికేతన్ పాఠశాల  సిబ్బంది………. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ అంబేద్కర్, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి  పాఠశాల డైరెక్టర్ మరియు ప్రిన్సిపల్ శ్రీ కె. రంగయ్యగారు పూలమాలవేసి   ఘనంగా నివాళులు అర్పించారు. ముందుగా పాఠశాల విద్యార్ధిని విద్యార్ధులకు మరియు సిబ్బందికి  భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1949  వ సంవత్సరం నవంబర్ 26న భారత రాజ్యాంగం ఆమోదించబడిందని,  స్వేచ్ఛ సమానత్వం ఆర్థికంగా రాజకీయంగా న్యాయపరంగా  అమలు కోసం అహర్నిశలు కృషిచేసి రాసి ఈ దేశ ప్రజల కొరకు  కులమతాలకు అతీతంగా రాజ్యాంగాన్ని అమలు చేయడం జరిగిందని కొనియాడారు.   1949 జనవరి 26న భారత రాజ్యాంగం ఆమోదించబడిందని భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్ర...

మార్కాపురం పట్టణంలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన యస్ వి కె పి కళాశాల సిబ్బంది……….

మార్కాపురం పట్టణంలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన యస్ వి కె పి కళాశాల సిబ్బంది………. మార్కాపురం పట్టణం లోని స్థానిక  యస్ వి కె పి కళాశాలలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. బి.దీప మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా  హక్కులకోసం జరిగిన ఉద్యమాల్లో లక్షలమంది మరణించిగా, భారతదేశంలో మాత్రం దానికి భిన్నంగా  ఎలాంటి రక్తపాతం జరగకుండా రాజ్యాంగం ద్వారా హక్కులను డా.అంబేడ్కర్ అందించారన్నారు. అలాంటి హక్కులకు రాజ్యాంగం రూపంలో  ఆమోదం జరిగిన రోజైన నవంబర్ 26 వ తేది ఒక పండుగ రోజన్నారు. ఈ సమావేశంలో అధ్యాపకులు నాసరయ్య, ఆవులయ్య, పిచ్చేశ్వరరావులు ప్రసంగించారు. కళాశాల సూపరింటెండెంట్ రవికుమార్ ఇతర అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు……….

మార్కాపురం పట్టణంలో రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించిన మార్కాపూర్ రేంజ్ సిబ్బంది, మరియు మినిస్ట్రియల్ సిబ్బంది………..

మార్కాపురం పట్టణంలో రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించిన మార్కాపూర్ రేంజ్ సిబ్బంది, మరియు మినిస్ట్రియల్ సిబ్బంది……….. ఈ దినం 26-11-2022 భారత రాజ్యాంగ దినోత్సవంని పురస్కరించుకొని భారత రాజ్యాంగ దినోత్సవం importance,రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మరియు అయన బృందం కృషిని శ్రీ DD  sir మార్కాపూర్ వారు తమ డివిజన్ ఆఫీస్, మార్కాపూర్ నందు రాజ్యాంగం మన కిచ్చినహక్కులను, విధులను, గుర్తురిగి అంబేద్కర్ యొక్క ఆశయాలు, ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు తమ విధులను చక్కగా నిర్వహిస్తూ,తమ ఆశయాలను సాదించుకోవాలనిఎగ్జిక్యూటివ్, మరియు మినిస్ట్రియల్ స్టాఫ్ కలిసి పనిచేయాలని కోరారు..ఈ కార్యక్రమంలో శ్రీ డిప్యూటీ డైరెక్టర్, మార్కాపూర్ శ్రీ విగ్నేష్ అప్పావు sir, శ్రీ fro మార్కాపూర్ A. వేణు sir, డిప్యూటీ రేంజ్ ఆఫిసర్ మార్కాపూర్  G. నాగరాజు, మరియు మార్కాపూర్ రేంజ్ సిబ్బంది, మరియు మినిస్ట్రియల్ సిబ్బందిపాల్గొన్నారు………..