Skip to main content

Posts

Showing posts from September, 2022

గ్రూప్ - 1, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్ పెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ* *92 గ్రూప్ - 1 ఉద్యోగాలకు నోటిఫికేషన్* *17 అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్ పెక్టర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల* *వివరాలకు https://psc.ap.gov.in/ వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు*………………..

*గ్రూప్ - 1, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్ పెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ* *92 గ్రూప్ - 1 ఉద్యోగాలకు నోటిఫికేషన్* *17 అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్ పెక్టర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల* *వివరాలకు https://psc.ap.gov.in/ వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు* నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్ - 1 కేడర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 92 గ్రూప్ - 1 ఉద్యోగాల భర్తీకి నిన్న రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతోపాటు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్ పెక్టర్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్ - 1 పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా రాత పరీక్షతో పాటు ఇంటర్వ్యూలను కూడా నిర్వహించనున్నారు. గతంలో ఇంటర్వ్యూలను ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, ఇంటర్వ్యూలను మళ్లీ పునరుద్ధరించింది.  గ్రూప్ - 1 ఉద్యోగాలకు ఈ నెల 13 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. ప్రిలిమినరీ పరీక్ష డిసెంబర్ 18న... మెయిన్స్ 2023 మార్చి 15న జరగనున్నాయి. పూర్తి వివరాలకు https://psc.ap.gov.in/ వెబ్ సైట్ సంప్రదించా...

వీఆర్వోలకు ఏపీ ప్రభుత్వం భరోసా.. గ్రేడ్-1, 2 వీఆర్వో మరణిస్తే..కుటుంబంలోని ఒకరికి కారుణ్య నియామకం... ……………

వీఆర్వోలకు ఏపీ ప్రభుత్వం భరోసా.. గ్రేడ్-1, 2 వీఆర్వో మరణిస్తే..కుటుంబంలోని ఒకరికి కారుణ్య నియామకం... సర్వీస్ లో ఉన్న గ్రేడ్-1, 2 వీఆర్ వో మరణిస్తే అతని కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకానికి అవకాశం కల్పిస్తూ ఏపీ వీఆర్వో సర్వీస్ నిబంధనలు-2008 లో మార్పులు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ ఉత్తర్వులిచ్చారు.... దీంతో గ్రేడ్-1, 2 వీఆర్వో కుటుంబంలో డిగ్రీ విద్యార్హత కలిగిన భాగస్వామి /పిల్లలకు కారుణ్య నియామకం కింద జూనియర్ అసిస్టెంట్, ఈ క్యాడర్ కు సమానమైన ఉద్యోగాల్లో అవకాశం కల్పిస్తారు. కారుణ్య నియామకాలపై వీఆర్వోలు ఏళ్ల తరబడి ప్రభుత్వాన్ని కోరుతున్నారు....అయితే గత టీడీపీ ప్రభుత్వం వీఆర్వోల డిమాండ్ ను పట్టించుకోలేదు సీఎం జగన్ సర్కార్.. వీరి డిమాండ్ ను పరిగణనలోకి తీసుకుని వీఆర్వోల సుదీర్ఘ కాల డిమాండ్ ను నెరవేర్చింది.... దీనిపై ఏపీ అమరావతి 'జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్య క్షుడు భూపతిరాజు రవీంద్రరాజు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు....

ఏపీలో గ్రూప్‌–1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ అక్టోబర్‌ 13 నుంచి నవంబర్‌ 2 వరకు దరఖాస్తులకు గడువు ఎఎంవీఐ పోస్టులకు నవంబర్‌ 2 నుంచి 22 వరకు.. ఇంటర్వ్యూల విధానం పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ గరిష్ట వయోపరిమితి మరో రెండేళ్లు పొడిగింపు……………….

ఏపీలో గ్రూప్‌–1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ అక్టోబర్‌ 13 నుంచి నవంబర్‌ 2 వరకు దరఖాస్తులకు గడువు ఎఎంవీఐ పోస్టులకు నవంబర్‌ 2 నుంచి 22 వరకు.. ఇంటర్వ్యూల విధానం పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ గరిష్ట వయోపరిమితి మరో రెండేళ్లు పొడిగింపు రాష్ట్రంలో గ్రూప్‌–1 కేడర్‌ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ శుక్రవారం రాత్రి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇదే నోటిఫికేషన్‌లో గ్రూప్‌–1 పోస్టులతో పాటు అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులను కూడా భర్తీ చేయడానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ కార్యదర్శి హెచ్‌. అరుణ్‌కుమార్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రూప్‌–1 పోస్టులు 92 ఉండగా అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు 17 ఉన్నాయి. ఇక గ్రూప్‌–1 పోస్టుల దరఖాస్తుకు అక్టోబర్‌ 13 నుంచి నవంబర్‌ 2 వరకు, ఎఎంవిఐ పోస్టులకు నవంబర్‌ 2 నుంచి 22 వరకు గడువు విధించారు. పూర్తి వివరాలను కమిషన్‌ వెబ్‌సైట్‌ psc.ap.gov.in/ లో చూడొచ్చని కార్యదర్శి పేర్కొన్నారు. గ్రూప్‌–1 సహా అత్యున్నత కేడర్‌ పోస్టులకు ఇంటర్వ్యూలు ఇలా ఉండగా.. ఏపీపీఎస్సీ ద్వారా...

ఫేషియల్‌ అథంటికేషన్‌’కు అనుమతి .., దేశంలో ఈ అవకాశం పొందిన తొలి రాష్ట్రం ఏపీనే, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబి్ధదారులు ఇకపై తేలికగా గుర్తింపు ఉద్యోగుల హాజరు సహా అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ వినియోగానికి వీలు……………..

‘ఫేషియల్‌ అథంటికేషన్‌’కు అనుమతి .. తొలి రాష్ట్రం ఏపీనే దేశంలో ఈ అవకాశం పొందిన తొలి రాష్ట్రం ఏపీనే ప్రభుత్వ సంక్షేమ పథకాల లబి్ధదారులు ఇకపై తేలికగా గుర్తింపు ఉద్యోగుల హాజరు సహా అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ వినియోగానికి వీలు ఇప్పటిదాకా కొన్ని కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల్లోనే అమలు రెండు నెలలపాటు ‘పైలెట్‌’ నిర్వహణ అనంతరం యూఐడీఏఐ ఆమోదం సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల గుర్తింపు, ఉద్యోగుల హాజరు వంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆధార్‌ అనుసంధానంతో కూడిన ‘ఫేషియల్‌ అథెంటికేషన్‌’ వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం పొందింది. దేశంలో ఇలా ఆమోదం పొందిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో మాత్రమే ఎన్‌ఐసీ (నేషనల్‌ ఇన్‌ఫార్మాటిక్స్‌ సెంటర్‌) ద్వారా నిర్వహించే పలు కార్యక్రమాల్లో ఆధార్‌ ఫేషియల్‌ అథంటికేషన్‌ వినియోగిస్తున్నారు. నిజానికి.. మన రాష్ట్రంలో ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో, ప్రభుత్వోద్యోగుల హాజరులో ఆధార్‌ బయోమెట్రిక్‌ విధానాన్ని మాత్రమే అమలుచేస్తున్నారు. అయితే.. ఈ విధానంలో లబ్దిదారుల వేలిముద్రలు సేకరించడానికి, ఉద్యోగుల హాజరు నమోదుకు మొబైల్‌ ఫోన్లు, యాప్‌లకు తోడు ప్రత్...

కేంద్ర మంత్రి కౌషల్ నుండి అవార్డు అందుకున్న మున్సిపల్ కమిషనర్ డానియల్. మార్కాపురం ఎమ్మెల్యే కెపి నాగార్జున రెడ్డి గారి కి కృతజ్ఞతలు తెలిపిన కమిషనర్………………

కేంద్ర మంత్రి కౌషల్ నుండి అవార్డు అందుకున్న మున్సిపల్ కమిషనర్ డానియల్. మార్కాపురం ఎమ్మెల్యే కెపి నాగార్జున రెడ్డి గారి కి కృతజ్ఞతలు తెలిపిన కమిషనర్. న్యూఢిల్లీ. దేశ వ్యాప్తంగా నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఉత్తమ మున్సిపాలిటీ గా ఎంపీకయిన ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం లోని పొదిలి మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసఫ్ శుక్రవారం న్యూఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కౌషల్ కిషోర్ చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. దేశంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం క్రింద 1,850 కార్పొరేషన్, మున్సిపాలిటీ లు ఎంపిక కాగా అందులో మన రాష్ట్రం నుండి విశాఖపట్నం, శ్రీకాకుళం, పొదిలి మున్సిపాలిటీ లు వుండడం విశేషం. ఈ సందర్భంగా డానియల్ జోసఫ్ మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పొదిలి మున్సిపాలిటీ ఎంపిక కావడం, అందుకు గుర్తింపుగా కేంద్ర మంత్రి చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకోవడం ఆనందంగా వుందన్నారు. పొదిలి పట్టణంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం జయప్రదం కావడంలో మార్కాపురం ఎమ్మెల్యే కెపి నాగార్జున రెడ్డి సహకారం మరువలేనిదని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి నాగార్జున రెడ్డి, మున్సిపల్ ఉద్యోగు...

పరిష్కారం కానున్న భూ వివాదాలు సర్వేను పరిశీలిస్తున్న జాయింట్‌ కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ జోరుగా సాగుతున్న రీసర్వే ప్రక్రియ డ్రోన్ల ద్వారా సరిహద్దుల గుర్తింపు అక్టోబర్‌ 2 నుంచి క్యూఆర్‌ కోడ్‌తో పాస్‌పుస్తకాల జారీ…………….

పరిష్కారం కానున్న భూ వివాదాలు సర్వేను పరిశీలిస్తున్న జాయింట్‌ కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ జోరుగా సాగుతున్న రీసర్వే ప్రక్రియ డ్రోన్ల ద్వారా సరిహద్దుల గుర్తింపు అక్టోబర్‌ 2 నుంచి క్యూఆర్‌ కోడ్‌తో పాస్‌పుస్తకాల జారీ దశాబ్దాలుగా అస్తవ్యస్తంగా ఉన్న రెవెన్యూ రికార్డులను ప్రక్షాళించి, రైతులకు సంపూర్ణ భూహక్కులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్ష రీసర్వే పల్నాడు జిల్లాలో జోరుగా సాగుతోంది. చెదలు పట్టిన భూ రికార్డులు, ఎవరి భూములు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితిలో అడ్డూఅదుపూలేని అక్రమాలు ఓ వైపు, న్యాయపరమైన చిక్కులు మరోవైపు. వీటన్నింటికీ పరిష్కారం చూపి రైతులు భూవివాదాల నుంచి బయటపడేలా రాష్ట్ర ప్రభుత్వం భూ స్వచ్ఛీకరణకు రీ సర్వే ద్వారా శ్రీకారం చుట్టింది. సర్వే తర్వాత ప్రతి రైతుకూ హద్దులు నిర్ణయించడంతోపాటు రాళ్లను పాతి ప్రత్యేక నంబర్లను కేటాయించనుంది. 1904 తర్వాత... ఆంగ్లేయుల పాలనలో 1904లో చివరి సారిగా పూర్తి స్థాయిలో భూ సర్వే జరిపి రికార్డులు పొందుపరిచారు. ప్రతి 30 ఏళ్లకు ఓసారి సర్వే అండ్‌ రీ సెటిల్‌మెంట్‌ జరగాల్సి ఉన్నా, ఇప్పటి వరకు ఏ ప్రభుత్వమ...

అడ్డదారిలో మందులోళ్లు.. డాక్టర్లకు ఖరీదైన కార్లు.. బహుమతులు……………..

అడ్డదారిలో మందులోళ్లు.. డాక్టర్లకు ఖరీదైన కార్లు.. బహుమతులు కొన్ని ఫార్మాకంపెనీలు వైద్యులను తప్పుదోవ పట్టిస్తున్నాయి. తమ మందులు రాస్తే ఖరీదైన బహుమతులు ఇస్తామని ఆశ చూపుతున్నాయి. భారీగా నగదు అందజేస్తామని ఊరిస్తున్నాయి. మందుల ధరల్లో వ్యత్యాసాలను బట్టి 20 నుంచి 30 శాతం వరకు చెక్కుల రూపేణా ఇస్తామని ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఎలాంటి అర్హతలు లేకపోయినా కొందరికి డిప్లొమా సర్టిఫికెట్లు తెచ్చి ఇస్తూ అక్రమాలకు పాల్పడుతున్నాయి. తమ మందులు అమ్ముకోవడానికి కొన్ని ఫార్మా కంపెనీలు ఎంతకైనా తెగిస్తున్నాయి. బాగా మందులు రాసే వైద్యునికి ఎంబీబీఎస్‌ సర్టిఫికెట్‌ ఉంటే చాలు డిప్లొమా కోర్సుల సర్టిఫికెట్లను తెప్పించే బాధ్యతను అవే తీసుకుంటున్నాయి. సదరు డాక్టర్‌ కేవలం పేరు, వివరాలు చెబితే చాలు..మొత్తం పనంతా సదరు కంపెనీనే చూసుకుంటుంది. ఆన్‌లైన్‌లో విదేశీ యూనివర్సిటీలకు దరఖాస్తు చేయడం, కొన్ని వారాల్లోనే సర్టిఫికెట్లు తెప్పించడం జరిగిపోతోంది. వాటినే అందంగా ఫ్రేమ్‌ వేయించి మరీ వైద్యం చేస్తున్నారు కొందరు డాక్టర్లు. కర్నూలు నగరంలో ఇలాంటి వైద్యులు 40 మందికి పైగా ఉన్నారు. ఎన్‌ఆర్‌ పేట, శ్రీనివాసనగర్, గాయత్రి ఎస్టేట్స్, అశో...

డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును ఈ రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా తొలగించి డాక్టర్ వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీ గా మారుస్తూ తీసుకున్న నిర్ణయం పై నిరసన తెలియజేస్తూ మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష……………….

తేది:30.09.2022, మార్కాపురం. ఈరోజు మార్కాపురం పట్టణం లోని ఆర్డిఓ కార్యాలయం ఎదుట డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును ఈ రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా తొలగించి డాక్టర్ వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీ గా మారుస్తూ తీసుకున్న నిర్ణయం పై నిరసన తెలియజేస్తూ మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రుల ఆరాధ్య దైవం, పేదల పాలిట పెన్నిధి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో సంస్కరణలకు ఆద్యుడు, ఆంధ్రుల అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరును dr. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కి మాజీ ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు గారు నామకరణం చేశారని దాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం తొలగించి dr. వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీ గా నామకరణం అత్యంత నీచమైన చర్య అని, గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్ కడప జిల్లా పేరును తొలగించ లేదని గుర్తు చేశారు. పెద్దలను ఆంధ్రుల సాంప్రదాయం అని ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని సైతం తుంగలో తొక్కి నూతన సాంప్రదాయానికి తెర తీశారని విమర్శించారు. ఎన్నికల ముందు మద్యనిషేధం అంటూ ...

ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు తేది. 02-10-2022 ఆదివారము ” గాంధీ జయంతి “ సందర్భముగా మాంసము, చేపలు మరియు మద్యపాన విక్రయమును నిషేధించిన ప్రజారోగ్య శాఖ, మార్కాపురం పురపాలక సంఘం.……………….

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మార్కాపురం పురపాలక సంఘ పరిధిలోని చికెన్/మటన్/చేపలు, ఇతర మాంసము మరియు మద్యపాన విక్రయదారులకు తెలియచేయునది ఏమనగా తేది 02-10-2022 ఆదివారము ” గాంధీ జయంతి “ సందర్భముగా మాంసము, చేపలు మరియు మద్యపాన విక్రయమును నిషేధించడమైనది. కావున సదరు మాంసపు/మద్యపాన దుకాణపు యజమానులు తేది 02-10-2022 ఆదివారము రోజు మాంసము, చేపల మరియు మద్యపాన దుకాణములు మూసివేయవలసినదిగా తెలియజేయడమైనది. ఇందుకు భిన్నముగా ప్రవర్తించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొనబడునని హెచ్చరించడమైనది. ప్రజారోగ్య శాఖ, మార్కాపురం పురపాలక సంఘం.

వాసవి వృద్ధాశ్రమం వైస్ ప్రెసిడెంట్ గా బొంతల కృష్ణ నియామకం……………..

వాసవి వృధాశ్రమం వైస్ ప్రెసిడెంట్ గా బొంతల కృష్ణ నియామకం కనిగిరి వాసవి వృద్ధ ఆశ్రమం ఫౌండర్ అన్న రంగనాయకులు ప్రెసిడెంట్ డిఎస్ఆర్ స్వామి వారి ఆధ్వర్యంలో ఈరోజు వైస్ ప్రెసిడెంట్ గా బొంతల కృష్ణ ను నియమించడం జరిగిందని వాసవి వృద్ధాశ్రమం నిర్వాహకులు చెప్పారు

*రాష్ట్ర వ్యాప్తంగా 01 అక్టోబర్, 2022 న అమల్లోకి “వైఎస్సార్ కళ్యాణమస్తు”, “వైఎస్సార్ షాదీ తోఫా”* • *30 సెప్టెంబర్, 2022 న ముఖ్యమంత్రి చేతుల మీదుగా “వైఎస్సార్ కళ్యాణమస్తు”,“వైఎస్సార్ షాదీ తోఫా” వెబ్ సైట్ ప్రారంభం*……………….

తేదీ: 29.09.2022, విజయవాడ. *రాష్ట్ర వ్యాప్తంగా 01 అక్టోబర్, 2022 న అమల్లోకి “వైఎస్సార్ కళ్యాణమస్తు”, “వైఎస్సార్ షాదీ తోఫా”* • *30 సెప్టెంబర్, 2022 న ముఖ్యమంత్రి చేతుల మీదుగా “వైఎస్సార్ కళ్యాణమస్తు”,“వైఎస్సార్ షాదీ తోఫా” వెబ్ సైట్ ప్రారంభం* • *పిల్లల చదువును ప్రోత్సహించడం, బాల్య వివాహాల నివారణ, పాఠశాలల్లో చేరికల శాతం పెంపు, డ్రాపౌట్ రేట్ ను తగ్గించడం*.. • *దరఖాస్తు చేసుకునే వధూవరులిరువురుకీ టెన్త్ క్లాస్ ఉత్తీర్ణత తప్పనిసరి* పిల్లల చదువును ప్రోత్సహించడం.. బాల్య వివాహాలను నివారించడం.. పాఠశాలల్లో చేరికల శాతాన్ని పెంచడం.. డ్రాపౌట్ రేట్ ను తగ్గించడం లక్ష్యాలుగా “వైఎస్సార్ కళ్యాణమస్తు", "వైఎస్సార్ షాదీ తోఫా" పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఈ పథకాలకు సంబంధించిన వెబ్ సైట్ ను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి 30 సెప్టెంబర్, 2022 న లాంఛనంగా ప్రారంభించిన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా 01 అక్టోబర్, 2022 నుండి అమల్లోకి రానున్నాయి. *వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా ఆర్థికసాయం భారీగా పెంపు* : ...

17న ప్రారంభమై అక్టోబర్ రెండో తేదీ వరకు జరిగే దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలలో భాగంగా ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని గడియార స్తంభం సెంటర్ నందు రోజువారీగా కూలీకి వెళ్లే బేల్దారి కూలీలకు మరియు పలకల ఫ్యాక్టరీల నందు పనిచేసే కార్మికులకు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర ట్రెజరర్ బొంతల కృష్ణ ఆధ్వర్యంలో పండ్లను పంపిణీ………………

ఈనెల 17న ప్రారంభమై అక్టోబర్ రెండో తేదీ వరకు జరిగే దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలలో భాగంగా ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని గడియార స్తంభం సెంటర్ నందు రోజువారీగా కూలీకి వెళ్లే బేల్దారి కూలీలకు, అదేవిధంగా పట్టణంలోని సాయి బాలాజీ థియేటర్, మరియు షిరిడి సాయిబాబా మందిర సమీపంలో గల పలకల ఫ్యాక్టరీల నందు పనిచేసే కార్మికులకు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర ట్రెజరర్ బొంతల కృష్ణ ఆధ్వర్యంలో పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బొంతల కృష్ణ మాట్లాడుతూ దేశానికి ఎన్నో సేవలు అందిస్తూ, వివిధ పథకాల ద్వారా బడుగు బలహీన వర్గాలను ఆదుకుంటూ దేశాన్ని ముందుకు నడిపిస్తున్న నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా నిర్వహిస్తున్న పక్షోత్సవాలలో భాగంగా నేడు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా వచ్చేనెల రెండో తేదీ వరకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు పైడిమర్రి రామచంద్ర, సీనియర్ నాయకులు పీవీ కృష్ణారావు, పైడిమర్రి శ్రీనివాసులు, మొర్రిబోయిన చిన్నయ్య, మద్దెల లక్ష్మీదేవి, బిజెపి నాయకులు పాల్గొన్నారు.

గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదుకు దరఖాస్తు చేయండిలా...* *2022 అక్టోబర్ 1 నుంచి నవంబర్ 7 వరకు మాత్రమే అవకాశం.*……………….

*అందరికీ నమస్కారం 🙏🙏* *గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదుకు దరఖాస్తు చేయండిలా...* *2022 అక్టోబర్ 1 నుంచి నవంబర్ 7 వరకు మాత్రమే అవకాశం.* దరఖాస్తునకు కావలసినవి : ఫారమ్ 18. డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికెట్ (అటెస్టెడ్), ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో. మీ ఫారం- 18 ను పూరించి ఆర్డీవో / ఎమ్మార్వో కార్యాలయంలో మిగిలిన పత్రాలను జతచేసి అందజేయాలి. Online లో ceoandhra.nic.in ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు. గమనిక : గతంలో ఉన్న ఓటరు లిస్ట్ మొత్తం రద్దు చేయడం జరిగింది. *ప్రతీ గ్రాడ్యుయేట్ కొత్తగా ఓటు నమోదు చేసుకోవాల్సి వుంది.* సదా భరతమాత సేవలో కంభం వెంకటరమణ రావు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు అసెంబ్లీ కన్వీనర్, M.L.C. మార్కాపురం

ఏపి....ఒంటరిగా ఉంటున్నారా?.. ఈ ఆప్షన్‌ మీ కోసమే..…………….

ఏపి....ఒంటరిగా ఉంటున్నారా?.. ఈ ఆప్షన్‌ మీ కోసమే.. రాష్ట్రంలో అనర్హత (ఇన్‌ ఎలిజిబుల్‌) కారణంగా రైస్‌ కార్డు కోల్పోయిన వారు దరఖాస్తు చేసుకుంటే ఆరు దశల ధ్రువీకరణ (సిక్స్‌ స్టెప్‌ వెరిఫికేషన్‌) అనంతరం కొత్తకార్డు మంజూరుకు పౌరసరఫరాల శాఖ అవకాశం ఇచ్చింది. ఇందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో స్ప్లిట్‌ ఆప్షన్‌ తీసుకొచ్చింది. రేషన్ కార్డుదారులకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్ వీరితోపాటు విడాకులు తీసుకుని సంతానం లేని ఒంటరి వ్యక్తులు సైతం తగిన ధ్రువపత్రాలు సమర్పిస్తే రైస్‌ కార్డు ఇవ్వనుంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖతో సమన్వయం చేసుకుంటూ రైస్‌ కార్డుల దరఖాస్తులను స్వీకరించాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖకు సూచించింది.

గుండెను గాబరా పెట్టొద్దు చిన్న వయసు నుంచే జాగ్రత్తలు పాటిస్తే మంచిదంటున్న వైద్యులు………………

గుండెను గాబరా పెట్టొద్దు చిన్న వయసు నుంచే జాగ్రత్తలు పాటిస్తే మంచిదంటున్న వైద్యులు గుండె జబ్బుతో చనిపోయారు.. పూర్వం ఈ మాట చాలా పెద్ద వయస్సు వారి గురించే వినపడేది. 40 ఏళ్ల లోపు వయస్సు వారిలో చాలా అరుదు. మరి ఇప్పుడు..?? వయసుతో సంబంధం లేదు. అన్ని వయసుల వారినీ గుండె జబ్బు వేధిస్తోంది. కాలానుగుణంగా వచ్చిన వాతావరణ మార్పులు, ఆహార అలవాట్లు, దురలవాట్లు, మానసిక ఒత్తిళ్లు వంటి కారణాల వల్ల చిన్నా పెద్దా అందరినీ గుండె జబ్బులు వెంటాడుతున్నాయి. ఇటీవలి కాలంలో 25 ఏళ్ల వయస్సు నిండని వారు కూడా గుండె పోటుతో మరణించడం తరచూ వింటున్నాం. ఈ క్రమంలో చిన్న వయస్సు నుంచే జాగ్రత్తలు పాటిస్తూ, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని వైద్యులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో పరిస్థితి ఇలా ‘రిపోర్ట్‌ ఆన్‌ మెడికల్‌ సర్టిఫికేషన్‌ ఆఫ్‌ కాజ్‌ ఆఫ్‌ డెత్స్‌’ నివేదిక ప్రకారం 2020 సంవత్సరంలో రాష్ట్రంలో 4.55 లక్షల మరణాలు నమోదవగా వీటిలో 22.3 శాతం.. అంటే 1,01,353 మంది వివిధ అనారోగ్య సమస్యలు, జబ్బులతో మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వీటిలో గుండె జబ్బులతో మరణించిన వారు సుమారు 60 వేల మంది ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ మరణాల్లో...

రేషన్ కార్డుదారులకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్…………………

రేషన్ కార్డుదారులకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన (పీఎంజీకేఏవై ) కింద ఉచిత బియ్యం పంపిణీని మరో మూడునెలలు పొడిగించింది. పీఎంజీకేఏవై 7వ దశలో భాగంగా అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు జాతీయ ఆహార భద్రత (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) కార్డుదారులకు ఉచితంగా బియ్యం ఇవ్వనుంది. దేశవ్యాప్తంగా కార్డులోని ఒక్కో వ్యక్తికి ఐదుకిలోల చొప్పున 122 లక్షల టన్నుల బియ్యాన్ని పంపిణీ చేయనుంది. వచ్చే మూడునెలలు పండుగలు ఉండటంతో పేదలకు ఆర్థిక బాధలు లేకుండా ఆహారధాన్యాలను ఉచితంగా అందించాలని నిర్ణయించింది. కోవిడ్‌–19 విజృంభణ నేపథ్యంలో 2020 ఏప్రిల్‌లో కేంద్ర ప్రభుత్వం పీఎంజీకేఏవైకు శ్రీకారం చుట్టింది. మొదటి రెండు దశల్లో ఎనిమిది నెలల పాటు (ఏప్రిల్‌ 2020 నుంచి నవంబర్‌ 2020), మూడు నుంచి ఐదు దశల్లో 11 నెలలు (మే 2021 నుంచి మార్చి 2022), ఆరోదశలో ఆరునెలలు (ఏప్రిల్‌ 2022 నుంచి సెప్టెంబర్‌ 2022) వరకు.. మొత్తం 25 నెలల పాటు ఉచితంగా బియ్యం పంపిణీ చేసింది. 88 లక్షల కార్డులకే ఉచిత బియ్యం రాష్ట్రంలో ఉన్న 1.45 కోట్ల రేషన్‌ కార్డుల్లో 88 లక్షల కార్డులనే కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కింద ...

గుండెపోటు ఎలా గుర్తించాలి.. గుండెపోటు రాకుండా ఉండాలంటే.. 25 ఏళ్లకే గుండె సమస్యలు మారిన ఆహార నియమాలు, అలవాట్లతో ముప్పు శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడే కారణం……………….

గుండెపోటు ఎలా గుర్తించాలి.. గుండెపోటు రాకుండా ఉండాలంటే.. 25 ఏళ్లకే గుండె సమస్యలు మారిన ఆహార నియమాలు, అలవాట్లతో ముప్పు శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడే కారణం ఉమ్మడి పశ్చిమలో ఏటా 10–20 శాతం పెరుగుతున్న కేసులు నేడు వరల్డ్‌ హార్ట్‌ డే ఈ బిజీ జీవితంలో ఒత్తిడులు, శారీరక శ్రమ లేకపోవడం మన గుండెను ప్రమాదంలోకి నెడుతోంది. మారిన ఆహార అలవాట్లు గుండె నాళాలను దెబ్బతీస్తున్నాయి. ఈ రోజు వరల్డ్‌ హార్ట్‌ డే.. అందువల్ల మన గుండెను మనం ఎంత ప్రమాదంలోకి నెడుతున్నామో తెలుసుకోవాల్సిన అవసరముంది. మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏటా 10 నుంచి 20 శాతం గుండె వ్యాధుల కేసులు పెరుగుతున్నాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మందు, సిగరెట్లు, కల్తీ ఆహారం, అధిక నూనెలతో కూడిన ఆహారం గుండెకు ప్రమాదకరం. ఒకసారి గుండెపోటు వచ్చిన వాళ్లు తప్పనిసరిగా అలవాట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. గతంలో 45 ఏళ్లు దాటాక గుండెపోటు వచ్చేది. ఇప్పుడు 25 ఏళ్లకే వస్తుంది. ఈ నేపథ్యంలో ఏటా సెప్టెంబర్‌ 29న వర్డల్‌ హార్ట్‌డే నిర్వహిస్తూ గుండెను ఎలా రక్షించుకోవాలో చెబుతున్నారు. ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్‌ పీఆర్‌కే...

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..₹ 10 వేల కోట్లతో 3 రైల్వే స్టేషన్లకు కొత్త హంగులు.. ఉచిత రేషన్‌ మరో మూడు నెలలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు…………..

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..₹ 10 వేల కోట్లతో 3 రైల్వే స్టేషన్లకు కొత్త హంగులు.. ఉచిత రేషన్‌ మరో మూడు నెలలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ (Union Cabinet) భేటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలోని మూడు ప్రధాన నగరాల్లో రైల్వే స్టేషన్లను మరింతగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. దేశంలో న్యూదిల్లీ, అహ్మదాబాద్‌, ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టెర్మినస్‌ రైల్వేస్టేషన్లను రూ.10వేల కోట్లతో కొత్త హంగులు అద్దేందుకు కేంద్ర కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. అలాగే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించే కరవు భత్యం (డీఏ)ని 4శాతం పెంచడంతో పాటు కరోనా సమయంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో పేదలకు పంపిణీ చేస్తోన్న ఉచిత రేషన్‌ను డిసెంబర్‌ 31 వరకు కొనసాగించాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా రైల్వే శాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్‌ మాట్లాడుతూ.. 199 స్టేషన్లను తొలి దశలో ఆధునికీకరించాలని యోచిస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటికే 47 స్టేషన్లకు టెండర...

గోమాత సంరక్షణకు చేయూతనివ్వండి……………….

గోమాత సంరక్షణకు చేయూతనివ్వండి కొత్త వైరస్ కొన్ని వేల గోమాతలను పొట్టనపెట్టుకుంది..చాలా బాధకారమయిన విషయం.. వీలున్నంతవరకూ మన మంచి ఆహారం ఇవ్వటమే.. దోసకాయల్లో మిరియాలు పొడి ఉంచి గోమాతలకి ఆహారంగా ఇస్తే వైరస్ బారినపడకుండా కాపాడిన వాళ్ళం అవుతాము. తర్లుపాడు మండలం కేతగుడిపిలో గోశాల కలదు. అందులో 80కి పైగా అవులను సంరక్షిస్తున్నారు. ఆ ఆవులకు వైరస్ సోకకుండా దోసకాయలలో మిరియాల పొడిని ఉంచి ఆహారంగా ఇస్తున్నారు. రోజుకు 4 బస్తాల దోసకాయలు అవసరం. ఒక బస్తాలో 50 కేజీల దోసకాయలు ఉంటాయి. ఒక బస్తా ఖరీదు రూ.200. దాతలు సహృదయంతో స్పందించి గో సంరక్షణకు చేయూతనిస్తారని కోరుకుంటూ... *విశ్వమాత గోమాత*.. phonepe number 9121380644 పేరు కొండయ్య * లేదా నా పేరు మీద ఫోన్ పే చేసిన ఇబ్బంది లేదు * నా ఫోన్ పే నెంబరు9247674626 ఇల్లూరి రంగస్వామి గౌడ్🙏🙏🙏🙏🙏 అందరూ మీకు తోచిన సాయం చేస్తారని ఆశిస్తున్నాం

"థైరాయిడ్" వ్యాధితో బాధపడుతూ ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న రామలక్ష్మమ్మ అనే వృద్ధ మహిళను గుర్తించి ఆర్ధిక సహకారాలతో పాటు మందులు పంపిణీ చేసిన గొంట్ల కృష్ణ (స్పైసి రెస్టారెంట్)…………….

మార్కాపురం పట్టణం లోని విజయ టాకీస్ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి రామ లక్ష్మమ్మ అనే వృద్ధ మహిళ "థైరాయిడ్" వ్యాధితో బాధపడుతూ ఇబ్బంది పడుతున్న విషయాన్ని గమనించిన స్టూడియో ఎన్ రిపోర్టర్ కృష్ణారెడ్డి గారు అందించిన సమాచారం మేరకు రామలక్ష్మమ్మను విచారించగా వచ్చే పింఛన్ మీద ఆధారపడడంతో జీవనం బ్రతుకు జట్కాబండిగా మారింది.కనీసం మందులు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నందున వారిని గుర్తించి దాత గొంట్ల కృష్ణ స్పైసి రెస్టారెంట్ (మార్కాపురం) వారి ఆర్థిక సహాయ సహకారాలతో రామలక్ష్మమ్మ గారికి మందులు పంపిణీ చేయడం జరిగినది. ఇలాగే నిత్యం దాతలు సహాయ సహకారాలు అందించినచో భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెన్నుపల్లి కాశయ్య గారు (హోంగార్డ్) తెలియజేసినారు. ఎవరైనా దాతలు ఆర్థిక సహాయ సహకారాలు అందించాలన్నచొ 9603580633 నెంబర్ ని సంప్రదించవలసినదిగా కోరడమైనది.

మార్కాపురం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల వేదికగా విశ్వనరుడను అని చాటిన మహనీయులు ప్రఖ్యాత కవి గుర్రం జాషువా గారి 128 వ జయంతి...అలాగే స్వాతంత్ర్య సమరయోధులు భగత్ సింగ్ గారి 116 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి గారు…………………

తేదీ : 28-09-2022 ఈరోజు 106వసంతాల సుదీర్ఘ ఘన చరిత్ర గల జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మార్కాపురం వేదికగా విశ్వనరుడను అని చాటిన మహనీయులు ప్రఖ్యాత కవి గుర్రం జాషువా గారి 128 వ జయంతి...అలాగే స్వాతంత్ర్య సమరయోధులు భగత్ సింగ్ గారి 116 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది... ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా గుర్రం జాషువ..భగత్ సింగ్ గార్ల పటాలకు పూలమాలలతో అలంకరించి..ఘనంగా నివాళులు అర్పించారు... ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ విప్లవం వర్ధిల్లాలి అని నినదించి, బ్రిటిష్ ప్రభుత్వంపై పోరాటపు జెండా ఎగురేసి, భారత స్వాతంత్ర్య పోరాటాన్ని మలుపు తిప్పి, సాయుధ పోరాటమే స్వతంత్ర్యానికి పునాది అని నినదించి నా విడుదల కన్నా నా మరణమే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూలదోయగలిగే ఉద్యమ కారుల్ని అందిస్తుంది అని నమ్మిన విప్లవకారుడు భగత్ సింగ్ అయితే ఆధునిక సాహిత్య చరిత్రలో కవిగా ప్రజాపక్షం వహించి, తన కలాన్ని ఝుళిపించి, సాహిత్యాన్ని సామాన్యుని ముంగిట అసామాన్యం చేసినవాడు, నవీన వాఙ్మయ రత్నగర్భలో గుండెలను కరిగింపగల భావావే...

ఏపి సీఎం జగన్‌ను కలిసిన ఆర్టీసీ ఉద్యోగులు, తమకు పీఆర్సీ అమలు చేయడంపై ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు…………..

ఏపి సీఎం జగన్‌ను కలిసిన ఆర్టీసీ ఉద్యోగులు ఆర్టీసీ ఉద్యోగులు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మంగళవారం కలిశారు. తమకు పీఆర్సీ అమలు చేయడంపై ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్‌ చైర్మన్‌ కాకర్ల వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకున్నారని ప్రస్తావించారు. కరోనా సమయంలోనూ ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు ఇబ్బంది లేకుండా చేశారని గుర్తు చేశారు. తాజాగా అక్టోబర్ 1 నుంచి వారికి పీఆర్సీ అమలు చేయబోతున్నట్లు తెలిపారు. గురుకుల, ఎయిడెడ్, యూనివర్సిటీ ఉద్యోగుల వయోపరిమితి పెంచే విషయంపై సీఎం సానుకూలంగా స్పందించారని వెంకట్రామిరెడ్డి తెలిపారు. 52 వేల మంది ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత సీఎం వైఎస్ జగన్‌ది అని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ (ఏపీపీటీడీ) వైఎస్సార్‌ ఎంప్లాయ్‌ అసోసియేషన్‌ నేత చల్లా చంద్రయ్య కొనియాడారు. తమకు 10 వేల కోట్ల జీతాలు చెల్లించి ఆర్టీసీ భవిష్యత్తును కాపాడినట్లు తెలిపారు. అక్టోబర్ 1 నుంచి కొత్త పే స్కేల్ అమలు చేయబోతున...

మార్కాపురం నియోజకవర్గంలో మార్కాపురం మండలంలోని లో వేములకోట గ్రామంలో మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో """ బాదుడే- బాదుడు """కార్యక్రమం………………..

తేది:27.09.2022., వేములకోట గ్రామం.,మార్కాపురం మండలం బాడుడే - బాదుడు. ఈరోజు మార్కాపురం నియోజకవర్గంలో మార్కాపురం మండలంలోని లో వేములకోట గ్రామంలో మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో """ బాదుడే- బాదుడు """కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం ప్రజలపై ఏ విధంగా కక్ష కట్టి ప్రజల నుండి రకరకాల పన్నుల రూపంలో దోపిడీ చేస్తున్నారో సవివరంగా వివరించారు. గత ఎన్నికల ముందు ఒక అవకాశం ఇవ్వండి అని ప్రజలను ప్రాధేయపడీ అధికారంలోకి వచ్చిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయులను, ఉద్యోగస్తులను, విద్యార్థులను రైతులను అన్ని వర్గాలు కులాల వారిని ఇబ్బంది పెడుతూ పరిపాలన సాగిస్తున్నారని మాట తప్పం మడమ తిప్పను ఎన్నికల ముందు జగన్ మోహన్ రెడ్డి గారు ముస్లిం మైనారిటీ ఆడపిల్లలకు దుల్హన్ పథకం క్రింద తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చే 50 వేల రూపాయలను లక్ష రూపాయలు ఇస్తానని వాగ్దానం చేసి పూర్తిగా ఆ పథకం ఎత్తివేశారు అని ఉపాధ్యాయులకు ఒక్క వారంలో సిపిఎస్ రద్దు చ...

*సామాన్యుల వద్దకు సామాన్యుల పార్టీ ( ఆమ్ ఆద్మీ పార్టీ - AAP )*………………..

*సామాన్యుల వద్దకు సామాన్యుల పార్టీ ( ఆమ్ ఆద్మీ పార్టీ - AAP )* *ఈరోజు ( 27-09-2022 ) ప్రకాశం జిల్లాలోని మార్కాపురం పట్టణం నందు ఆమ్ ఆద్మీ పార్టీ ( AAP ) గురించి ప్రచారం చేయటం జరిగింది..* *ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళ విభాగం సంయుక్త కార్యదర్శి కంచర్ల.సరస్వతి గారు పాల్గొని పార్టీ వాలంటీర్ లకు పార్టీని ప్రజల దగ్గరికి ఎలా చేరువ చేయాలి అనే విషయంలో దిశా నిర్దేశం చేసారు..* *ఏ విధంగా ప్రచారం చేసి కేజ్రీవాల్ గురించి, ఆమ్ ఆద్మీ పార్టీ గురించి ఎలా వివరించాలి అని తెలియచేసారు...* *కంచర్ల సరస్వతి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాలంటీర్ లతో కలిసి మార్కాపురం పట్టణంలోని కొత్త బస్టాండ్, పాత బస్టాండ్, ముఖ్యమైన కూడల్లలో వాల్ పోస్టర్ లు అంటించి మరియు పార్టీ గురించి విస్తృతంగా ప్రచారం చేయటం జరిగింది..* *ఈ కార్యక్రమంలో యర్రగొండపాలెం నియోజకవర్గం నాయకుడు మన్నెం ఇస్సాక్ మరియు వాలంటీర్ లు పఠాన్ .అత్తావుళ్ళాఖాన్,,మలపోలు.శాంతా కుమార్ గారులు పాల్గొని చాలా చురుకుగా వాల్ పోస్టర్ లు అతికించి, పార్టీ గురించి ప్రచారం చేయటం జరిగింది..*

మాజీ సైనికులకు అవగాహన సదస్సు………………

మాజీ సైనికులకు అవగాహన సదస్సు ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణం లోని మాజీ సైనికుల కార్యాలయం నందు రాష్ట్ర సైనిక సంక్షేమ అధికారి వి. వెంకటరెడ్డి, జిల్లా సైనిక సంక్షేమ అధికారి రజనికుమారి లు మాజీ సైనికులకు అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. గిద్దలూరు ప్రాంతానికి చెందిన మాజీ సైనికులు సమస్యలు వాటి పరిష్కారం కోసం ఈ కార్యక్రమం ను ఏర్పాటు చేయబడింది. రాష్ట్ర సైనిక సంక్షేమ అధికారి వి. వెంకటరెడ్డి ని మాకు అనగా మాజీ సైనికులకు ప్రత్యేకంగా కాలనీ లు ఏర్పాటు చేసి ఒక్కొక్కరికి 175 స్క్వేర్ యార్డ్స్ ఉండేలా ఇంటిస్థలం ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఇవ్వాలని కోరగా ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని తెలిపారు. స్పార్స్, ఈ సిహెచ్ హాస్పిటల్, కేంద్రీయ విద్యాలయ ఏర్పాటు కోసం అలాగే మాజీ సైనికులకు వ్యవసాయం కోసం భూమి ని ఇవ్వాలని జీవో ఉంది కానీ చాలా మందికి భూమి ని ఇవ్వట్లేదని, ఇచ్చిన వారికి కొన్ని సమస్యలు ఉన్నాయని ఈ విషయాన్ని కలెక్టర్, రెవిన్యూ డిపార్ట్మెంట్ ల దృష్టికి తీసుకెళ్తానని, మాజీ సైనికుల సమస్యలు తెలుసుకుని వారి సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు. ఈ కార్యక్రమం లో మాజీ సైనికుల రాష్ట్ర అధ్యక్షులు న...

జాతీయ చిత్ర కళాప్రదర్శన బ్రోచర్ ను ఆవిష్కరించి అభినందించిన కలెక్టర్.....………..

జాతీయ చిత్ర కళాప్రదర్శన బ్రోచర్ ను ఆవిష్కరించి అభినందించిన కలెక్టర్..... సృష్టి ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో అక్టోబర్ 8వతేదీన జరుగనున్న జాతీయ చిత్రకళా ప్రదర్శన పోస్టర్ ను మన జిల్లా కలెక్టర్ శ్రీ A. S. దినేష్ కుమార్, ఐఏఎస్, గారు ఆవిష్కరించినట్లు సృష్టి ఆర్ట్ అకాడమీ అధ్యక్షులు తిమ్మిరి రవీంద్ర, ఏలూరి శేష బ్రహ్మం లు తెలిపారు. ముఖ్య అతిధి గా రాష్ట్ర , పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల మరియు క్రీడా శాఖ మంత్రివర్యులు శ్రీమతి ఆర్.కె.రోజా గారు, వస్తున్నట్లు జాతీయ స్థాయిలో అనేక రాష్ట్రాల నుండి వస్తున్న చిత్ర కళాకారుల కోసం మంచి కార్యక్రమం చేస్తున్నారని సృష్టి ఆర్ట్ అకాడమీ తిమ్మిరి రవీంద్ర ను, మరియు చిత్రకారులను అభినందించారు. ఈ కార్యక్రమం లో నేషనల్ హ్యూమన్ రైట్స్ జాతీయ కార్యదర్శి డా! టి. భానుచందర్, తూనుగుంట నాగమణి, దారా. బాల కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు వివిధ కార్యక్రమాలు రూపొందిస్తామని ఈ కార్యక్రమానికి ఆసక్తి గల చిత్రకారులు అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తిమ్మిరి రవీంద్ర తెలిపారు. ఆసక్తి కలిగిన చిత్రకారులు, శిల్పులు ఇతర వివరాలకు 8297090007 సంప...

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి బొత్స గుడ్‌న్యూస్.. వారికి మాత్రమే, సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో! బొత్స సత్యనారాయణ ఏపీ మున్సిపల్ టీచర్లతో విజయవాడలో సమావేశాలు……………..

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి బొత్స గుడ్‌న్యూస్.. వారికి మాత్రమే, సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో! బొత్స సత్యనారాయణ ఏపీ మున్సిపల్ టీచర్లతో విజయవాడలో సమావేశం అయ్యారు. వారి సమస్యలపై ఆరా తీశారు.. త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే పదవీ విరమణకు వయస్సుకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి బొత్స శుభవార్త చెప్పారు. సొసైటీలు, గురుకులాలు, వర్సిటీ బోధనేతర సిబ్బంది, ఎయిడెడ్‌ ఉపాధ్యాయులకు పదవీ విరమణ వయసు పెంపు చేస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చారని మంత్రి తెలిపారు. అందుకు అనుగుణంగా వీరికి పదవీ విరమణ వయసు 62 ఏళ్లు చేస్తామని హామీ ఇచ్చారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలపై విజయవాడలో ఉపాధ్యాయ సంఘాల నాయకులతో మంత్రి బొత్స చర్చించారు. అనంతరం కీలక నిర్ణయాలను మంత్రి ప్రకటించారు. మున్సిపల్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అక్టోబరు నుంచి డీడీవో అధికారాలు ఇస్తామని తెలిపారు. ఈ నిర్ణయంతో జీతాలు, సెలవులు లాంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అన్నారు. మున్సిపల్ స్కూళ్లలో ఉపాధ్యాయులకు సమస్యలు ఉన్నాయని.. వేతనాలు, సెలవుల సమస్యను పరిష్కరించామని తెలిపారు...

*గతంలో 10 కేసుల్లో నిందితులుగా ఉన్న అంతర రాష్ట్ర ఘరానా దొంగల ముఠాను చాకచక్యంగా పట్టుకున్న ప్రకాశం జిల్లా పోలీసులు* *నిందితులను అరెస్ట్ చేయటం చేసి చోరీ సొత్తు రికవరీ చేసిన పోలీస్ అధికారులను మరియు సిబ్బందిని అభినందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్ ఐపీఎస్ గారు*……………..

*ప్రకాశం జిల్లా తేది: 27.09.2022* *గతంలో 10 కేసుల్లో నిందితులుగా ఉన్న అంతర రాష్ట్ర ఘరానా దొంగల ముఠాను చాకచక్యంగా పట్టుకున్న ప్రకాశం జిల్లా పోలీసులు* *నిందితులను అరెస్ట్ చేయటం చేసి చోరీ సొత్తు రికవరీ చేసిన పోలీస్ అధికారులను మరియు సిబ్బందిని అభినందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్ ఐపీఎస్ గారు* *కేసుల వివరాలు*: 1) ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ Cr.No. 499/2022 U/S 454, 380 I.P.C: ప్రకాశం జిల్లా, ఒంగోలు టౌన్ లో శ్రీనగర్ కాలనీ లోని 1 వ లైన్ లోని దొరై రాజు ఇంటిలో తేది.20.07.2022 న మద్యాహ్నం సమయంలో గుర్తు తెలియని దొంగలు ఇంటి మెయిన్ డోర్ పగలగొట్టి ఇంటిలోని 140 గ్రాముల బంగారం మరియు Rs.7.5 లక్షల డబ్బును దొంగలించుకొని పోయినారు. 2) మద్దిపాడు పోలీస్ స్టేషన్ Cr.No.182/2018 u/s 457, 380 IPC: ప్రకాశం జిల్లా, మద్దిపాడు గ్రామంలో పోలా మస్తాన్ ఇంటిలో తేది.18.11.2018 న రాత్రి సమయంలో గుర్తు తెలియని దొంగలు ఇంటి మెయిన్ డోర్ పగలగొట్టి ఇంటిలోని 28 గ్రాముల బంగారపు చైన్ ను దొంగలించుకొని పోయినారు. *దొంగిలించిన చోరీ సొత్తు*:- పై రెండు కేసులలో 168 గ్రాముల బంగారం (21...

మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారు " నమస్తే మార్కాపురం " కార్యక్రమంలో భాగంగా

తేది:27.09.2022. మార్కాపురం *ఈరోజు మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారు " నమస్తే మార్కాపురం " ఈ కార్యక్రమంలో భాగంగా 21 వ వార్డు లో పర్యటించి ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి వక్కలగడ్డ మార్కాపురం పట్టణ మల్లికార్జున, తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణ,తెలుగుదేశం పార్టీ మార్కాపురం పట్టణ అధ్యక్షులు dr. షేక్ మౌలాలి, మాజీ కౌన్సెలర్స్ సయ్యద్ గఫార్, మర్రి కొండలు,బొంతల పుల్లారావు,చిలకపాటి చెన్నయ్య, జిల్లా తెలుగు యువత దొడ్డా రవి కుమార్, రాష్ట్ర సగర ఉప్పర సాధికార కమిటీ సభ్యులు మట్టం వెంకటేశ్వర్లు,నియోజకవర్గ మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ మహబూబ్ బాషా, పట్టణ మైనారిటీ నాయకులు ఖాన్ భాయ్,,తెలుగుదేశం నాయకులు దాసరి కోటేశ్వరరావు, ఇండ్ల రవికుమార్,పాణ్యం రాంబాబు అంజన్ సింగ్, తెలుగు మహిళలు పోరుమామిళ్ల విజయలక్ష్మి, చెన్నాలక్ష్మి తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.

*ఆఫీసులో ఫోన్లు వాడొద్దు.. *ఫోన్లు చూసి సమయాన్ని వృథా చేస్తున్నారని సీఎండీ ఆగ్రహం* డిస్కంల ఉద్యోగులకు ఏపీసీపీడీసీఎల్ ఆదేశాలు*, *అక్టోబరు 1 నుంచే ఆదేశాల అమలు* *ఉల్లంఘిస్తే కఠిన చర్యలు*………………….

*ఆఫీసులో ఫోన్లు వాడొద్దు.. డిస్కంల ఉద్యోగులకు ఏపీసీపీడీసీఎల్ ఆదేశాలు* *ఈ నెల 19నే ఆదేశాల జారీ* *ఫోన్లు చూసి సమయాన్ని వృథా చేస్తున్నారని సీఎండీ ఆగ్రహం* *పని గంటలు వృథా కాకుండా ఉండేందుకే ఈ నిర్ణయమన్న పద్మాజనార్దనరెడ్డి* *అక్టోబరు 1 నుంచే ఆదేశాల అమలు* *ఉల్లంఘిస్తే కఠిన చర్యలు* కార్యాలయాల్లో మొబైల్ ఫోన్లు వాడొద్దంటూ ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ (ఏపీసీపీడీసీఎల్) ఉద్యోగులకు మెమో జారీ చేసింది. అక్టోబరు 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. డిస్కంల ఉద్యోగులు పని వేళ్లలో సమయాన్ని వృథా చేస్తున్నారని, రోజువారీ పనిని వాయిదా వేస్తున్నారని ఈ నెల 19న విడుదల చేసిన మెమోలో ఏపీసీపీడీసీఎల్ సీఎండీ జె.పద్మాజనార్దనరెడ్డి పేర్కొన్నారు. పనిని వాయిదా వేయడం వల్ల పేరుకుపోతోందన్నారు. కంప్యూటర్ ఆపరేటర్లు, ఆఫీసు సబార్డినేటింగ్ అధికారులు, రికార్డు అసిస్టెంట్లు, టైపిస్టులు, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఆఫీసు పనివేళల్లో... సెల్‌ఫోన్లు ఉపయోగిస్తూ పనిగంటలు వృథా చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై పనిగంటలు వృథా కాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట...

యర్రగొండపాలెం పట్టణంలోని ఉన్నత పాఠశాల క్రీడాప్రాంగణంలో 2 కోట్ల రూపాయలతో నిర్మించిన వైఎస్ఆర్ క్రీడా వికాస కేంధ్రాన్ని ప్రారంభం………….

రాష్ట్రంలో నేడు ప్రతిపక్షంగా నడుస్తున్న తెలుగుదేశం పార్టీ పరిస్దితి జంబలకిడి పంబలాగా మారిందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. యర్రగొండపాలెం పట్టణంలోని ఉన్నత పాఠశాల క్రీడాప్రాంగణంలో 2 కోట్ల రూపాయలతో నిర్మించిన వైఎస్ఆర్ క్రీడా వికాస కేంధ్రాన్ని ప్రారంభం చేసే కార్యక్రమంలో అమె ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రారంభించారు . ఈ ప్రారంభ కార్యక్రమానికి అమెతో పాటు మరో ఇద్దరు మంత్రులు పాల్గొని క్రీడావికాస కేంధ్రంలోని పలు భ్లాకులను ప్రారంభించారు .అనంతరం పురపాలక శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ నేత్రుత్వంలో సభ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ అమరావతి రైతులమంటూ రాష్ట్రంలో పాదయాత్ర పేరుతో అలజడులు స్ర్రృష్టించడం కోసం పన్నాగం పన్నారని విమర్శించారు .రాష్ట్రంలో దుష్టచతుష్టయం ఏకమై చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని ఆరాట పడుతున్నాయని అది వారికి సాధ్యమయ్యెపనికాదని పేర్కోన్నారు .తెలుగుదేశం పార్టీ రోజు రోజుకు దిగజారి పోతుందని ఆ పార్టీలో ఆడోళ్ళు తొడలు కొడతారని .మగోళ్ళు భోరుమంటు ఏడుస్తారని ఎద్దేవా చేసారు ..... ఈ కార్యక్రమంలో మైనార్టీ సంక్షేమ శాఖా మంత్రి అంజాద్ భాష,జిల్లాపరిషత్...

పింఛన్‌దారులకు ఏపీ సర్కార్‌ గుడ్‌న్యూస్ఒక చోట నుంచి మరో చోటుకు మారిన పింఛన్‌దారులకు ప్రభుత్వం వెసులుబాటు………………

పింఛన్‌దారులకు ఏపీ సర్కార్‌ గుడ్‌న్యూస్ఒక చోట నుంచి మరో చోటుకు మారిన పింఛన్‌దారులకు ప్రభుత్వం వెసులుబాటు పింఛన్‌ లబ్ధిదారు సొంత రాష్ట్ర పరిధిలో తన పింఛన్‌ను ఓ చోట నుంచి మరొక చోటకి మార్చుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఇందులో భాగంగా లబ్ధిదారులు తమ నివాసాన్ని ఒక చోట నుంచి మరొక చోటకి మారే సమయంలో ఆ వివరాలతో సంబంధిత గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులిచ్చారు. అలాగే, నిబంధనల ప్రకారం అర్హత లేని వారికి కూడా కొత్తగా పింఛన్లు మంజూరు చేసే అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోనుంది. అనర్హులకు పింఛన్‌ మంజూరు చేస్తే ఆ సొమ్మును మంజూరు చేసిన వారి నుంచి రికవరీ చేయనుంది. పింఛన్ల సొమ్మును దుర్వినియోగ పరచడం.. పంపిణీ చేయకుండా మిగిలిపోయిన సొమ్మును తిరిగి ప్రభుత్వ ఖాతాలో జమ చేయకుండా ఉండే సిబ్బందిపైనా తగిన చర్యలు తీసుకోనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.