Skip to main content

Posts

Showing posts from August, 2022

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం నందు గొలమారి నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగ సంబరాలు……….

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం నందు గొలమారి నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమానికి విచ్చేసిన జనసేనపార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్ గారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం పట్టణ అధ్యక్షులు డాక్టర్ ఇమామ్ సాహెబ్, పిన్నెబోయిన శ్రీనివాసులు, మట్టం శ్రీను, దుగ్గి రామిరెడ్డి, సుబ్బారెడ్డి, తిరుపతయ్య, మీరంపల్లి ఆది నారాయణ మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.

రేపటి నుంచే ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొత్త రూల్స్.. అలాంటి వాళ్లకు ఇక చుక్కలే!.............

రేపటి నుంచే ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొత్త రూల్స్.. అలాంటి వాళ్లకు ఇక చుక్కలే! ప్రభుత్వ ఆస్పత్రుల్లోని వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఘటనలు ఇటీవల తరుచూ వెలుగులోకి వస్తున్నాయి. ఇదే సమయంలో డాక్టర్లతో పాటు సిబ్బంది డ్యూటీ సమయంలో ఆస్పత్రిలో ఉండకుండా సొంత వ్యాపకాలపై బయట తిరుగుతున్నారని ప్రజల నుంచి ఫిర్యాదులు అందడంతో ఈ అంశంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఈ నేపథ్యంలో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేస్తున్నట్లు దాదాపు ఆరు నెలల కిందటే ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేసింది. వైద్య ఆరోగ్య శాఖలో సమూల మార్పులు. వైద్యులు, సిబ్బందికి బయోమెట్రిక్ హాజరు. ఫీల్డ్ సిబ్బందికి ఫేస్ రిగ్నిషన్ వ్యవస్థ. బయోమెట్రిక్ హాజరు మంగళవారం నిర్వహించిన ఏపీ వైద్య ఆరోగ్య శాఖ, సమీక్షా సమావేశంలో (Review Meeting ) కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సెప్టెంబర్ 1 నుంచి బయోమెట్రిక్ హాజరు అమల్లోకి తీసుకొస్తున్నట్టు మంత్రి విడదల రజిని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ విధానం పక్కాగా అమలు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. అలాగే, అర్హులైన ప్రజల...

ప్రైవేటు విద్యాసంస్థలు విద్యాహక్కు చట్టాన్ని అమలు పరచండి -- కలెక్టర్ దినేష్ కుమార్ ప్రకాశం జిల్లా, ఒంగోలు..............

ప్రైవేటు విద్యాసంస్థలు విద్యాహక్కు చట్టాన్ని అమలు పరచండి -- కలెక్టర్ దినేష్ కుమార్ ప్రకాశం జిల్లా ఒంగోలు బడుగు బలహీన వర్గాల పిల్లలకు అడ్మిషన్ల విషయంలో ఎలాంటి లోపాలకు ఆస్కారం లేకుండా ప్రైవేటు విద్యా సంస్థలు విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్ ఆదేశించారు. ఈ చట్టం పై అవగాహన కల్పించడానికి ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్లు, ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులతో మంగళవారం జవహర్ నవోదయ విద్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యాహక్కు చట్టంలోని 121)×య) నిబంధన మేరకు ప్రతి ప్రైవేటు పాఠశాల ఒకటో తరగతి అడ్మిషన్లలో నాలుగో వంతు పిట్లను బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఉచితంగా కేటాయించవలసి ఉందన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ. ఎం.ఎస్.నెం. 129 ప్రకారం ఈ 25 శాతం సీట్లలోనూ, హెచ్.ఐ.వి. బాధితుల పిల్లలకు, అనాధలకు, ఎస్.సి. ఎస్.టి., బి.సి. మైనారిటీలకు నిర్దిష్ట కోటా మేరకు సీట్లు కల్పించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయరాదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు కల్పిం...

ఫోన్‌ యాప్‌ ద్వారానే టీచర్ల హాజరు రేపటి నుంచే ప్రారంభం దృష్టి లోపం ఉన్నవారికి మినహాయింపు టీచర్లంతా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి పాఠశాల విద్యా శాఖ ఆదేశాలు…………….

ఫోన్‌ యాప్‌ ద్వారానే టీచర్ల హాజరు రేపటి నుంచే ప్రారంభం దృష్టి లోపం ఉన్నవారికి మినహాయింపు టీచర్లంతా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి పాఠశాల విద్యా శాఖ ఆదేశాలు రాష్ట్రంలో ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్‌ మినహా అన్ని యాజమాన్యాల పరిధిలోని ఉపాధ్యాయులు, ఉద్యోగులందరూ సెప్టెంబర్‌ 1 నుంచి ఇంటిగ్రేటెడ్‌ అటెండెన్స్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా ఫేషియల్‌ రికగ్నిషన్‌ విధానంలో హాజరు నమోదు చేయాలని పాఠశాల విద్యా శాఖ మంగళవారం సర్క్యులర్‌ జారీ చేసింది. ఫోన్‌ యాప్‌ ద్వారా మాత్రమే ఉపాధ్యాయులు హాజరును వేయాలని తెలిపింది. వీరితోపాటు పాఠశాల విద్యా శాఖ నియంత్రణలో ఉన్న అన్ని కార్యాలయాల్లోని బోధనేతర సిబ్బంది కూడా ఈ యాప్‌లో హాజరు నమోదు చేయాలని వెల్లడించింది. సెప్టెంబర్‌ 1 నుంచి ఏ కార్యాలయాల్లోనూ మాన్యువల్‌ హాజరును నమోదు చేయకూడదని స్పష్టం చేసింది. వికలాంగుల సంక్షేమ శాఖ నిబంధనల ప్రకారం.. దృష్టిలోపం ఉన్న ఉద్యోగులకు ప్రత్యేక మినహాయింపు ఉంటుందని వివరించింది. వారు ప్రత్యేకంగా మాన్యువల్‌ రిజిస్టర్లలో హాజరు నమోదు చేయాలని పేర్కొంది. కాగా, ఫేషియల్‌ రికగ్నిషన్‌ హాజరు విధానాన్ని నెల రోజుల్లో అన్ని విభాగాల్లో అమలు చేయనున్నారు. ఆండ్రాయిడ...

విధులు పక్కాగా.. ప్రభుత్వాస్పత్రుల ఉద్యోగులకు జాబ్‌చార్ట్‌ ప్రభుత్వాస్పత్రుల పర్యవేక్షణ, నిర్వహణపై వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక దృష్టి అక్కడ పనిచేసే అధికారులు, ఉద్యోగుల జాబ్‌చార్ట్‌కు రూపకల్పన..............

విధులు పక్కాగా.. ప్రభుత్వాస్పత్రుల ఉద్యోగులకు జాబ్‌చార్ట్‌ ప్రభుత్వాస్పత్రుల పర్యవేక్షణ, నిర్వహణపై వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక దృష్టి అక్కడ పనిచేసే అధికారులు, ఉద్యోగుల జాబ్‌చార్ట్‌కు రూపకల్పన సూపరింటెండెంట్, ఆర్‌ఎంఓ, ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్‌.. ఇలా ఎవరి విధులు ఏమిటనే దానిపై స్పష్టత ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్పులు, చేర్పులు సెక్యూరిటీ, శానిటేషన్, ఇతర ఉద్యోగుల హాజరుకూ ‘ఫేషియల్‌ రికగ్నిషన్‌’ ప్రత్యేక సెల్‌ ద్వారా హాజరు పర్యవేక్షణ రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించడమే అంతిమ లక్ష్యం ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందించేందుకు అనేక సంస్కరణలు చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మరో అడుగు ముందుకేసి వాటికి మరింత పదును పెడుతోంది. నాడు–నేడు కింద ఇప్పటికే రూ.16వేల కోట్లతో 16 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుతో పాటు, ప్రస్తుతమున్న ఆస్పత్రుల్లో పెద్దఎత్తున మౌలిక సదుపాయాల కల్పన చేపడుతున్న విషయం తెలిసిందే. అలాగే, 40 వేలకు పైగా పోస్టుల భర్తీని చేపట్టారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి ప్రభుత్వం ఇన్ని చర్యలు తీసుకున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఇంకా పలు సమస్యలు ఉన్నట్లు అధికారులు గుర్తిం...

*స్పందన ఫిర్యాదులపై తక్షణ చర్యలు:ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్ ఐపీఎస్ గారు* *ప్రకాశం జిల్లా పోలీస్‌ స్పందనకు 126 పిర్యాదులు*..............

*ప్రకాశం జిల్లా *స్పందన ఫిర్యాదులపై తక్షణ చర్యలు:ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్ ఐపీఎస్ గారు* *ప్రకాశం జిల్లా పోలీస్‌ స్పందనకు 126 పిర్యాదులు* ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ఈ రోజు ‘స్పందన' కార్యక్రమంను జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ గారు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల అర్జీలను ఎస్పీ గారు స్వయంగా స్వీకరించి, వారితో మాట్లాడి వారి యొక్క సమస్యల పూర్వాపరాలను అడిగి తెలుసుకొని, వాటిని చట్టపరిధిలో పరిష్కరిస్తామని ఫిర్యాదిదారులకు భరోసా కల్పించారు. ఎస్పీ గారు ఆయా ఫిర్యాదులపై సంబందిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడి స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్టప్రకారం విచారణ జరిపి, నిర్దేశించిన గడువులోగా ఫిర్యాదుదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. రోజు ‘స్పందన' కార్యక్రమంలో ఎక్కువగా కుటుంబ కలహాలు, భర్త/అత్తారింటి వేదింపులు, భూ & ఆస్థి వివాదాలు మరియు ఇతర సమస్యలపై పిర్యాదులు అందాయి. *ఈ రోజు స్పందన ఫిర్యాదుల్లో కొన్ని... ప్లాటు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి...

గుడ్‌న్యూస్‌! పది వేల మందికి పైగా టీచర్లకు పదోన్నతి.. డిప్యూటీ డీఈవో, ఎంఈవో, హెచ్‌ఎమ్‌లుగా ప్రమోషన్లు టీచర్ల పదోన్నతుల కోసం అదనంగా 666 ఎంఈవో, 36 డిప్యూటీ డీఈవో పోస్టులు…………..

గుడ్‌న్యూస్‌! పది వేల మందికి పైగా టీచర్లకు పదోన్నతి.. డిప్యూటీ డీఈవో, ఎంఈవో, హెచ్‌ఎమ్‌లుగా ప్రమోషన్లు టీచర్ల పదోన్నతుల కోసం అదనంగా 666 ఎంఈవో, 36 డిప్యూటీ డీఈవో పోస్టులు 2,300 మంది టీచర్లకు సబ్జెక్టు మార్పు అవకాశం 22 ఏళ్ల సమస్యకు పరిష్కారం చూపిన సీఎం జగన్‌ న్యాయ వివాదాలకు తావులేకుండా అందరికీ మేలు సెప్టెంబర్‌లో పదోన్నతులు.. తరువాత టీచర్ల బదిలీలు రాష్ట్రంలో పదివేల మందికిపైగా ఉపాధ్యాయులకు పాఠశాల విద్యాశాఖ శుభవార్త అందించనుంది. పదోన్నతులు, బదిలీలకు సంబంధించి ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ అందడంతో టీచర్లకు మేలు చేసే ప్రక్రియకు త్వరలో శ్రీకారం చుట్టనుంది. 10 వేల మందికిపైగా టీచర్లకు స్కూల్‌ అసిస్టెంట్లుగా, ప్రధానోపాధ్యాయులుగా, మండల విద్యాశాఖాధికారులుగా, జిల్లా ఉప విద్యాశాఖాధికారులుగా పదోన్నతులు కల్పించనుంది. సెప్టెంబర్‌ నెల మొదటి వారంలోనే దీనికి సంబంధించిన ప్రక్రియ చేపట్టేలా షెడ్యూల్‌ సిద్ధం చేసింది. 7 వేల మంది ఎస్జీటీలకు ఎస్‌ఏలుగా పదోన్నతి రాష్ట్రంలో విద్యావ్యవస్థను పునాది నుంచి బలోపేతం చేస్తూ ప్రభుత్వం ఫౌండేషనల్‌ విద్యా విధానాన్ని తెచ్చిన సంగతి తెలిసిందే. దేశంలోనే తొలిసారిగా ప్రభుత్...

*మార్కాపురం పట్టణ ముస్లిం ధార్మిక సంఘాలు,మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మానవ మహోపకారి ముహమ్మద్ ప్రవక్త గారి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఒక మత ఉన్మాద,భాద్యత రాహిత్య తెలంగాణ బీజేపి శాసన సభ్యుడు (గోషా మహల్) రాజా సింగ్ పై కేసు నమోదు చేయాలని మార్కాపురం ఆర్.డి.ఓ లక్ష్మీ శివజ్యోతి గారికి మరియు మార్కాపురం డి.యస్.పి డాక్టర్ కిషోర్ కుమార్ గారికి…………….

*మార్కాపురం పట్టణ ముస్లిం ధార్మిక సంఘాలు,మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మానవ మహోపకారి ముహమ్మద్ ప్రవక్త గారి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఒక మత ఉన్మాద,భాద్యత రాహిత్య తెలంగాణ బీజేపి శాసన సభ్యుడు (గోషా మహల్) రాజా సింగ్ పై కేసు నమోదు చేయాలని మార్కాపురం ఆర్.డి.ఓ లక్ష్మీ శివజ్యోతి గారికి మెమోరాండం మరియు మార్కాపురం డి.యస్.పి డాక్టర్ కిషోర్ కుమార్ గారికి రిపోర్టు చేయడం జరిగింది.* ఈ సందర్భంగా  ముస్లిం ధార్మిక సంఘాలు,మరియు ప్రజాసంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ మానవ మహోపకారి,విశ్వ కారుణ్య మూర్తి,మహనీయ ముహమ్మద్ ప్రవక్త గారి పై ఒక మత ఉన్మాద,భాద్యత రాహిత్య తెలంగాణ బీజేపి శాసన సభ్యుడు(గోషా మహల్) రాజా సింగ్  ప్రచార మాధ్యమాలలో మహనీయ దైవ ప్రవక్త ముహమ్మద్ గారి పై అత్యంత అభ్యంతకరమైన,హేయమైన,నీచమైన,కర్కశ పదజాలంతో దూషిస్తూ నిస్సంకోచముగా, నిర్లజ్జ గా ఉచ్ఛరిస్తూ సామాజికమైన బాధ్యతాయుతమైన ప్రజా ప్రతినిధి హోదాలో ఉంటూ ముస్లిం సమాజాన్ని వక్రీకరిస్తూ,విషపూరిత మాటలతో మత విశ్వాసాల,సంప్రదాయాన్ని అవహేళన చేస్తూ,మత విశ్వాసానికి విఘాతం కలిగించేలా,మత ఘర్షణలుకు దారితీసేలా ,దేశ లౌకిక,భారత రాజ్యాంగ హక్కులకు భంగం కలిగేలా,యావత్ ప్రపంచ...

జాతీయ క్రీడా దినోత్సవ సందర్భంగా మార్కాపురం పట్టణములోని భగత్ సింగ్ కాలనీలో ప్రిన్సిపాల్ శ్రీ షేక్. కరీముల్లాగారి ఆథ్వర్యములో నిర్వహించబడుతూ, క్రమశిక్షణా పరంగా, విద్యా పరంగా నైతిక విలువలతో కూడిన విద్యను అందిస్తూ అందరి మన్నలను పొందుతూ గుర్తింపు పొందిన డి.ఎస్. స్కూల్ యాజమాన్యం మరియు సిబ్బంది ఆధ్వర్యములో………….

జాతీయ క్రీడా దినోత్సవ సందర్భంగా మార్కాపురం పట్టణములోని భగత్ సింగ్ కాలనీలో ప్రిన్సిపాల్ శ్రీ షేక్. కరీముల్లాగారి ఆథ్వర్యములో నిర్వహించబడుతూ, క్రమశిక్షణా పరంగా, విద్యా పరంగా నైతిక విలువలతో కూడిన విద్యను అందిస్తూ అందరి మన్నలను పొందుతూ గుర్తింపు పొందిన డి.ఎస్. స్కూల్ యాజమాన్యం మరియు సిబ్బంది ఆధ్వర్యములో జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్ధులకు వాలీబాల్, బ్యాట్మింటన్, క్రికెట్, ఖోఖో, కబడ్డి మరియు జనరల్ క్విజ్ పోటీలను ఘనంగా నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన మార్కాపురం పట్టణ విశ్రాంత వ్యాయామ సీనియర్ ఉపాధ్యాయులు శ్రీ డి. అల్లూరయ్యాగారి చేతుల మీదుగా పావురాన్ని ఎగురవేసి ఆటలను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన జీవిత అనుభవాలను విద్యార్ధులతో పంచుకొంటూ ప్రతి ఒక్కరూ మనోధైర్యాన్ని పెంపొందించుకొంటూ, ఆటలతో పాటు చదువులలో కూడ విజయాలు సాధించాలని దీవించారు. ముఖ్యంగా మానవుని జీవితంలో ఆటలు క్రమశిక్షణను, నిబద్ధతను, మానసికంగా ఉల్లాసాన్ని కలిగిస్తాయని తెలిపారు. నిర్వహించిన పోటీలలో విజేతలైన విద్యార్ధులకు మెడల్స్ మరియు బహుమతులు ఇవ్వడం జరిగింది. చి...

వైఎస్సార్‌ కంటివెలుగు’ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వృద్ధులకు నేత్ర పరీక్షలు, వీరికి ప్రభుత్వమే ఉచితంగా సర్జరీలు చేయిస్తున్న పరిస్థితి……………

‘వైఎస్సార్‌ కంటివెలుగు’ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వృద్ధులకు నేత్ర పరీక్షలు 56.88 లక్షల మందికిగాను ఇప్పటికే 22.16 లక్షల మందికి పూర్తి 10 లక్షల మందికి అద్దాలు అవసరమని గుర్తింపు.. వీరిలో 8 లక్షల మందికి పంపిణీ మరో 10 లక్షల మందికి మందులు అందజేత 1.69 లక్షల మందికి కాటరాక్ట్‌ సర్జరీలు అవసరమని గుర్తింపు వీరికి ప్రభుత్వమే ఉచితంగా సర్జరీలు చేయిస్తున్న పరిస్థితి కంటిచూపు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వృద్ధులకు ‘డాక్టర్‌ వైఎస్సార్‌ కంటి వెలుగు’ కార్యక్రమం చూపు ప్రసాదిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా 60ఏళ్లు పైబడిన వృద్ధులకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తోంది. చూపు సమస్యలతో బాధపడుతున్న వారిని గుర్తించి మందులు, కళ్లద్దాలు అందించడంతో పాటు, కేటరాక్ట్‌ సర్జరీలు ఉచితంగా చేస్తోంది. రాష్ట్రంలోని 5.60 కోట్ల మందికి కంటి వైద్య పరీక్షలు ఉచితంగా చేయాలనే ఉద్దేశ్యంతో వైఎస్సార్‌ కంటి వెలుగు కార్యక్రమానికి సీఎం వైఎస్‌ జగన్‌ 2019 అక్టోబర్‌ 10న శ్రీకారం చుట్టారు. ఆరు దశల్లో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు చేయాలని సంకల్పించారు. ఇందులో భాగంగా తొలి రెండు దశల్లో ప్రభుత్వ, ప్రైవేట్‌...

2,783 గ్రామాల్లో డీజీపీఎస్‌ పరికరాలతో రీ సర్వే, డీజీపీఎస్‌ పరికరాలతో సర్వేను ప్రారంభించిన రెవెన్యూ అధికారులు…………

2,783 గ్రామాల్లో డీజీపీఎస్‌ పరికరాలతో రీ సర్వే డీజీపీఎస్‌ పరికరాలతో సర్వేను ప్రారంభించిన రెవెన్యూ అధికారులు ఈ గ్రామాల్లో 28.50 లక్షల ఎకరాలు 4 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచిన సర్వేశాఖ జీపీఆర్‌ఎస్‌ సిగ్నల్స్‌ అందని 2,783 గ్రామాల్లో ప్రభుత్వం డీజీపీఎస్‌ పరికరాల ద్వారా భూముల రీ సర్వే చేపట్టింది. కొన్ని గ్రామాల్లో ఈ సర్వే మొదలైంది. డ్రోన్లు, జీఎన్‌ఎస్‌ఎస్‌ రోవర్ల ద్వారా అత్యంత ఆధునికమైన హైబ్రిడ్‌ టెక్నాలజీతో సర్వే సెటిల్మెంట్‌ శాఖ రీ సర్వేలో భాగంగా భూములను కొలుస్తోంది. ఇందుకోసం జీఎన్‌ఎస్‌ఎస్‌ నెట్‌వర్క్‌ ద్వారా 70 సీవోఆర్‌ఎస్‌ (కంటిన్యుయస్లీ ఆపరేటింగ్‌ రిఫరింగ్‌ స్టేషన్‌) బేస్‌స్టేషన్లను శాశ్వతపద్ధతిలో ఏర్పాటు చేసింది. శాటిలైట్ల ద్వారా వచ్చే జీపీఆర్‌ఎస్‌ సిగ్నల్స్‌ ఆధారంగా జీఎన్‌ఎస్‌ఎస్‌ నెట్‌వర్క్‌ ద్వారా ఈ కేంద్రాలు 24 గంటలు పనిచేస్తున్నాయి. కానీ కొండలు, దట్టమైన అటవీప్రాంతాల్లో జీపీఆర్‌ఎస్‌ సిగ్నల్స్‌ రాకపోవడం వల్ల సీవోఆర్‌ఎస్‌ నెట్‌వర్క్‌ ద్వారా రోవర్లు సరిగా పనిచేయడంలేదు. ఇలాంటి ప్రాంతాల్లో డీజీపీఎస్‌ పరికరాల ద్వారా రేడియో మోడ్‌లో రీ సర్వే చేయనున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్...

పెద్దారవీడు లోని సెల్ టవర్ ఎక్కిన బాధితిడు………….

ప్రకాశం జిల్లా పెద్దారవీడు లోని సెల్ టవర్ ఎక్కిన బాధితిడు పెద్దారవీడు గ్రామం లోని మేగావత్ ఓలిభాయ్ భర్త రామచంద్ర నాయక్ కు పెద్ద దోర్నాల గ్రామానికిచెందిన డూమావత్ బద్దు నాయక్ ఓలిభాయ్ కి గతంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగం ఇప్పిస్తామని 200000 లక్షలు తీసుకొని తిప్పుతున్నాడు ఇటీవలే ఎస్పీ వద్ద కూడా పిర్యాదు చేయగా మార్కాపురం సిఐ వద్దకు పంపగా సిఐ భీమా నాయక్ తో మాట్లాడి చెప్పిన నాకు న్యాయం జరగలేదు ఇప్పటికైనా నాకు న్యాయం జరగకపోతే టవర్ పై నుంచి దూకి ఆత్మ హత్య చేసుకుంటానంటున్న బాధితుడు

29వ తారీఖున అనగా సోమవారం ఉదయం 11 గంటలకు ఆర్ఎస్ రోడ్డు లోని రాక్ వుడ్ చర్చ్ కర్నూల్ ^^థాంక్యూ సీఎం^^ ప్రోగ్రాం కర్నూల్ సిటీ పాస్టర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు………….

కర్నూల్ లో ఉండే దైవ సేవకులు అందరికీ ఏసుక్రీస్తు నామములో వందనాలు దైవ సేవకులారా 29వ తారీఖున అనగా సోమవారం ఉదయం 11 గంటలకు ఆర్ఎస్ రోడ్డు లోని రాక్ వుడ్ చర్చ్ కర్నూల్ ^^థాంక్యూ సీఎం^^ ప్రోగ్రాం కర్నూల్ సిటీ పాస్టర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశాం కావున గౌరవ వేతనం పొందినవారు, పొందని వారు అందరు కూడా పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు, గౌరవనీయులు జనాబ్ హఫీజ్ ఖాన్ గారు గౌరవ నీయులు సుధా కర్ గారు ఎంపి గారు గౌరవనీయులు సంజీవకుమార్ గారు బీఎండబ్ల్యూ ఆఫీసర్ జనాబ్ మహబూబ్ బాషా గారు తదితర జిల్లా నాయకులు, అధికారులందరూ పాల్గొనే అవకాశం ఉంది కనుక దయచేసి ప్రార్థించి సమయానికి అనుకూలంగా రావలసిందిగా మనవి చేస్తున్నాను 94 94 41 11 34

ఆంధ్రప్రదేశ్: ఆరోగ్యానికి భరోసా ‘కార్డు’ డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌లో ఏపీ ముందంజ, ఆధార్‌ కార్డులానే ప్రతి ఒక్కరికీ 14 అంకెల సంఖ్యతో కూడిన హెల్త్‌ కార్డు………….

ఆంధ్రప్రదేశ్: ఆరోగ్యానికి భరోసా ‘కార్డు’ డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌లో ఏపీ ముందంజ ఆధార్‌ కార్డులానే ప్రతి ఒక్కరికీ 14 అంకెల సంఖ్యతో కూడిన హెల్త్‌ కార్డు ఇందులో వ్యక్తి ఆరోగ్యానికి సంబంధించి సమగ్ర సమాచారం ఆస్పత్రికి వెళ్లిన వెంటనే కంప్యూటర్‌లో సమాచారం ప్రత్యక్షం త్వరితగతిన కచ్చితమైన వైద్యం రాష్ట్ర ప్రజలకు శరవేగంగా.. మరింత నమ్మకమైన వైద్యం ఆస్పత్రుల అనుసంధానంలో దేశంలోనే రెండో స్థానంలో ఏపీ 2023 జూలై 1.. సుబ్బారావుకు జ్వరమొచ్చింది. వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌కు వెళ్లి హెల్త్‌ కార్డు ఇచ్చాడు. అందులో ఉన్న నంబరును హెల్త్‌ ప్రొవైడర్‌ కంప్యూటర్‌లో ఎంటర్‌ చేశాడు. ‘ప్రతి ఏటా ఇదే సీజన్‌లో మీకు జ్వరం వస్తోంది. మీకు కొన్ని మందులు బాగా పనిచేస్తున్నాయి. యాంటీబయాటిక్స్‌ మీ ఒంటికి పడటంలేదు. అందువల్ల ఇతర మందులు వాడాలి. మీ వయసు పెరుగుతున్నందున ఆహారంలో మార్పులు చేసుకోవాలి’ అంటూ హెల్త్‌ ప్రొవైడర్‌ చెబుతున్న వివరాలతో సుబ్బారావు ఆశ్చర్యపోయాడు. ఈ విషయాలన్నీ కొత్తగా వచ్చిన ఈయనకు ఎలా తెలిశాయబ్బా అనుకుని అదేమాట అడిగేశాడు. మీ హెల్త్‌ అకౌంటులో మీ ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం అంతా ఉంటుంది. మీరు గతంలో ఏ జబ్బులక...

ఎంపిటిసి కి అభినందనలు వెల్లువ...………

ఎంపిటిసి కి అభినందనలు వెల్లువ... తర్లుపాడు మండలం పోతలపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ సభ్యులు మండల వైస్ ఎంపీపీ - 1 కూర్మారాయుని పుణ్యవతమ్మ మరియు చెన్నకేశవరావు ల మొదటి సంతానం శ్రీ కే.చంద్రమోహన్ కు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్ డిగ్రీ (పీహెచ్ డి) ప్రకటించిన నేపథ్యంలో గౌరవ మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కే.పీ నాగార్జున రెడ్డి గారు ఎంపీటీసీ దంపతులతో ఫోన్ లో మాట్లాడి శుభాకాంక్షలు తెలియజేశారు.వెనుకబడిన ప్రాంతమైన పశ్చిమ ప్రకాశానికి చెందిన వ్యక్తి ఇంతటి ఘనత సాధించడం పట్ల ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు."జిల్లాలో పేదరికం - ఉపాధి హామీ పథకం ప్రభావం" అనే అంశంపై సమగ్ర పరిశీలన చేసినందున వారి పరిశోధన ఫలితాలు ప్రభుత్వాలు పరిశీలించడం వలన దారిద్ర రేఖకు దిగువన నివసిస్తున్న ప్రజలకు ఉపాధి హామీ ద్వారా మరిన్ని సేవలు ప్రభుత్వాలు అందించేలా వారి పరిశోధన తోడ్పడుతుందని ఆశిస్తున్నట్లు ఎమ్మెల్యే ఓ ప్రకటనలో వెల్లడించారు.ఎమ్మెల్యే సోదరులు కృష్ణ మోహన్ రెడ్డి తో పాటుగా ఎంపీపీ భూలక్ష్మి రామసుబ్బారెడ్డి తో సహా పలువురు వైసీపీ ప్రజా ప్రతినిధులు అధికారులు ఎంపీటీసీ దంపతులకు అభినంద...

మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలు, హత్యలు, పోక్సో కేసుల పురోగతి మీద సమీక్షించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్ ఐపియస్ గారు* *కోర్టులలో శిక్షల శాతం పెరిగేలా కోర్ట్ మానిటరింగ్ సిబ్బంది శ్రమించాలి, *కేసుల ట్రయిల్ లో కోర్ట్ మానిటరింగ్ సిబ్బందికి దిశా నిర్ధేశం చేసిన జిల్లా ఎస్పీ గారు.*……………..

*ప్రకాశం జిల్లా తేది:27.06.2022* *మహిళా మీద జరుగుతున్న అఘాయిత్యాలు, హత్యలు, పోక్సో కేసుల పురోగతి మీద సమీక్షించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్ ఐపియస్ గారు* *కోర్టులలో శిక్షల శాతం పెరిగేలా కోర్ట్ మానిటరింగ్ సిబ్బంది శ్రమించాలి: జిల్లా ఎస్పీ గారు* *కేసుల ట్రయిల్ లో కోర్ట్ మానిటరింగ్ సిబ్బందికి దిశా నిర్ధేశం చేసిన జిల్లా ఎస్పీ గారు.* కోర్టుల్లో ట్రయల్ నడుస్తున్న ముఖ్యమైన కేసులలో గుడ్ ట్రయిల్ మానిటరింగ్ ద్వారా నిందితులు తప్పక శిక్షింపబడేలా చేయటమే లక్ష్యంగా ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో కోర్ట్ లైజన్ సిబ్బంది మరియు పోలీస్ స్టేషన్ల కోర్ట్ సిబ్బందితో జిల్లా ఎస్పీ గారు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్పీ గారు సిబ్బందికి కోర్టు ట్రయిల్ వివిధ దశల్లో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకొని వాటిని సమన్వయంతో అధిగమించేందుకు అవసరమైన అంశాలపై పోలీసు అధికారులు మరియు సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. కోర్ట్ కానిస్టేబుళ్లు సమన్లను అమలు జరపడం, వారెంట్స్‌ను ఎగ్జిక్యూట్ చేయడం, కోర్టు నందు సీడీ ఫైల్స్ దాఖలు పర్చడం, కోర్టు వాయిదాలకు సాక్ష్యులను హాజరుపర్చడం మరియు తదితర ...

*_రేషన్‌కార్డుకు కొత్త నిబంధనలు.. సంఖ్య తగ్గించే దిశగా అడుగులు…………….

*_రేషన్‌కార్డుకు కొత్త నిబంధనలు.. సంఖ్య తగ్గించే దిశగా అడుగులు.._* రేషన్‌ కార్డుల సంఖ్య మరింత తగ్గించే దిశగా అడుగులు పడుతున్నాయి. దీనికి సంబంధించిన‌ కొత్త నిబంధనలను కేంద్రం తెరపైకి తెచ్చింది._ _దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని మార్గదర్శకాలు జారీ చేసింది. ఒకవేళ అనర్హులు కార్డులను సరెండర్‌ చేయకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది._ *_తాజా నిబంధనలు.._* _గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,50,000 లోపు ఆదాయం ఉన్న వారు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల లోపు ఆదాయం ఉన్నవారే కార్డులకు అర్హులని తాజా నిబంధనల్లో పేర్కొన్నారు._ _మాగాణి భూములు 3.5 ఎకరాల్లోపు ఉన్నవారు, బీడు భూములైతే 7.5 ఎకరాల్లోపు ఉన్నవారు రేషన్‌ కార్డు తీసుకోవడానికి అర్హులని పొందుపర్చారు._ _గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10 వేలలోపు , పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.15 వేలు ఆదాయం వచ్చేవారు అర్హులని పేర్కొన్నారు._ _వంద చదరపు మీటర్ల ఇల్లు, ఫ్లాట్‌ ఉన్నవారు, కారు, ట్రాక్టర్‌, గ్రామాల్లో రూ.1.5 లక్షల కంటే ఎక్కువ ఆదాయం, పట్టణాల్లో రూ.2 లక్షల కంటే ఎక్కువ ఆదాయం, నగరాల్లో రూ.3 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే కార్డులు...

*ఆల్ఫా గ్లోబల్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ట్రై సైకిల్ (త్రి చక్ర వాహనాలు) పంపిణీ* *ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రకాశం జిల్లా మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ తేళ్ళ రవికుమార్.…………….

*ఆల్ఫా గ్లోబల్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ట్రై సైకిల్ (త్రి చక్ర వాహనాలు) పంపిణీ* *ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రకాశం జిల్లా మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ తేళ్ళ రవికుమార్...* రెండు కాళ్లు ఉండి నడవలేని దివ్యాంగులకు ఆల్ఫా గ్లోబల్ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో 5 మందికి ట్రై సైకిల్స్ (త్రి చక్ర వాహనాలు) శనివారం పంపిణీ చేశారు. స్థానిక డ్రైవర్స్ కాలనీలో గల ఎ. జి. యం నగర్లోని అల్ఫా గ్లోబల్ మినిస్ట్రీస్ - అల్ఫా తెలుగు చర్చిలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రకాశం జిల్లా మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ తేళ్ళ రవికుమార్ హాజరై దివ్యాంగులకు ట్రై సైకిల్ పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన వారిని గుర్తించి రెండు చేతులు ఉండి కాళ్లు లేక నడవలేక అవస్థలు పడుతున్న దివ్యాంగులను గమనించి వారి అవసరాలను గుర్తించి వారికి ట్రై సైకిల్స్ పంపిణీ చేయడానికి ముందుకు వచ్చిన ఆల్ఫా గ్లోబల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ యన్.విజయ భాస్కర్ రావును ఆయన అభినందించారు. ఇలాగే సేవాతత్పరతతో అనేకులు ముందుకు వచ్చి ఇలాంటి దివ్యాంగులను, ప్రత్యేక అవసరాలు కలిగిన వారిని ఆదుకునట్ల...

ఆకతాయిల ఆటకట్టు.. పాఠశాలల్లో ఫిర్యాదు బాక్స్‌లు... జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల బాలికల భద్రతకు భరోసా…………

ఆకతాయిల ఆటకట్టు.. పాఠశాలల్లో ఫిర్యాదు బాక్స్‌లు... జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల బాలికల భద్రతకు భరోసా రాష్ట్రంలో ఆడపిల్లల భద్రత కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పాఠశాలల్లో విద్యార్థినుల భద్రత కోసం.. వారికి భరోసా కల్పిస్తూ ఫిర్యాదుల బాక్సులను ఏర్పాటు చేస్తోంది. కొందరు ఆకతాయిలు విద్యార్థినులను వేధించడం వంటి చర్యలకు పాల్పడినప్పుడూ ఫిర్యాదు చేసేందుకు వెనకడుగు వేయకుండా ఈ ఫిర్యాదుల బాక్సులను ఏర్పాటు చేస్తున్నాయి. ప్రతీ పాఠశాల వద్ద ఇలాంటి బాక్సులు ఏర్పాటు చేయాలి. అలాగే బాలికలకు అవగాహన కల్పించేందుకు పాఠశాలల వద్ద ఫ్లెక్సీలు, బోర్డులు ఏర్పాటు చేయించాలి, ఎవరైనా తప్పుడు ఉద్దేశంతో ముట్టుకున్నా, తాకినా వెంటనే తల్లిదండ్రులకు గాని, పెద్దలకు తెలియజేయాలంటూ ఫ్లెక్సీలలో సూచించాలి. ఎప్పటికప్పుడు ఫిర్యాదులపై చర్యలు పాఠశాల వద్ద ఉన్న ఫిర్యాదుల బాక్సులో రాత పూర్వకంగా విద్యార్థినులు సమాచారాన్ని తెలియజేయాలి. ఈ బాక్సుల్లోని ఫిర్యాదులను ఎప్పటికప్పుడూ ఎంఈవో పరిష్కరిస్తారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాక్సుల్లో ఫిర్యాదులను పరిశీలించి ఎంఈవోకు సమాచారమిస్తారు. ఎంఈవో ఆ ఫిర్యాదుపై చర్యలు తీసుకుంటార...

*పుల్లల చెరువు పోలీస్ స్టేషన్ లో వార్షిక తనిఖీ నిర్వహించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్ ఐపియస్ గారు* *పలు రికార్డులు తనిఖీ ..... వివిధ కేసుల వివరాలపై ఆరా*

*ప్రకాశం జిల్లా             తేది:26.08.2022* *పుల్లల చెరువు పోలీస్ స్టేషన్ లో వార్షిక తనిఖీ నిర్వహించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్ ఐపియస్ గారు* *పలు రికార్డులు తనిఖీ ..... వివిధ కేసుల వివరాలపై ఆరా* *పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి భాదితులకు సత్వర న్యాయం అందించాలి* *నేరాల నియంత్రణ మరియు నాటుసారా నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకుకోవాలి* *మహిళలు మరియు బాలలపై నేరాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి.* *సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృత అవగాహనా కల్పించేలా చర్యలు తీసుకోవాలి* వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లాలోని యర్రగొండపాలెం సర్కిల్ లోని పుల్లల చెరువు పోలీస్ స్టేషన్ ను ఈ రోజు జిల్లా ఎస్పీ గారు తనిఖీ చేసారు. ఈ సందర్భంగా మొదట స్టేషన్‌ ఆవరణాన్ని మరియు పోలీస్ క్వార్టర్స్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం పోలీసు స్టేషన్ లోని వివిధ రూములను, రిసెప్షన్ సెంటర్, ఉమెన్ హెల్ప్ డెస్క్ లను, క్రైమ్ మ్యాప్, వివిధ కేసుల్లో సీజ్ చేయబడిన వాహనాలను పరిశీలించారు.  పోలీసు స్టేషన్ల లోని సిబ్బంది పని తీరు, వారి విధులు, ముఖ్యమైన కేసుల దర్యాప్తు, స్టేషన్ లో నిర్వ...

*నెల్లూరు కలెక్టర్ 24 గంటల్లో ఎస్సీ ఎస్టీ ఆత్మహత్య కేసులో బాధితురాలికి ఉద్యోగం ఇస్తే, ప్రకాశం కలెక్టర్కు ఏమైంది?* *ఎస్సీ ఎస్టీల పట్ల మానవత్వం లేని ప్రకాశం కలెక్టరేట్* *కలెక్టర్ దినేష్ కుమార్ను నిలదీసిన నీలం నాగేంద్ర*…………..

*నెల్లూరు కలెక్టర్ 24 గంటల్లో ఎస్సీ ఎస్టీ ఆత్మహత్య కేసులో బాధితురాలికి ఉద్యోగం ఇస్తే, ప్రకాశం కలెక్టర్కు ఏమైంది?* *ఎస్సీ ఎస్టీల పట్ల మానవత్వం లేని ప్రకాశం కలెక్టరేట్* *కలెక్టర్ దినేష్ కుమార్ను నిలదీసిన నీలం నాగేంద్ర* పక్కనున్న నెల్లూరు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న ఎస్సీ యువకుని భార్యకి 24 గంటల్లో అక్కడి కలెక్టర్ ఉద్యోగం, రిలీఫ్, ఇంటి స్థలం ఇచ్చేస్తే, ప్రకాశం జిల్లాలో ఎస్సీ ఎస్టీలు ఏళ్ల తరబడి కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారని దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు నీలం నాగేంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం నీలం నాగేంద్ర జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ను కలెక్టరేట్లో కలిశారు. ఆగస్టు 20న కావలి శివారు ముసునూరు గ్రామంలో మాల కులానికి చెందిన దుగ్గిరాల కరుణాకర్ శ్రీశైలం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ వైసీపీ నాయకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి వేధింపులకు బలవన్మరణం చెందిన ఘటనపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదయిందన్నారు. తాను ఆదివారం కావలి వెళ్లి కావలి ఆర్డిఓతో, డిఎస్పీతో మాట్లాడి, ఎఫ్ఐఆర్లో నేరానికి తగిన సెక్షన్ వేయకపోవటానికి గుర్తించి, సరి చేయించానన్నారు. ఆదివారం సాయంత్రం డీఎస్పీ ద్వారా కలెక్టరేట్కు...

ఏపీలో వినాయక చవితికి విగ్రహం పెడుతున్నారా.. ఈ రూల్స్ పక్కాగా పాటించాల్సిందే…………….

ఏపీలో వినాయక చవితికి విగ్రహం పెడుతున్నారా.. ఈ రూల్స్ పక్కాగా పాటించాల్సిందే! ఏపిలో వినాయక చవితి పండుగ రూల్స్ పాటించాల్సిందే. పోలీసుల కొన్ని సూచనలు చేశారు.. కచ్చితంగా అనుమతి తీసుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు. ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలను జరుపుకోవాలని కోరారు. ఏపీలో గణేష్ ఉత్సవ కమిటీలను పోలీసులు అలర్ట్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ గ్రామాలలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆయా ప్రాంతాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసుకొని ఉత్సవాలు నిర్వహించదలచినవారు ముందస్తుగా కమిటీని ఏర్పాటు చేసుకోవాలి అన్నారు. కమిటీ వారిదే పూర్తి బాధ్యత అని గుర్తించాలని.. పంచాయతీ వారి అనుమతి తీసుకోవాలని సూచించారు. సొంత స్థలాలలో గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేసే వాళ్లు.. ఆ స్థలానికి సంబంధించిన యజమాని అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి అన్నారు. విద్యుత్ కనెక్షన్ నిమిత్తం విద్యుత్ సంస్థ నుంచి అనుమతులు తప్పనిసరిగా పొందాలని సూచించారు. గ్రామాలలో వివిధ కూడళ్లు వద్ద మండపాలను ఏర్పాటు చేసుకుంటున్నామని పోలీసు వారికి తప్పనిసరిగా తెలియజేయాలి అన్నారు. సౌండ్, మైకులను ఏర్పాటు చేసుకోవడానికి పోలీసు వారి అనుమతులు తప్పని...

పర్యావరణాన్ని పరిరక్షిస్తేనే ఆర్థిక పురోగతి.. ఏపీలో ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలపై బ్యాన్‌ ప్రకటించిన సీఎం జగన్‌…………..

పర్యావరణాన్ని పరిరక్షిస్తేనే ఆర్థిక పురోగతి.. ఏపీలో ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలపై బ్యాన్‌ ప్రకటించిన సీఎం జగన్‌ పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక పురోగతి నాణేనికి రెండువైపులని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం విశాఖపట్నం ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో ‘పార్లే ఫర్‌ ది ఓషన్స్‌’ సంస్థతో ఎంఓయూ సందర్భంగా.. ఆయన ప్రసంగించారు. ఈ వేదిక నుంచే ఏపీలో ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలపై బ్యాన్‌ ప్రకటించారాయన. శుక్రవారం ఉదయం కోస్టల్‌ బ్యాటరీ నుంచి భీమిలి వరకూ.. ప్లాస్టిక్‌ వ్యర్థాలను క్లీన్‌ చేశారు వలంటీర్లు. ఈ సందర్భాన్ని ప్రస్తావిస్తూ.. ఇవాళ విశాఖలో ప్రపంచంలోనే అతిపెద్ద బీచ్‌ క్లీనింగ్‌ కార్యక్రమం జరిగిందని సీఎం జగన్‌ చెప్పారు. దాదాపు 76 టన్నుల ప్లాస్టిక్‌ను సముద్రం తీరం నుంచి తొలగించారు. భూమిపై 70 శాతం ఆక్సిజన్‌ సముద్రం నుంచే వస్తోంది. అందుకే సముద్రాన్ని కాపాడుకోవాలి. అలాగే ఏపీ తీరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పౌరులందరిదీ అని ఆయన పిలుపు ఇచ్చారు. పార్లే సంస్థ సముద్రం నుంచి ప్లాస్టిక్‌ వ్యర్థాలను బయటకు తీస్తుంది. రీసైకిల్‌ చేసి పలు ఉత్పత్తులు తయారు చేస్తుంది. అంతేకాదు.. పార్లే ఫ్యూచర్‌ ఇనిస్టిట్యూట్‌...

ఇటీవల కనిగిరి లో జరిగిన జనరల్ బాడీ మీటింగ్ నందు జిల్లా రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అసోసియేట్ ప్రెసిడెంట్ గా ఏకగ్రీవముగా ఎన్నికైన p. జయరావు గారు.………….

మార్కాపురం రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ యూనిట్ సెక్రటరీ శ్రీ p. జయరావు గారు ఇటీవల కనిగిరి లో జరిగిన జనరల్ బాడీ మీటింగ్ నందు జిల్లా రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అసోసియేట్ ప్రెసిడెంట్ గా ఏకగ్రీవముగా ఎన్నుకోబడ్డారు. ఈ సందర్బంను పురస్కరించుకొని మార్కాపురం యూనిట్ వారు ఈరోజు 25 న వారికి సన్మాన సభ ఏర్పాటు చేసినారు. స్థానిక రిటైర్డ్ ఎంప్లాయిస్ భవనం నందు డాక్టర్ బాలసుబ్బారావు గారి అధ్యక్షులు గా ఈ సన్మాన సభ నిర్వహించడం జరిగింది. శ్రీ p. మల్లికార్జున రావు, i. L. నాగేశ్వరావు, సూరే వెంకటేశ్వర్లు,విశ్రాంత mro జయపాల్, సర్దార్ గార్లు, శ్రీ జయరావు, విశ్రాంత ఉద్యోగుల సంఘం నకు చేసిన సేవలను ప్రస్తుతించారు. సర్వీస్ లో ఉన్నపుడు కూడా వారి యొక్క సేవా నిరతిని జ్ఞాపకం చేసుకున్నారు. వక్తలు ప్రస్తుతం విశ్రాంత ఉద్యోగుల సమస్యలు వాటిని ప్రభుత్వం ద్రుష్టికి తీసుకొని వచ్చుటలో అసోసియేషన్ యొక్క భాద్యతలు గురించి ప్రసంగించారు. జయరావు గారికి లభించిన ఈ పదవి యూనిట్ యొక్క గౌరవం గా భావించి, వారికి కన్నుల పండుగగా సన్మానం చేసినారు.తనకు జరిగిన సన్మానం నకు కృతజ్ఞతలు తెలుపుతూ జయరావు గారు విశ్రాంత ఉద్యోగుల అన్నీ సమస్యలు ప్ర...

‘చేయూత’కు దరఖాస్తుల స్వీకరణ……వచ్చే నెలలో మూడో విడత ‘వైఎస్సార్‌ చేయూత’కు ఏర్పాట్లు, కొత్తగా అర్హత పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకూ అవకాశం, ఆగస్టు 12వ తేదీకి 45 ఏళ్లు పూర్తయిన వారి పేర్లు నమోదు…………..

‘చేయూత’కు దరఖాస్తుల స్వీకరణ.... వచ్చే నెలలో మూడో విడత ‘వైఎస్సార్‌ చేయూత’కు ఏర్పాట్లు, కొత్తగా అర్హత పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకూ అవకాశం, ఆగస్టు 12వ తేదీకి 45 ఏళ్లు పూర్తయిన వారి పేర్లు నమోదు, సెప్టెంబర్‌ 5వ తేదీ వరకు సచివాలయాల ద్వారా దరఖాస్తు ఎంపీడీవోల ఆధ్వర్యంలో 8వ తేదీ వరకు దరఖాస్తుల పరిశీలన ఇప్పటికే రెండు విడతల్లో 24.95 లక్షల మందికి రూ.9,179 కోట్లు పంపిణీ రాష్ట్రంలో ఈ ఏడాది ఆగస్టు 12వ తేదీ నాటికి 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేయనుంది. ఇందుకు గాను ప్రస్తుతం అర్హుల నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పేర్ల నమోదుతో పాటు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతోంది. సెప్టెంబర్‌ 5వ తేదీ వరకు పేర్ల నమోదు ప్రక్రియ ఉంటుందని గ్రామ, వార్డు సచివాలయ శాఖ అధికారులు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాలలో 45 –60 ఏళ్ల మధ్య వయస్సు ఉండే అర్హులకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం పేరుతో ఏటా రూ.18,750 చొప్పున నాలుగు విడతల్లో రూ.75 వేలు అందజేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే ఈ...

కాన్సర్ ట్రీట్మెంట్ లో VRK Diet అద్భుతమైన ఫలితాలు……………

కాన్సర్ ట్రీట్మెంట్ లో VRK Diet అద్భుతమైన ఫలితాలు: 5 జులై 2022 తేదీన ఖాదర్ వలి అనే 15 సంవత్సరాల బాబును అనంతపురం నుంచి డాక్టర్ గురప్ప గారు హైదరాబాద్ రామకృష్ణ హెల్త్ లైన్ కు తీసుకొని వచ్చారు. అతని సమస్య B Cell Acute Lymphoblastic Leukemia.. బెంగళూరు సెయింట్ జాన్స్ హాస్పిటల్ లో కాన్సర్ ట్రీట్మెంట్ అయ్యాక ఒక దశలో Hemoglobin 4.0 కు పడిపోయింది.. 24-06-2022 రిపోర్టులు: 1. Hemoglobin 8.0 (13.0-17.0) 2. WBC Count 94,650 (4,000-11,000) 3. Platelets 11,000 (1,50,000-4,50,000) మా దగ్గరకు వచ్చిన రోజు అతను నడిచే పరిస్ధితిలో కూడా లేడు.. వెంటనే మన డైట్ ప్రోటోకాల్ మొదలుపెట్టించాము.. ఎలాంటి మందులు లేవు.. కేవలం డైట్ ప్రొటోకాల్.. అంతే..! డాక్టర్ గురప్ప గారి ప్రత్యక్ష పర్యవేక్షణ లో అనంతపురంలో మన డైట్ ప్రొటోకాల్ తూచ తప్పకుండా పాటించాక సరిగ్గా 20 రోజుల లోపే రికవర్ అయ్యాడు. రిపోర్టులు తీయించాము.. 25-07-2022 రిపోర్టులు: 1. Hemoglobin 11.8 (12.0-16.0) 2. WBC Count 7,300 (4,500-11,000) 3. Platelets 4,06,000 (1,50,000-4,50,000) నిజంగా నేను కూడా అతని రికవరీ "ఇంత త్వరగా" వస్తుందని ఊహించలేకపోయాను. స...

మార్కాపురం ఐడియల్ డిగ్రీ కాలేజీలో మాస్ కాపీయింగ్. విద్యార్థుల నుండి భారీగా వసూళ్లు. చర్యలు చేపట్టాలని సిపిఎం ఆధ్వర్యంలో తాసిల్దార్ గారికి అర్జీ అందజేత………….

మార్కాపురం ఐడియల్ డిగ్రీ కాలేజీలో మాస్ కాపీయింగ్. విద్యార్థుల నుండి భారీగా వసూళ్లు. చర్యలు చేపట్టాలని సిపిఎం ఆధ్వర్యంలో తాసిల్దార్ గారికి అర్జీ అందజేత. డిగ్రీ మూడవ సంవత్సరం ఫెయిల్ అయిన విద్యార్థులకు నాగార్జున యూనివర్సిటీ వారు సూపర్ సప్లమెంటరీ ఎగ్జామ్స్ ఈనెల 17వ తేదీ నుండి 26వ తేదీ వరకు జరుగుతున్నాయి. ఈ పరీక్షలు మార్కాపురం పట్టణంలోని ఐడియల్ డిగ్రీ కళాశాల లో జరుగుతున్నాయి. సదరు కళాశాలలో పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థుల నుండి తమ కళాశాలకు చెందిన విద్యార్థుల వద్ద నుండి వెయ్యి రూపాయలు, ఇతర కళాశాల నుండి హాజరయ్యే విద్యార్థులకు 1500 రూపాయల నుండి 2500 రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు సిపిఎం నాయకులకు సమాచారం చేరింది. డబ్బులు ఇచ్చినవారు ప్రత్యేక రూములో పరీక్షలు నిర్వహించి మాస్కాపింగు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. స్పందించిన సిపిఎం నాయకులు మార్కాపురం తాసిల్దార్ గారికి అర్జీ అందజేసి సదరు కళాశాలలో ప్రత్యేకమైన స్క్వాడ్ గా విధులు నిర్వహించాలని మాస్కాపింగును అరికట్టాలని వారు అర్జీలో పేర్కొన్నారు. అర్జీ అందజేసిన వారిలో సిపిఎం మార్కాపురం పట్టణ కార్యదర్శి దగ్గుపాటి సోమయ్య పట్టణ నాయకులు పందిటి రూబెన్, ఏన...

మార్కాపురం డివిజన్ అభివృద్ధి అధికారిగా ఇటీవల నియమితులైన బివిఎన్ సాయి కుమార్ ను నేడు తన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలసి అభినందనలు తెలిపిన జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి శాసనాల వీర బ్రహ్మం.……….

డిడివో సాయి కుమార్ ను కలసిన టీడీపీ అధికార ప్రతినిధి శాసనాల వీర బ్రహ్మం.... మార్కాపురం డివిజన్ అభివృద్ధి అధికారిగా ఇటీవల నియమితులైన బివిఎన్ సాయి కుమార్ ను నేడు తన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలసి అభినందనలు తెలిపిన జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి శాసనాల వీర బ్రహ్మం.

ఈ కార్యక్రమాలను నేనే నేరుగా పర్యవేక్షిస్తా.... సచివాలయాల పరిధిలో పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి: సీఎం జగన్‌………..

ఈ కార్యక్రమాలను నేనే నేరుగా పర్యవేక్షిస్తా.... సచివాలయాల పరిధిలో పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి: సీఎం జగన్‌ 15 వేల సచివాలయాల్లో ప్రాధాన్యత పనుల కోసం రూ.3 వేల కోట్లు ఒక్కో సచివాలయానికి రూ.20 లక్షలు కేటాయించాం ఆర్బీకేలు, సచివాలయాలు, హెల్త్‌ క్లినిక్స్‌ భవనాలు అక్టోబర్‌ నెలాఖరుకు పూర్తిచేయాలి 3,966 గ్రామాల్లో డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణం డిసెంబర్‌కు పూర్తవ్వాలి కలెక్టర్లు విధిగా నెలకు ఆరు సచివాలయాలను సందర్శించాలి సచివాలయాల్లో రోజూ మధ్యాహ్నం 3 నుంచి 5 వరకు స్పందన జరగాలి ప్రతి సోమవారం జిల్లా, డివిజన్, సబ్‌ డివిజన్, మండల స్థాయిల్లో కచ్చితంగా స్పందన ప్రతి బుధవారం స్పందన వినతులపై కలెక్టర్లు సమీక్షించాలి ప్రతి గురువారం కలెక్టర్లతో స్పందనపై సీఎస్‌ సమీక్ష చేయాలి వృద్ధిరేటులో ఏపీ టాప్‌లో నిలవడం సంతోషకరం.. దేశం కంటే అధికంగా నమోదైంది. పారదర్శక విధానాలే మూల కారణం.. ఈ వృద్ధి నిలకడగా కొనసాగాలి. – ‘స్పందన’పై సమీక్షలో సీఎం జగన్‌ గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ప్రాధాన్యత పనులకు రూ.3,000 కోట్లు కేటాయించామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ప్రాధాన్యత పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టడమే కా...

మార్కాపురం పట్టణంలోని 16వ వార్డులో మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యములో "'' నమస్తే మార్కాపురం " కార్యక్రమం……………

తేది:24.08.2022, మార్కాపురం. ఈరోజు మార్కాపురం పట్టణంలో 16 వ వార్డులో మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారు "'' నమస్తే మార్కాపురం " కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులో కలియతిరుగుతూ ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జిల్లా అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం, పట్టణ అధ్యక్షులు డాక్టర్ షేక్ మౌలాలి పట్టణ ప్రధాన కార్యదర్శి కొప్పుల శ్రీనివాసులు ,రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి పటాన్ ఇబ్రహీం, మైనారిటీ నాకులు పఠాన్ గులాబ్, tntuc రాష్ట్ర కార్యదర్శి దూదేకుల మస్తానయ్య,మాజీ కౌన్సిలర్ షేక్ షేక్షవలి, తెలుగుదేశం నాయకులు బూదాల జాన్ డేవిడ్,షేక్ మహబూబ్ బాషా,మొగల్ షాకీర్,మేడిద రంగస్వామి, షేక్ మహమ్మద్, పిన్ని క శివ, షేక్ నూరుల్లా, బొమ్మిరెడ్డి రమణారెడ్డి, తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్టంలో 502 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్…………

ఆంధ్రప్రదేశ్ రాష్టంలో 502 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ పాఠశాల విద్యాశాఖ 502 టీచర్‌ పోస్టులతో డీఎస్సీ లిమిటెడ్‌ రిక్రూట్‌మెంట్‌కు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జడ్పీ, ఎంపీపీ స్కూళ్లలో 199 పోస్టులు, మోడల్‌ స్కూళ్లలో 207 పోస్టులు భర్తీ చేయనున్నారు. అలాగే మున్సిపల్‌ స్కూళ్లలో 15 పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టనున్నారు. స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ 81 పోస్టులు ఉన్నాయి. డీఎస్సీలో టెట్‌ మార్కులకు 20% వెయిటేజీ కల్పించారు. నేటి(ఆగస్టు 23) నుంచి సెప్టెంబర్‌ 17 వరకు ఫీజు చెల్లింపు గడువుగా నిర్దేశించారు. ఈనెల 25 నుంచి సెప్టెంబర్‌ 18 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. అక్టోబర్‌ 23న పరీక్ష, నవంబర్‌ 4న ఫలితాలు వెల్లడించనున్నారు.

మెదడులో కల్లోలం.. 45 ఏళ్ల లోపు వారిలోనూ..………..

మెదడులో కల్లోలం.. 45 ఏళ్ల లోపు వారిలోనూ.. అవగాహన లోపం.. జీవన శైలే ప్రధాన కారణం వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం దూమపానం, డ్రగ్స్‌ అలవాట్లతోనూ ముప్పు మహిళల్లో హార్మోన్ల ఇబ్బందులతో స్ట్రోక్‌కు చాన్స్‌ తగిన జాగ్రత్తలు అవసరం అంటున్న వైద్యులు శరీర అవయవాల పనితీరును నియంత్రించే మెదడు దెబ్బతినడం వల్ల కలిగే వ్యాధి బ్రెయిన్‌ స్ట్రోక్‌. మెదడులో రక్తం సరఫరా సరిగ్గా జరగక పోవటం, రక్తనాళాలు చిట్లటం వంటి కారణాలతో బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురై పక్షవాతం బారిన పడతారు. ఈ వ్యాధి ఒకప్పుడు వృద్ధాప్యంలో ఉన్న వారికే వచ్చేది. కానీ ప్రస్తుతం 30 నుంచి 45 ఏళ్ల లోపు యువత కూడా దీని బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. జీవన విధానంలో మార్పులు, తీవ్రమైన ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవటం వంటి కారణాల వల్ల అనేక మంది పక్షవాతానికి గురవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. 30 శాతం మంది యువతే.. ఒకప్పుడు వయస్సు 55, 60 ఏళ్ల వారిలో ఎక్కువగా బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురయ్యేవారు. కానీ ప్రస్తుతం బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురయ్యే వారిలో 25 నుంచి 30 శాతం మంది 45 ఏళ్లలోపు వారే ఉంటున్నారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ప్రతిరోజూ ...