ఆధార్ డేటా విషయంలో జాగ్రత్త.. ఈ తప్పు చేయొద్దు: ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఏ.పి.లోన్స్ యాప్ పై డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ప్రజల్ని అమప్రత్తం చేశారు. ఆధార్ డేటా, ఫింగర్ ప్రింట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. సైబర్ నేరాలపైనా అప్రమత్తం చేశారు. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు లోన్ యాప్స్, సైబర్ నేరాలపై అప్రమత్తం చేశారు ఆధార్ డేటా విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు లోన్ యాప్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి. ఈ యాప్స్‌పై ప్రత్యేక నిఘా ఉంచామని..ఇటీవల యాప్‌ల ద్వారా లోన్ తీసుకుని, తిరిగి కట్టలేక చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతుండడం బాధాకరం అన్నారు. కొన్ని ఫోన్ కాల్స్ ప్రైవేట్ నంబర్స్ నుంచి వస్తున్నాయని.. సైబర్ నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. లోన్‌యాప్ నిర్వాహకులు వేధింపులకు పాల్పడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఆధార్ డేటా, ఫింగర్ ప్రింట్స్ ఎవరికి ఇవ్వవద్దని.. లోన్‌యాప్‌ల డేటాను సేకరిస్తున్నామని, లోన్ వసూళ్లలో బయటి వ్యక్తుల ప్రమేయం ఉంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. అనంతపురం ప...
Choose people who are good for your mental health.….